కరోనా రోగులకోసం తన టయోటా కారు విరాళంగా ఇచ్చేసిన ఎమ్మెల్యే

భారతదేశంలో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు కారణంగా దేశవ్యాప్తంగా హాస్పిటల్స్ లో బెడ్ల కొరత, ఆక్సిజన్ కొరత మరియు అంబులెన్సుల కొరత ఎక్కువగా ఉంది. ఈ కఠినమైన పరిస్థితి నుంచి ప్రజలను కాపాడటానికి ప్రభుత్వాలు చాలా చర్యలు తీసుకుంటున్నాయి. కానీ పెరుగుతున్న రోగులందరికి కనీస సదుపాయాలు కూడా అందుబాటులో లేదు.

కరోనా రోగులకోసం తన టయోటా కారు విరాళంగా ఇచ్చేసిన ఎమ్మెల్యే

పెరుగుతున్న రోగుల సంఖ్య కారణంగా హాస్పిటల్స్ లో బెడ్లు సరిపోకపోవడంతో అంబులెన్స్ లోనే చాలా సేపు వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తోంది. ఈ కారణంగా అత్యవసర సమయంలో అంబులెన్సులు ఇతరులకు సరైన సమయానికి అందుబాటులో లేకుండా పోతున్నాయి.

కరోనా రోగులకోసం తన టయోటా కారు విరాళంగా ఇచ్చేసిన ఎమ్మెల్యే

ఈ నేపథ్యంలో చాలామంది యువకులు స్వచందంగా సేవ చేయడానికి తమ కార్లను అంబులెన్సులుగా మార్చి ప్రజలకు సహాయం చేస్తున్నారు. అంతే కాకుండా కొంతమంది ఆటో డ్రైవర్స్ కూడా ఆటోలను అంబులెన్సులుగా మార్చి అవసరానికి ఉపయోగపడుతున్నారు. ఇందులో ఆక్సిజన్ మొదలైన సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి.

MOST READ:మీకు తెలుసా.. భారతదేశంలో అత్యంత ఖరీదైన కాన్వాయ్‌ ఉపయోగిస్తున్న వ్యక్తి ఇతడే..

కరోనా రోగులకోసం తన టయోటా కారు విరాళంగా ఇచ్చేసిన ఎమ్మెల్యే

ఇటీవల కాలంలో రాజస్థాన్ లోని జైపూర్ ఎమ్మెల్యే తన టయోటా ఫార్చ్యూనర్‌ను అంబులెన్స్‌గా మార్చి అందించాడు. నివేదికల ప్రకారం, ఎమ్మెల్యే పేరు లక్ష్మణ్ సింగ్ మరియు అతను కాంగ్రెస్ పార్టీకి చెందిన చందుదా అసెంబ్లీ ఎమ్మెల్యే. అతడు తన వైట్ కలర్ టయోటా ఫార్చ్యూనర్‌ను తన అసెంబ్లీ బినాగంజ్ ఆరోగ్య కేంద్రానికి విరాళంగా ఇచ్చాడు.

కరోనా రోగులకోసం తన టయోటా కారు విరాళంగా ఇచ్చేసిన ఎమ్మెల్యే

ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు అధికంగా ఉండటం వల్ల రాజస్థాన్ లో కూడా కరోనా కేసులు ఎక్కువగానే ఉన్నాయి. రాజస్థాన్ లోని గుణ జిల్లాలోని చంచూడా అసెంబ్లీ నియోజకవర్గంలో అంబులెన్స్ సేవలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎమ్మెల్యే లక్ష్మణ్ సింగ్ తన కారును ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.

MOST READ:లాక్‌డౌన్ లో రోడ్డుపై కనిపించిన కొత్త జంట మెడలో పూల మాలలు వేసిన పోలీసులు[వీడియో]

కరోనా రోగులకోసం తన టయోటా కారు విరాళంగా ఇచ్చేసిన ఎమ్మెల్యే

ఈ కారణంగానే అతను తన టయోటా ఫార్చ్యూనర్‌ను అంబులెన్స్‌గా ఉపయోగించడం ప్రారంభించాడు. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే లక్ష్మణ్ సింగ్ ఈ నియోజకవర్గ స్థితిని చూపించే వీడియోను కూడా విడుదల చేసినట్లు నివేదికల ద్వారా తెలిసింది.

కరోనా రోగులకోసం తన టయోటా కారు విరాళంగా ఇచ్చేసిన ఎమ్మెల్యే

విడుదలైన వీడియోలో ఎమ్మెల్యే సింగ్ ఇక్కడ అంబులెన్స్ సకాలంలో అందుబాటులో లేదని, దీనివల్ల గ్రామస్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ కారణంగానే అతను తన కారును కరోనా బాధితుల సేవలకు ఆరోగ్య శాఖకు అప్పగించినట్లు తెలిసింది.

MOST READ:వేలానికి సిద్ధంగా ఉన్న సూపర్ కండిషన్‌లో ఉన్న 42 ఏళ్ల మెర్సిడెస్ బెంజ్; వివరాలు

కరోనా రోగులకోసం తన టయోటా కారు విరాళంగా ఇచ్చేసిన ఎమ్మెల్యే

ఈ అంబులెన్స్ 24 గంటలు ప్రజలకు సేవచేయడానికి ఉపయోగించబడుతుంది. ఈ అంబులెన్స్ సర్వీస్ కి ఎటువంటి చార్జులు వసూలుచేయబడవు. కానీ ఈ అంబులెన్స్‌ ఎవరు డ్రైవ్ చేస్తున్నారనే విషయం ఖచ్చితంగా తెలియదు.

కరోనా రోగులకోసం తన టయోటా కారు విరాళంగా ఇచ్చేసిన ఎమ్మెల్యే

ఇటీవల కాలంలో మనదేశంలో చాలా చోట్ల ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడం వల్ల ఎంతోమంది మరణించారు. కరోనా రోగులు ఎక్కువగా ఉన్న కారణంగా ఆక్సిజన్ అందరికి అందించే మొత్తంలో అందుబాటులో లేదు, ఈ కారణంగానే ప్రభుత్వం కొన్ని ఆటో మొబైల్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

MOST READ:వావ్.. అమేజింగ్ ట్యాలెంట్.. వీడియో చూస్తే హవాక్కవ్వాల్సిందే

Most Read Articles

English summary
Jaipur Rajasthan MLA Donates His Fortuner To Use As Ambulance. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X