ఉద్యోగుల కళ్ళలో దీపావళి చూసిన యజమాని.. గిఫ్ట్‌గా కార్లు & బైకులు

విజయదశమి మరియు దీపావళి పండు వస్తుందంటే దాదాపు ఉద్యోగులకు పండగే. ఎందుకంటే వారు పనిచేసే సంస్థలు బోనస్ ఇవ్వడం గానీ గిఫ్ట్స్ ఇవ్వడం గానీ ఉంటుంది. అయితే కొంతమంది యజమానులు తమ ఉద్యోగులకు కళ్ళు చెదిరే గిఫ్ట్స్ ఇచ్చి ఆశ్చర్య పరుస్తూ ఉంటారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు కూడా ఇలాంటి సంఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.

ఉద్యోగుల కళ్ళలో దీపావళి చూసిన యజమాని.. గిఫ్ట్‌గా కార్లు & బైకులు

తమిళనాడు రాజధాని చెన్నైలో ఉండే చల్లని (CHALLANI) జ్యువెల్లరీ షాప్ యజమాని తమ షాపులో పనిచేసే ఉద్యోగులకు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసి కార్లను మరియు బైకులని గిఫ్ట్స్ గా అందించడానికి పూనుకున్నాడు. ఇందులో దాదాపు 1.2 కోట్లు ఖర్చు చేసి 10 కార్లను కొనుగోలు చేసాడు. అంతే కాకుండా 20 వరకు బైకులను కూడా కొనుగోలు చేశారు.

ఉద్యోగుల కళ్ళలో దీపావళి చూసిన యజమాని.. గిఫ్ట్‌గా కార్లు & బైకులు

చల్లని (CHALLANI) జ్యువెల్లరీ షాప్ యజమాని 'జయంతి లాల్‌ ఛయంతి' కొనుగోలు చేసిన 10 కార్లు మారుతి కంపెనీకి చెందినవి ఇక్కడ కనిపించే ఫోటోల ద్వారా తెలుస్తోంది. ఇక బైకులు మరియు స్కూటర్ విషయానికి వస్తే ఇవన్నీ హోండా మోటార్ సైకిల్ కంపెనీకి చెందినవని తెలుస్తోంది.

ఉద్యోగుల కళ్ళలో దీపావళి చూసిన యజమాని.. గిఫ్ట్‌గా కార్లు & బైకులు

ఈ నెల 24 న దీపావళి జరగనుంది. ఈ పండుగకు తన ఉద్యోగులకు గిఫ్ట్స్ గా ఈ కార్లను మరియు బైకులను అందించారు. ఈ గిఫ్ట్స్ అందుకున్న ఉద్యోగులు ఎంతగానో సంతోషం వ్యక్తం చేశారు. నిజానికి ఇలాంటి ఖరీదైన గిఫ్ట్స్ అందించే యజమానులు సంఖ్య చాలా తక్కువ. అలంటి వారిలో 'జయంతి లాల్‌ ఛయంతి' ఒకరు.

ఉద్యోగుల కళ్ళలో దీపావళి చూసిన యజమాని.. గిఫ్ట్‌గా కార్లు & బైకులు

జ్యువెలరీ షాప్ యజమాని మాట్లాడుతూ.. నా షాపులో పనిచేసే ఉద్యోగులు నా కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ నాకు లాభాలు తీసుకురావడంలో అహర్నిశలు కష్టపడుతున్నారు. వారు కేవలం నా షాపులో పనిచేసే ఉద్యోగులు మాత్రమే కాదు, నా కుటుంబంలో సభ్యులు కూడా అన్నారు.

ఉద్యోగుల కళ్ళలో దీపావళి చూసిన యజమాని.. గిఫ్ట్‌గా కార్లు & బైకులు

నేను ఈ రోజు అందించిన ఈ గిఫ్ట్స్ వారికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. అంతే కాకుండా ఇంకా వారు తమ పనిని మరింత అంకితభావంతో చేస్తారు. మరిన్ని లాభాలు రావడానికి వారు దోహదపడతారు. ఈ విధంగా నా ఉద్యోగులను గౌరవించడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు.

ఉద్యోగుల కళ్ళలో దీపావళి చూసిన యజమాని.. గిఫ్ట్‌గా కార్లు & బైకులు

గతంలో కూడా చల్లని (CHALLANI) జ్యువెలరీ యజమాని జయంతి లాల్ చయంతి తన సిబ్బందికి ఎనిమిది కార్లు, 18 బైక్‌లను గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలిసింది. నిజానికి ఇలాంటి యజమానులు కింద పనిచేసే ఉద్యోగులు అదృష్టవంతులనే చెప్పాలి. ఇది యజమాని తమ ఉద్యోగుల మీద చూపించే ప్రేమను తెలియజేస్తుంది.

ఉద్యోగుల కళ్ళలో దీపావళి చూసిన యజమాని.. గిఫ్ట్‌గా కార్లు & బైకులు

హిందూ సంప్రదాయం ప్రకారం చాంద్రమానంలో అత్యంత పవిత్రమైన నెల అయిన కార్తీక మాసంలో దీపావళిని చాలా వేడుకగా జరుపుకుంటారు. ఈ ఏడాది దీపావళిని అక్టోబర్ 24 న అంటే రానున్న సోమవారం రోజున జరుపుకుంటున్నారు. చీకటిపై కాంతి, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం గెలుస్తుంది అని ఈ పండుగని గొప్పగా జరుపుకుంటారు.

ఉద్యోగుల కళ్ళలో దీపావళి చూసిన యజమాని.. గిఫ్ట్‌గా కార్లు & బైకులు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ఈ రోజుల్లో తమ ఉద్యోగులకు స్వీట్ ఇవ్వడానికే వెనుకాడేవారు చాలామందే ఉన్నారు. అయితే అలాంటి ఈ రోజుల్లో తమ ఉద్యోగులను కుటుంభ సభ్యులుగా భావించి కార్లు మరియు బైకులు గిఫ్ట్ గా ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఇది అందరూ ప్రశంసించాల్సిన విషయం. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలతో పాటు కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Monday, October 17, 2022, 12:10 [IST]
English summary
Chennai jewellery shop owner gave cars and bikes to staffs as diwali gifts details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+