Just In
- 12 hrs ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 13 hrs ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- 13 hrs ago
మారుతి సుజుకి కంపెనీ తలమానికం 'మారుతి స్విఫ్ట్' ; ఎందుకో తెలుసా?
- 15 hrs ago
భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?
Don't Miss
- Lifestyle
ఆదివారం దినఫలాలు : వ్యాపారులు ఈరోజు తమ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Movies
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పోలీసులు స్వాధీనం చేసుకున్న 4 కోట్ల విలువైన లంబోర్ఘిని సూపర్ కార్, కారణం ఏంటో తెలుసా ?
ఇటీవల చండీగర్ రోడ్డుపై లంబోర్ఘిని హురాకాన్ కారును చండీగ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మల్టీ మిలియన్ డాలర్ల సూపర్ కార్ చాలా వేగంగా డ్రైవింగ్ చేసినందుకు దీనిని స్వాధీనం చేసుకున్నారు.

కారు డ్రైవర్ రికార్డులు చూపించకపోవడంతో కారు ఇప్పటికీ పోలీసుల అదుపులోనే ఉంది. ఈ లంబోర్ఘిని హురాకాన్ కారు ఢిల్లీలో నమోదు చేయబడింది. పోలీసుల తనిఖీ సమయంలో కారును మమతా చౌక్ వద్ద నిలిపి ఉంచారు. కారు నడుపుతున్న వ్యక్తి అధిక వేగంతో డ్రైవింగ్ చేస్తూ తన మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతున్నాడు.

దీనికి సంబంధించిన నివేదికల ప్రకారం లంబోర్ఘిని హురాకాన్‌ను పోలీసులు ఆపినప్పుడు, ఈ కారు గంటకు 150 కి.మీ వేగంతో ప్రయాణిస్తోంది. కారు డ్రైవర్ ఆర్‌సి, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్‌తో సహా ఎలాంటి రికార్డులు చూపించలేదు.
MOST READ:గర్భిణీ భార్య కోసం 4000 కి.మీ ప్రయాణించిన భర్త

ప్రస్తుతం ఈ కారును సెక్టార్ 28 లోని ఐటిఐ పోలీస్ యార్డ్ వద్ద నిలిపి ఉంచారు. ఈ కారు ఇటాలికా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నమోదు చేయబడింది. ఈ సంస్థ లంబోర్ఘిని కంపెనీ యొక్క అధీకృత డీలర్. ఎంత జరిమానా విధించారో అనేది కచ్చితంగా అది వెల్లడించలేదు.

అయితే లంబోర్ఘిని కార్ డ్రైవర్ కి రూ. 20,000 వరకు జరిమానా విధించవచ్చు. వాహనం యొక్క డ్రైవర్ అవసరమైన అన్ని పత్రాలతో పోలీస్ స్టేషన్ కి హాజరైనప్పుడు మాత్రమే జరిమానా మొత్తం తెలుస్తుంది. సరైన రికార్డులు లేకపోతే, జరిమానా మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది.
MOST READ:లాక్‌డౌన్‌లో కారు కడిగిన ఇండియన్ క్రికెటర్ సురేష్ రైనా [వీడియో]

అంతే కాకుండా డ్రైవింగ్ లైసెన్స్‌ను 3 నెలల వరకు సస్పెండ్ చేస్తామని పోలీసులు తెలిపారు. భారత దేశం మొత్తానికి దరఖాస్తు చేసుకోవడానికి డ్రైవింగ్ లైసెన్స్ నిలిపివేయబడుతుందని చెబుతున్నారు.

భారతదేశంలో లాక్ డౌన్ కారణంగా చాలా రోడ్లు ఖాళీగా ఉన్నాయి మరియు సూపర్ కార్ మరియు సూపర్ బైక్ ఓనర్స్ దీనిని అనువుగా తీసుకుని విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే వాహనాలను అధిక వేగంతో నడుపుతున్నారు.
MOST READ:టర్బోచార్జర్‌తో తయారైన రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌ను ఎప్పుడైనా చూశారా?

బెంగళూరులో 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న సూపర్ బైక్ నిన్న పట్టుబడింది. యమహా ఆర్ 1 ఓనర్ హై స్పీడ్ బైక్ నడుపుతూ దాని వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఆ వ్యక్తిని ట్రాక్ చేసి బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. భారతదేశ రహదారుల వేగంగా ప్రయాణించే వాహనదారుల వల్ల ఇతరులకు కూడా ఇబ్బంది కలిజె అవకాశం ఉంటుంది. ఈ కారణంగా భారతీయ రోడ్లపై అధిక వేగంతో నడపడం మంచిది కాదు. రోడ్లపై అధిక వేగంతో ప్రయాణించడం వాహనదారునికి ప్రమాదం మాత్రమే కాకుండా ప్రాణాంతకం కూడా..
Image Courtesy: Punjab Kesari Haryana
MOST READ:లంబోర్ఘిని ఉరుస్ కార్ డ్రైవ్ చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్