ఉద్యోగులకు ఏకంగా బెంజ్.. పండుగకు 28 కార్లు, 29 బైక్‌లను గిఫ్ట్ ఇచ్చిన కంపెనీ
కంపెనీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులకు, యజమాని ఊహించని బహుమతిని అందించి, అందరిని షాక్‌కు గురిచేశారు. దసరా సందర్బంగా ఏకంగా ఖరీదైన కార్లు, బైక్‌లను ఉద్యోగులకు గిఫ్ట్‌గా ఇచ్చారు. చెన్నైలోని టీమ్ డిటైలింగ్ సొల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్(MD) శ్రీధర్ కన్నన్ తన ఉద్యోగుల పనితీరుకు మెచ్చి మెర్సిడెస్-బెంజ్, మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్ వంటి లగ్జరీ బ్రాండ్‌లకు చెందిన 28 కార్లు, టీవీఎస్ వంటి కంపెనీలకు చెందిన 29 బైక్‌లు, స్కూటీలను అందించారు. ఉద్యోగులకు జీతాలు కూడా సరిగ్గా ఇవ్వని కంపెనీలు ఉన్న కాలంలో ఏకంగా లక్షలు విలువ చేసే ఖరీదైన కార్లు, బైక్‌లను గిఫ్ట్‌గా ఇవ్వడంతో ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
టీమ్ డిటైలింగ్ సొల్యూషన్స్ 19 ఏళ్లుగా చెన్నైలో కార్యకలాపాలను నిర్వహిస్తుంది. గత కొన్నేళ్లుగా ఉద్యోగులు మంచి పనితీరును కనబరచడం వలన సంస్థ ఆదాయం క్రమంగా పెరుగుతుంది. దీంతో పని పట్ల ఉద్యోగుల అంకితభావాన్ని గుర్తించిన యజమాని శ్రీధర్ వారి కోసం ఏదైనా చేయాలని అనుకుని, ప్రోత్సాహకరంగా ఖరీదైన కార్లు, బైక్‌లను గిఫ్ట్‌గా ఇవ్వాలని నిర్ణయించారు.

ఇదే సంస్థలో 10 ఏళ్లకు పైగా పనిచేస్తున్న వారికి Mercedes Benz,Tigur, Maruti Suzuki Swift,Hyundai i10, Kia Seltos, Tata Nexon, Ertiga, Brezza వంటి ఖరీదైన 28 కార్లను, అలాగే, 7 ఏళ్లకు పైగా పనిచేస్తున్న ఉద్యోగులకు సుజుకీ యాక్సెస్ 125, TVS జూపిటర్ 110, TVS రైడర్ 125 వంటి 29 బైక్‌లు, స్కూటీలను గిఫ్ట్‌లుగా ఇచ్చారు.
ఇటీవల నవలూరులోని క్యాంపస్‌లో ఆయుధ పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి కంపెనీ ఉద్యోగులు వారి కుటుంబంతో కలిసి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కార్లు, బైక్‌లను గిఫ్ట్‌లుగా ఇస్తున్నట్లు ప్రకటించారు. తమ యజమాని ఇచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్‌కు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. సంస్థలో సుదీర్ఘకాలం సేవలందించిన ఉద్యోగులుగా ఇలాంటి గిఫ్ట్‌లు పొందండంపై వారంతా సంతోషం వ్యక్తం చేశారు.

శ్రీధర్ కన్నన్ తన ఉద్యోగులకు గిఫ్ట్‌లు ఇవ్వడానికి ఆరు నెలల నుంచే ప్రణాళికలు వేసుకున్నారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేక రోజు ఎంచుకుని పండుగ సమయంలో ఉద్యోగుల ముఖంలో సంతోషాన్ని నింపారు. రూ.6 లక్షల నుంచి మొదలుకుని రూ.10 లక్షల వరకు విలువ కలిగిన కార్లను గిఫ్ట్‌గా ఇచ్చారు.
ఉదాహరణకు మారుతీ సుజుకీ స్విఫ్ట్ పెట్రోల్/CNG ఇంజిన్ ఆప్షన్లలో ఉండే కారు ధర రూ.6.49 నుండి 9.60 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. టాటా టిగుర్ సెడాన్ రూ.6 లక్షల నుండి రూ.9.40 లక్షల ఎక్స్-షోరూమ్ ధరలో లభిస్తుంది. ఇది పెట్రోల్, CNG ఇంజిన్ ఎంపికలలో అందుబాటులో ఉంది. ఉద్యోగులకు కార్లు, బైక్‌లను గిఫ్ట్‌గా ఇవ్వడానికి రూ.3.5 కోట్లు వెచ్చించినట్లు సమాచారం.

టీమ్ డిటైలింగ్ సొల్యూషన్స్ ఎండీ శ్రీధర్ కన్నన్ మాట్లాడుతూ, 'మా కంపెనీ 19 ఏళ్ల క్రితం 4 మంది ఉద్యోగులతో ప్రారంభమైంది. ప్రస్తుతం 180 మంది ఉద్యోగులు ఉన్నారు. వారంతా కూడా నిరాడంబరమైన స్థాయి నుంచి వచ్చారు. అందరూ అత్యంత నైపుణ్యం కలిగి ఉన్నారు. ఉద్యోగులు మా సంస్థకు గొప్ప ఆస్తి. వారి అంకితభావం, నిబద్ధత సంస్థను ముందుకు నడిపించాయని అన్నారు.
ముఖ్య విషయం ఏమిటంటే, ఈ కంపెనీ తమ ఉద్యోగులకు గిఫ్ట్‌లు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. 2022లో మంచి ప్రతిభ కనబరిచిన ఇద్దరు సీనియర్ ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చింది. కొంత మందికి బైక్‌లను సైతం అందించారు. అలాగే, ఉద్యోగుల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం సైతం అందజేస్తుంది. సంస్థ ఇటీవలే దీనిని రూ.50,000 నుంచి రూ.లక్షకు పెంచింది.


Click it and Unblock the Notifications








