మీకు తెలుసా.. రూ. 2 లక్షలకంటే ఖరీదైన బైక్.. కేవలం చిల్లరతో కొనేసాడు (వీడియో)
సాధారణంగా కొంతమంది వ్యక్తులు అప్పుడప్పుడు కొంత విచిత్రమైన ధోరణిలో ఆలోచిస్తూ ఉంటారు. ఈ ఆలోచనలే చాలా వైరల్ అవుతూ ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో భాగంగానే ఇటీవల ఒక యూట్యూబర్ తనకు నచ్చిన బైకును మొత్తం నాణేల రూపంలో చెల్లించి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, అతడు కొన్న బైక్ ఏది అనే మరిన్ని విషయాలను గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

నాణేలు చెల్లించి వాహనాలను కొనుగోలు చేయడం అనేది ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు కూడా ఇలాంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. నివేదికల ప్రకారం, తమిళనాడులోని సేలం నగరంలో ఇవసించే 'భూపతి' అనే వ్యక్తి తాను ఎంతగానో ఇష్టమైన బజాజ్ డామినార్ బైక్ ను మొత్తం రూ. 1 నాణేలు చెల్లించి కొనుగోలు చేసాడు.

భూపతికి బజాజ్ డామినర్ బైక్ అంటే ఎంతగానో ఇష్టం. ఈ బైక్ ని మూడు సంవత్సరాల క్రితమే కొనాలనుకున్నాడు, కానీ ఆసమయంలో అతని వద్ద అంత మొత్తంలో డబ్బు లేదు. అప్పట్లో ఈ బైక్ ధర రూ. 2 లక్షలు. అయితే యితడు తన యూట్యూబ్ చానెల్ ద్వారా వచ్చే ఆదాయంతో కొనాలనుకున్నాడు.

29 సంవత్సరాల భూపతి యూట్యూబర్ మాత్రమే కాదు, అతడు ఓ ప్రైవేట్ కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని యూట్యూబ్ కి మంచి సంఖ్యలో ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అయితే మొత్తానికి ఇటీవల బైక్ కొనాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం దాని ధర రూ. 2.6 లక్షలు అని తెలిసింది.

ఈ మొత్తం డబ్బును అతడు కేవలం రూ. 1 నాణేల రూపంలో షోరూమ్ వారికి ఇవ్వాలనుకున్నాడు. దీని కోసం తరచుగా దేవాలయాలు, టీ దుకాణాలు మరియు హోటళ్లలో తన నోట్లను ఒక రూపాయి నాణేలకు మార్చుకునేవాడు. మొత్తానికి అనుకున్న విధంగా మొత్తం డబ్బు రెడీ చేసుకున్నాడు. ఇటీవల అతడు, తన స్నేహితులతో కలిసి ఆ నాణేలను ఓ మినీ వ్యానులో తీసుకుని షోరూమ్ కు వెళ్లాడు.

ఇక బైక్ కొనడానికి అందరిలాగానే షోరూమ్ కి వెళ్ళాడు, షోరూమ్ మేనేజర్ మహావిక్రాంత్ మొదట నాణేలను స్వీకరించడానికి నిరాకరించాడు, లక్ష రూపాయలను( రూ. 2 వేల నోట్లలో) లెక్కించేందుకే బ్యాంకు వారు రూ. 140 కమిషన్‌గా తీసుకుంటారు. మరి ఇంత డబ్బును, అదీ రూపాయి నాణేల్లో తీసుకెళితే వారు అంగీకరిస్తారో లేదో అనే సందేహం కలిగింది. కానీ అది తన కలల బైక్ అని భూపతి చెప్పడంతో చివరికి మేనేజర్ ఒప్పుకున్నాడు.
ఆ డబ్బు మొత్తాన్ని లెక్కించేందుకు షోరూమ్ సిబ్బందికి 10 గంటల సమయం పట్టింది. దీనికి భూపతి మరియు అతని స్నేహితులు కూడా సహాయం చేశారు. ఈవిధానం షోరూమ్ సిబ్బందికి కూడా కొంత కష్టంగా ఉన్నప్పటికీ ఇదొక కొత్త అనుభూతి అని అన్నారు. భూపతి యూట్యూబర్ కావడంతో ఈ మొత్తం వ్యవహారం మొదటి నుంచి వీడియో తీసాడు. ఈ వీడియో కాస్త ఇప్పుడు ఎక్కువ వైరల్ అవుతోంది. ఈ వీడియోని మీరు కూడా ఇక్కడ చూడవచ్చు.

ఇలాంటి సంఘటలు ఇది వరకే చాలా జరిగాయి. ఇందులో ఒక వ్యక్తి మహీంద్రా బొలెరో SUV ని నాణేల ద్వారానే కొనుగోలు చేసాడు. అదే విధంగా గత ఫిబ్రవరి నెలలో నాణేలను ఉపయోగించి సుజుకి అవెనిస్ స్కూటర్‌ను కొనుగోలు చేసినట్లు తెలుసుకున్నాము. అయితే ఈ స్కూటర్ కొనడానికి ఆ వ్యక్తి రూ. 22,000 మాత్రం నాణేలు రూపంలో చెల్లించాడని తెలిసింది.


Click it and Unblock the Notifications








