నమ్మండి..! నిజంగా ఇది కియా కార్నివాల్ ఎమ్‌పివినే..!! డిసి డిజైన్స్ చేతిలో మరింత లగ్జరీగా మారిన కార్నివాల్

ఈ ఫొటోలలో కనిపిస్తున్న కారును చూసి మీరు కూడా ఇదేదో ఖరీదైన ఫారిన్ కారు అని భ్రమ పడ్డారు కదూ. కానీ వాస్తవానికి ఇది కొరియన్ కార్ కంపెనీ కియా మోటార్స్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న ప్రీమియం ఎమ్‌పివి కియా కార్నివాల్ (Kia Carnival). కార్ కస్టమైజేషన్ లో దేశవ్యాప్తంగా పేరుగాంచిన ప్రధాన ఆటోమోటివ్ బ్రాండ్ డిసి2 డిజైన్స్ (DC2 Designs) ఈ కియా కార్నివాల్ ఎమ్‌పివి మరింత విలాసవంతంగా తీర్చిదిద్దింది. మరి ఇందులో చేసిన మోడిఫికేషన్లు ఏంటి, అదనంగా జోడించిన ఫీచర్లు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

నమ్మండి..! నిజంగా ఇది కియా కార్నివాల్ ఎమ్‌పివినే..!! డిసి డిజైన్స్ చేతిలో మరింత లగ్జరీగా మారిన కార్నివాల్

కియా కార్నివాల్ ప్రస్తుతం భారత మార్కెట్లో లభిస్తున్న ఎంట్రీ లెవల్ లగ్జరీ ఎమ్‌పివిలలో ఒకటిగా ఉంది. అంతేకాకుండా, కియా మోటార్స్ నుండి ప్రస్తుతం భారతదేశంలో విక్రయించబడుతున్న అత్యంత ఖరీదైన వాహనం కూడా ఇదే. కాబట్టి, కియా మోటార్స్ ఈ ప్రీమియం కారులో ఇప్పటికే అనేక లగ్జరీ ఫీచర్లను మరియు ఆధునిక సాంకేతికతను అందిస్తోంది. అయితే, దీనిని నెక్స్ట్ లెవల్ కు తీసుకువెళ్లేందుకు డిసి2 డిజైన్స్, ఈ కారును మరింత అందంగా మరియు లగ్జరీగా కస్టమైజ్ చేసింది.

నమ్మండి..! నిజంగా ఇది కియా కార్నివాల్ ఎమ్‌పివినే..!! డిసి డిజైన్స్ చేతిలో మరింత లగ్జరీగా మారిన కార్నివాల్

డిసి2 డిజైన్స్ మోడిఫై చేసిన కార్నివాల్ ఎమ్‌పివిలో ఎలాంటి ప్రత్యేక ఫీచర్లను జోడించిందో వివరిస్తూ కంపెనీ తాజాగా ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో డిసి డిజైన్స్, కియా కార్నివాల్ ఎమ్‌పివి కారు లోపలి భాగాన్ని పూర్తిగా రీడిజైన్ చేసింది. డిసి డిజైన్స్ ఇంజనీర్లు ఈ కారులో కంపెనీ స్టాండర్డ్ గా అందించే అనేక రకాల స్టాక్ ఫీచర్‌లను తీసివేసి, వాటి స్థానంలో ప్రత్యేకంగా రూపొందించిన ఫీచర్‌లను ఉపయోగించారు. కారు ఎక్స్టీరియర్ నుండి ఇంటీరియర్ వరకూ మార్పులు చేర్పులు చేయబడ్డాయి.

నమ్మండి..! నిజంగా ఇది కియా కార్నివాల్ ఎమ్‌పివినే..!! డిసి డిజైన్స్ చేతిలో మరింత లగ్జరీగా మారిన కార్నివాల్

కారులోని డోర్లనన్నింటినీ పూర్తి ఎలక్ట్రిక్ డోర్లుగా మార్చారు. చిన్న స్విచ్‌ నొక్కగానే డోర్లు ఆటోమేటిక్ గా వాటంతట అవే తెరచుకుంటాయి, తిరిగి స్విచ్ నొక్కగానే వాటంతట అవే మూసుకుంటాయి. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇందులో డోర్ క్రింది భాగంలో రన్నింగ్ బోర్డులో నుంచి ఒక స్లైడింగ్ ఫుట్ రెస్ట్ కూడా బయటకు వస్తుంది, ఇది చాలా ఫ్యూచరిస్టిక్ గా అనిపిస్తుంది. కారుకి వెలుపల చేసిన మోడిఫికేషన్ల కారణంగా, డిసి డిజైన్స్ ఈ కారును పూర్తిగా ఇండిగో బ్లూ కలర్ లో తిరిగి రీపెయింట్ చేసింది.

నమ్మండి..! నిజంగా ఇది కియా కార్నివాల్ ఎమ్‌పివినే..!! డిసి డిజైన్స్ చేతిలో మరింత లగ్జరీగా మారిన కార్నివాల్

మోడిఫైడ్ కార్నివాల్ ఎమ్‌పివి లోపల ఎక్కువ మార్పులు చేయబడ్డాయి. ఇందులోని స్టాండర్డ్ సీట్లను తొలగించి, వాటి స్థానంలో రెండు పూర్తిస్థాయి కెప్టెన్ సీట్లను ఉపయోగించారు. ఇవి కూడా పూర్తి ఎలక్ట్రిక్ సీట్లు. వీటిలో స్లైడింగ్, రిక్లైనింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. ఇవి లాంజ్ సీట్ లాంటి అనూభూతిని అందిస్తాయి. ఈ రెండు కెప్టెన్ సీట్లకు ఎదురుగా మరో రెండు సీట్లు ఉంటాయి. అయితే, ఫోల్డ్ చేయబడి ఉంటాయి. కారులో అదనంగా మరో రెండు సీట్లు కావాలనుకుంటే, వీటిని అన్‌ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇవి కూడా ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ సీట్లుగా ఉంటాయి.

నమ్మండి..! నిజంగా ఇది కియా కార్నివాల్ ఎమ్‌పివినే..!! డిసి డిజైన్స్ చేతిలో మరింత లగ్జరీగా మారిన కార్నివాల్

సాధారణంగా, కియా కార్నివాల్ 6-సీటర్ నుండి 9-సీటర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. అయితే, డిసి డిజైన్స్ మాత్రం ఈ కారును ఓ 6-సీటర్ కారుగా మార్చింది. ముందు వరుసలో డ్రైవర్, కో-ప్యాసింజర్ కోసం రెండు సీట్లు మరియు వెనుక క్యాబిన్‌లో ఎదురెదురుగా ఉండే నాలుగు సీట్లు ఉంటాయి. డ్రైవర్ క్యాబిన్‌ను ప్యాసింజర్ క్యాబిన్‌తో వేరు చేసేందుకు దీని మధ్యలో ఓ పార్టిషన్ ఉండటాన్ని కూడా మనం ఇందులో చూడవచ్చు. ఈ పార్టిషన్ మధ్యలో ఓ టెలివిజన్ కూడా అమర్చబడి ఉంటుంది. ఒక చిన్న బటన్ నొక్కానే ఈ స్క్రీన్ పైకి మడుచుకొని, డ్రైవర్ క్యాబిన్‌కు యాక్సెస్ కల్పిస్తుంది.

నమ్మండి..! నిజంగా ఇది కియా కార్నివాల్ ఎమ్‌పివినే..!! డిసి డిజైన్స్ చేతిలో మరింత లగ్జరీగా మారిన కార్నివాల్

క్యాబిన్ అనుభూతిని మరింత విలాసవంతంగా మార్చేందుకు ఇందులో సీలింగ్ కు అమర్చిన ఎల్ఈడి లైట్లు, మూడ్ లైటింగ్, రీడింగ్ లైట్లు మరియు ఏసి వెంట్లు, సెంటర్ ఆర్మ్‌రెస్ట్‌లు, చిన్న సైజు ఫ్రిజ్, ఎలక్ట్రికల్ కర్టెన్స్ వంటి మరెన్నో మార్పులను ఈ డిసి డిజైన్స్ మోడిఫైడ్ కియా కార్నివాల్ ఎమ్‌పివిలో ఉన్నాయి. డిసి డిజైన్స్ సంస్థ తమ వినియోగదారుల కోరిక మేరకు కార్లను మరియు వివిధ రకాల వాహనాలను ప్రత్యేకంగా కస్టమైజ్ చేస్తుంది. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా కొందరి ప్రముఖుల కోసం ఈ కంపెనీ కార్లు మరియు కారావాన్లను కూడా కస్టమైజ్ చేసి ఇచ్చింది.

కియా కార్నివాల్ ఎమ్‌పివి విషయానికి వస్తే, కియా ఇండియా ఈ ఎమ్‌పివిని తొలిసారిగా గడచిన ఫిబ్రవరి 2020 నెలలో భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతం, భారత మార్కెట్లో కియా కార్నివాల్ ధర రూ. 24.95 లక్షల నుండి రూ. 33.99 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంటుంది. ఇది కేవలం డీజిల్ ఇంజన్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తుంది. ఈ ఎమ్‌పివిలో 2.2-లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 200 బిహెచ్‌పి పవర్‌ను మరియు 440 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో స్టాండర్డ్‌గా జతచేయబడి ఉంటుంది.

Article Published On: Tuesday, April 12, 2022, 9:08 [IST]
English summary
Check out this ultra luxury kia carnival mpv from dc2 design
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+