టూరిస్ట్ కారులోకి దూరిన చిరుత.. వైరల్ అవుతున్న వీడియో

చాలా మంది ప్రకృతి ప్రేమికులకు అడవుల్లో, పెద్ద పెద్ద జంగిల్ సఫారీలలో తిరగడమంటే చాలా ఇష్టం. కావున అలాంటి వారు అప్పుడప్పుడు జంగిల్ సఫారీలో తిరుగుతూ ఉంటారు. అలాంటి సమయాల్లో అనుకోని ప్రమాదాలు ఆహ్వానించని అతిధుల రూపంలో వస్తుంటాయి. ఇటీవల అలాంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది.

జంగిల్ సఫారీలలో సంచరించేటప్పుడు అడవి జంతువులు మనుషులకు చాలా దగ్గరగా వచేస్తుంటాయి. ఇలాంటి సంఘటనలు గతంలో కూడా చాలానే వెలుగులోకి వచ్చాయి. కాగా ఇలాంటి మరో సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో బ్రిటన్ హేస్ అనే వ్యక్తి సఫారీలో కారులో ఉండటం చూడవచ్చు. అప్పుడు వీడియో కూడా రికార్డ్ అవుతూనే ఉంది. వెంటనే ఆ కారులోకి ఒక చిరుత ప్రవేశించింది.

టూరిస్ట్ కారులోకి దూరిన చిరుత

ఈ వీడియోలో మీరు గమనించినట్లయితే ఆ చిరుత కారులో అటు ఇటూ చూస్తూ ఉంది. ఆ సమయంలో ముందు సీటులో ఆ వ్యక్తి కూర్చుని ఉన్నాడు. కానీ ఆ వ్యక్తి ఏ మాత్రం గాబరా పడకుండా చాలా నిశ్చలంగా ఉన్నాడు. కొంత సేపు ఆ చిరుత లోపల గమనిస్తూనే ఉంది. ఆ తరువాత మరో చిరుత కారు యొక్క బోనెట్ మీదకి చేరుతుంది. దీనిని కూడా వీడియోలో చూడవచ్చు.

వీడియో చూసేవారికే కొంత భయాన్ని కలిగిస్తుంది. కానీ ఆలాంటి సందర్భంలో కూడా కారులోకి వ్యక్తి చాలా నేర్పుగా ఉండటం గొప్ప విషయం. ఈ సంఘటన టాంజానియా అడవుల్లో జరిగినట్లు తెలుస్తుంది. ఈ వీడియోను 'తన్సు యెగెన్' అనే వ్యక్తి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. దీనికి టాంజానియాలోని సఫారీలో ఓ వ్యక్తి ఎలాంటి కదలిక లేకుండా ఏం జరుగుతోందో రికార్డ్ చేయడం మొదలుపెడతాడు అనే క్యాప్సన్ పెట్టాడు.

ఈ వీడియోకి పదహారు వేలకంటే ఎక్కువ లైకులు వచ్చాయి. ఈ వీడియోపైన కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. నిజానికి ఇలా చేయడం చాలా ప్రమాదం మాత్రమే కాదు, ప్రాణాంతకం కూడా. ఎందుకంటే చిరుతలు క్రూర మృగాలు. కావున అవి మనుషుల మీదకి దాడి చేస్తాయి. ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ఎంత నేర్పుగా ఉన్నప్పటికీ ఆ చిరుత అతని మీద దాడి చేసి ఉంటే ఏమి జరిగేదో ఊహించవచ్చు.

ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ వీడియోలో కనిపించే వ్యక్తి ఒక్క సహనాన్ని చాలామంది ప్రశంసిస్తున్నారు. కానీ ఇలాంటి సాహసాలకు ఎవరూ పాల్పడకుండా ఉండటం మంచిది. ఎందుకంటే ఆ వ్యక్తి అదృష్టం బాగుండో.. లేక ఇతర కారణాల వల్ల ప్రమాదం జరగలేదు. కానీ అన్ని వేళలా ఇలాగె ఉంటుందనుకోవడం చాలా పొరపాటు. కావున ఎవరూ ఇలా చేయడానికి పూనుకోకుండా ఉండటం చాలా వరకు శ్రేయస్కరం.

ఇదిలా ఉండగా గత కొన్ని రోజులకు ముందు మైసూరు సమీపంలోని 'కబిని నేషనల్ పార్క్' లో ఒక అడవి ఏనుగు 'మహీంద్రా బొలెరో' కారును వెంబడించింది. అయితే ఆ కారులోని డ్రైవర్ మాత్రం, ఏ మాత్రం చలించకుండా ఎంతో చాక చక్యంగా కారుని రివర్స్ గేర్ లో చాలా దూరం తీసుకువచ్చేసాడు. చివరికి ఆ ఏనుగు వెనుకకు తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది. అప్పుడు డ్రైవర్ పక్కనే ఉన్న వ్యక్తి హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నాడు.

ఆ వీడియోను 'సుప్రియా సాహు' ఐఏఎస్ తన ట్విట్టర్ ప్రొఫైల్ లో షేర్ చేశారు. నిజానికి ఆ వీడియోలో ఆ డ్రైవర్ నైపుణ్యం చూస్తే ఎవ్వరైనా ఫిదా అయిపోతారు. అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు అనుకోకుండా జరుగుతాయి. కావున ఆ సంఘటనను ఎదుర్కునే వ్యక్తులు చాలా నేర్పుగా మరియు దైర్యంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Thursday, December 15, 2022, 11:38 [IST]
English summary
Cheetha jumped into tourist car video
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+