త్వరలో పూర్తి కానున్న చెన్నై- బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ వే.. ఈ ప్రాజెక్ట్‌తో ఆంధ్రప్రదేశ్‌కి ఎన్నో లాభాలు.!!

దేశంలో ప్రధాన నగరాలైన చెన్నై, బెంగళూరు(Chennai- Bengaluru Expressway) మధ్య ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణం త్వరలో పూర్తి కానుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌ వే ద్వారా ఈ రెండు ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం దాదాపు 3 గంటలు తగ్గనుంది. ఈ ఎక్స్‌ప్రెస్ వే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కర్టాటక రాష్ట్రాల మీదుగా వెళ్తుంది.

చెన్నై- బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ వే ద్వారా ప్రయాణికులకు సమయం ఆదా అవ్వడమే కాకుండా ఫ్యూయెల్‌ ఖర్చులు కూడా గణనీయంగా తగ్గుతాయి. అంతేకాకుండా వాణిజ్యపరంగా ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు ఈ ఎక్స్‌ప్రేస్‌ వే ద్వారా చెన్నై పోర్టుకు కనెక్ట్‌ అవుతాయి. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా ఈ మూడు రాష్ట్రాల్లో ఆర్థిక కార్యకలాపాలు సులభతరం కానున్నాయి.

Chennai- Bengaluru-Expressway

కాగా చెన్నై- బెంగళూరు ఎక్స్‌ప్రెస్ వే మొత్తం 285.3 కి.మీ దూరంతో నాలుగు లేన్ల ప్రాజెక్ట్‌గా రూపొందించారు. చెన్నై, బెంగళూరు నగరాల్లో ట్రాఫిక్‌, పొల్యూషన్‌ ఎంత ఉంటుందో తెలిసిందే. ఈ ఎక్స్‌ప్రెస్‌ వే ద్వారా ట్రాఫిక్‌ రద్దీ, కాలుష్యం చాలా వరకు తగ్గుతుంది. అంతేకాకుండా వాణిజ్యపరంగా లాజిస్టిక్స్‌ ఖర్చులు కూడా తగ్గుతాయి.

సాధారణంగా అయితే చెన్నై, బెంగళూరు మధ్య ప్రయాణించడానికి 6 నుంచి 7 గంటల సమయం పడుతుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌ వే అందుబాటులోకి వస్తే ఆ సమయంలో 3 నుంచి 4 గంటలు తగ్గుతుంది. ఈ ప్రాజెక్టు మార్చి 2024లో పూర్తవుతుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా( NHAI) ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ మొత్తం అంచనా వ్యయం రూ. 17,000 కోట్లు. ఈ క్రమంలో ఇక్కడ మీకు చెన్నై- బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ వే ప్రాజెక్టు కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీతో పంచుకుంటున్నారు.

ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయితే వచ్చే ఏడాది త్రైమాసికంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో పరిమిత వేగం గంటకు 120 కి.మీ అని వాహనదారులు గుర్తుంచుకోవాలి. ఈ రూట్‌ ద్వారా రెండు నగరాల మధ్య దూరం దాదాపు 80 కి.మీ తగ్గిందని అధికారులు చెబుతున్నారు.

ఈ ఎక్స్‌ప్రెస్ వే ద్వారా ట్రాఫిక్ మరియు పొల్యూషన్ చాలా వరకు తగ్గనుంది. అంతే కాకుండా రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. కాగా చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ (CBIC)ని ప్రత్యేకమైన తయారీ మరియు పారిశ్రామిక కేంద్రంగా ప్రోత్సహించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.

ఈ ఎక్స్‌ప్రెస్ వేపై 5 ప్రధాన ఇంటర్‌ఛేంజ్‌లు ఉంటాయి. అంతేకాకుండా ఎక్స్‌ప్రెస్‌ వేపై ప్రయాణికులకు అనేక సౌకర్యాలను కల్పిస్తున్నారు. ట్రక్కులు మరియు పాదచారులకు ఒక బేను ఏర్పాటు చేశారు. ఇంకా ట్రాఫిక్ నిర్వహణ కోసం ఒక వ్యవస్థ, పశువులు రోడ్డు దాటేందుకు అండర్‌పాస్, ఇతర వాహనాలకు అండర్‌పాస్‌ సౌకర్యం ఉంది.

ఈ ఎక్స్‌ప్రెస్‌వే బెంగళూరులోని హోస్కోట్‌ నుంచి ప్రారంభమవుతుంది. చెన్నైలోని శ్రీపెరంబుదూర్‌ వద్ద ఎండ్‌ అవుతుంది. ఈ ప్రాజెక్టు రాకతో దీనికి సమీపంలో అనేక ఇండస్ట్రియల్‌ పార్కులు ఏర్పాటు కానున్నాయి. మహీంద్రా, నిస్సాన్, బజాజ్ వంటి అనేక ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు ఈ ఎక్స్‌ప్రెస్‌వేకి సమీపంలో తమ ప్లాంట్‌లను నిర్మించాలని ప్రణాళికలు రచిస్తున్నాయి.

చెన్నై- బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌వేలో 17 ఫ్లైఓవర్‌లు, 41 వాహనాల అండర్‌పాస్‌లు, 52 పాదచారుల అండర్‌పాస్‌లు, 143 కల్వర్టులు, 162 వంతెనలు ఇంకా 4 రైల్వే క్రాసింగ్‌లు ఉంటాయి. కాగా మొత్తం వంతెనల్లో తొమ్మిది ప్రధాన వంతెనలు, తొమ్మిది మధ్యస్థ వంతెనలు, 144 చిన్న వంతెనలు ఉన్నాయి.

అయితే ఈ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించినప్పుడు దీనిని మొత్తం ఎనిమిది లేన్లుగా NHAI అధికారులు పరిగణించారు. కానీ ఆ తర్వాత 2022లో నాలుగు లేన్‌లకు తగ్గించారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే మధ్యస్థం 21 మీటర్ల వెడల్పుతో ఉంటుందని అంచనా. అయితే ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తులో ఎనిమిది లేన్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది.

ముంబయి- పూణె ఎక్స్‌ప్రెస్‌ వే మాదిరిగా మొదట్లో బెంగుళూరు- చెన్నై ఎక్స్‌ప్రెస్ వే అంచనా వ్యయం రూ. 20,000 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. మొత్తం బడ్జెట్‌లో అధిక భాగాన్ని ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి వెచ్చించాలని నిర్ణయించారు. ఇంకా ట్రాఫిక్ కంట్రోలింగ్‌ సిస్టమ్‌, ప్రాజెక్ట్ మెయింటెనెన్స్‌, వాహనాలు, భూసేకరణ, టోల్ యాక్టివిటీస్‌ మొదలైన వాటికి తక్కువ ఖర్చు చేయాలని భావించారు.

ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు భూ సేకరణ ఖర్చు సుమారు రూ. 60 లక్షలు అని సమాచారం. కాగా ఈ ప్రాజెక్ట్‌ దక్షిణ భారతదేశంలో కీలకమైన ప్రాజెక్ట్‌ కావడంతో దీని ప్రభావం రియల్ ఎస్టేట్‌పై ఎక్కువగా ఉంటుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే పూర్తయితే రియల్ ఎస్టేట్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, October 5, 2023, 20:17 [IST]
English summary
Chennai bangalore expressway will be completed by march 2023 everything you need to know
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+