ఒకప్పుడు రెస్టారెంట్‌లో వెయిటర్.. నేడు కోట్ల రూపాయల కార్లకు ఓనర్
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే మాటకు నిదర్శనం సురేష్ పిళ్ళై. ఒకప్పుడు రెస్టారెంట్‌లో వెయిటర్‌గా జీవితాన్ని ప్రారంభించి.. ఇప్పుడు రిచెస్ట్ చెఫ్‌గా మారిన ఈయన ఖరీదైన అన్యదేశ్య కార్లను కలిగి ఉన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
నిజానికి సురేష్ పిళ్ళై తన 17 సంవత్సరాల వయసులో స్థానిక రెస్టారెంట్‌లో వెయిటర్‌గా జీవితం ప్రారంభించారు. వంట చేయడంలో అమితమైన ఆసక్తి కలిగిన ఈయన.. అందులో తన ప్రతిభను, అభిరుచిని ప్రదర్శించారు. ప్రారంభంలో టేబుల్ వద్ద వడ్డించడంతో మొదలై.. వంటగదిలో పనిచేసే వరకు ఎదిగారు. నిబద్దతతో వంటలు చేయడం బాగా నేర్చుకున్నారు. ఆ తరువాత లండన్ పయనమయ్యారు.

లండన్ వెళ్లి అక్కడే 15 సంవత్సరాల ప్రముఖ రెస్టారెంట్లలో పనిచేసి నైపుణ్యం సంపాదించుకున్నారు. ఆ తరువాత భారతదేశానికి తిరిగి వచ్చి.. 2021 సొంతంగా రెస్టారెంట్ వెంచర్ ప్రారంభించారు. దీంతో బాగా డబ్బు సంపాదించి లక్షాధికారి అయ్యారు. జీవితంలో ఎన్నో కష్టాలను చూసి.. అంచెలంచెలుగా ఎదిగి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఈ రోజు ఖరీదైన లగ్జరీ కార్లను ఉపయోగించే స్థాయికి చేరారు.
కష్టాల వారధి దాటి.. జీవితంలో స్థిరపడిన పిళ్ళై ఒక ఇంటర్వ్యూలో తన జీవితం గురించి వెల్లడించారు. ఈయన ప్రస్తుతం మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన ఎస్-350డీ వేరియంట్ కొనుగోలు చేశారు. దీని ధర రూ.1.60 కోట్లు. ఈ సెడాన్ 3.0 లీటర్ వీ6 డీజిల్ ఇంజిన్ కలిగి 282 Bhp పవర్ మరియు 600 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి మంచి పనితీరుని అందిస్తుంది.

పిళ్ళై తాను కొనుగోలు చేసిన మెర్సిడెస్ బెంజ్ కారుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఇందులో కలలు అంటే వెంటాడి పట్టుకోవాలి.. నా 43 సంవత్సరాల జీవితంలో నాకు ఒక కారు కూడా లేదు. నాకు కార్ల పట్ల, డ్రైవింగ్ పట్ల పెద్దగా ఆసక్తి లేదు. లండన్‌లో 15 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఏ లగ్జరీ కారును కొనుగోలు చేయలేదని పోస్ట్ చేశారు.
పిళ్ళై మెర్సిడెస్ బెంజ్ కారును మాత్రమే కాకుండా పోర్స్చే కయెన్ కారును కూడా కొనుగోలు చేశారు. దీని ధర రూ.1.42 కోట్లు. ఇది బ్రాండ్ యొక్క టాప్ ఆప్ ది లైన్ కయెన్ కూపే వేరియంట్. ఈ కారు 3.0 లీటర్ వీ6 టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 340 పీఎస్ పవర్ మరియు 450 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పనితీరు పరంగా అద్భుతంగా ఉంటుంది.
ఒక సాధారణ వ్యక్తి వెయిటర్ స్థాయి నుంచి.. కోట్లు ఖరీదైన కార్లను ఉపయోగించే స్థాయికి ఎదిగారు అంటే.. అది గొప్ప మాత్రమే కాదు, అంతకు మించి అనే చెప్పాలి. నీ సంకల్పం దృడంగా ఉంటే అనుకున్నవన్నీ సాధించగలవు అనటానికి పిళ్ళై నిలువెత్తు నిదర్శనం. ఈయన ఎంతోమందికి ఆదర్శం. రాబోయే రోజుల్లో ఈయన మరిన్ని ఖరీదైన కార్లను కొనుగోలు చేసి ఉపయోగించాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








