చెన్నైలో బిఎమ్‌డబ్ల్యూ, ఆడి మరియు ఫోర్షే కార్లు వేలం: ప్రారంభ ధర 5 లక్షలు
రండి బాబు రండి మంచి తరుణం మించిన దొరకదు... ఒక పోర్షే కారు కేవలం ఐదు లక్షలు మరియు ఒక బిఎమ్‌డబ్ల్యూ కారు ఎనిమిది లక్షలు మాత్రమే త్వరపడండి. మేము వ్రాసింది నిజమే మీరు చదివింది నిజమే. చెన్నై వరదలలో కొంచెం పాడుబడిన కార్లకు వేలం నిర్వాహకులు ఇలాంటి ఆశ్చర్యకరమైన రేట్లతో వేలం నిర్వహిస్తున్నారు.
Also Read: ప్రపంచ వ్యాప్తంగా గల ఉత్తమ విమానాలు....
ఇందులో అత్యంత ఖరీదైన బిఎమ్‌డబ్ల్యూ, ఆడి మరియు పోర్షే వంటి కార్లను కేవలం 5 లక్షల రుపాయల ప్రారంభం ధరతో వేలం నిర్వహించనున్నారు. దీనికి సంభందించిన మరిన్ని వివరాలు క్రింది కథనంలో తెలుసుకుందాం రండి.

అమెరికా ఆధారిత వేలం నిర్వహణ సంస్థ చెన్నైలో వరదల బారిన పడిన అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు వేలం నిర్వహించనుంది.

వీరి అధికారిక వైబ్‌సైట్ కోపార్ట్.ఇన్ (copart.in) ద్వారా దాదాపుకు 100 వరకు కార్లను అందుబాటులో ఉంచారు.

అయితే ఈ సంస్థకు కొన్ని బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు మరియు డీలర్ల నుండి తమ వాహనాలకు కూడా వీరి వెబ్‌సైట్ ద్వారా వేలం నిర్వహించాలని కోరినట్లు తెలిపారు.

ఈ వేలం పాటలో గల కార్లన్ని కూడా 2014 మరియు 2015 మోడల్ కు చెందిన కార్లే అని తెలిపారు. అయితే కార్ల యొక్క కండీషన్ వేలం నిర్వాహకులకు ఏ మాత్రం సంభందం ఉండదని మరియు ఎంచుకునే ముందు అన్నివివరాలు పరిశీలించుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

ప్రస్తుతం జరిగే వేలం పాటలో బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ కారు 6 లక్షలకు, 2015 మోడల్ ఆడి ఎ4 కారు 3.4 లక్షలకు మరియు పోర్షో క్యానాన్ 2012 మోడల్ కారు 5 లక్షల రుపాయలకు వేలంలో అందుబాటులో ఉన్నాయి.

ఈ వారం కొత్తగా 10 కార్లు వచ్చి చేరడంతో ప్రస్తుతం వేలంలో అందుబాటులో ఉన్న కార్ల సంఖ్య 108 కు చేరింది. మరియు ప్రతి వారం కూడా వీటికి వేలం నిర్వహించనున్నారు.

అయితే ఇందులో మీరు కూడా పాల్గొనాలనుకుంటున్నారా ? మీరు చేయాల్సిందల్లా వీరి అధికారిక వెబ్‌సైట్‌లో మీ వివరాలు నమోదు చేసుకుని రీఫండబుల్ డబ్బును వారికి చెల్లించాల్సి ఉంటుంది. ఆ తరువాత మీరు కూడా ఈ వేలం పాటలో కార్లను ఎంపిక చేసుకోవచ్చు.

అయితే ఈ వెబ్‌సైట్‌లో పేర్లను నమోదు చేసుకునే అశక్తిపరుల సంఖ్య పెరిగే కొద్ది ఈ వేలం పాటను ఇంకా మూడు నెలల వరకు పొడగించనున్నట్లు దీని నిర్వాహకులు తెలిపారు.

వీటిని వ్యక్తిగత అవసరాలకు మాత్రమే కాకుండా. ఈ కార్లలలోని విడిపరికరాలను తిరిగి అమ్ముకోవడానికి కూడా వేలం ద్వారా దక్కించుకుంటున్నట్లు తెలిసింది. ఎందుకంటే కొన్ని విడి భాగాలు ఎంతో ఖరీదుతో కూడుకున్నవి మరియు మార్కెట్లో కూడా ఇవి లభించవు.

కార్లను ఆన్‌లైన్ ద్వారా వేలాన్ని నిర్విహించే మరొక సంస్థ కూడా ఉంది. ఆటో మార్ట్ అనే సంస్థ దాదాపుగా 10,000 వరకు వరదల బారిన పడిన కార్లను అందుబాటులో ఉంచింది.

అయితే చెన్నైలో వేలం పాట నిర్వహించే కార్లను ముంబాయ్, ఢిల్లీ, గుజరాత్ మరియు పంజాబ్ కు చెందిన వారు దక్కించుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.

- 2020లో కార్లు ఆధునిక సాంకేతిక సౌకర్యాలతో వస్తాయి-ప్రత్యేక సేకరణ
- 2016లో భారతీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త కార్లు, వాటి వివరాలు


Click it and Unblock the Notifications








