పీక్స్‌లో అభిమానం.. బైక్‌ నంబర్‌ ప్లేట్‌ స్థానంలో 'సీఎం ఫొటో'.. చివరకు!!

సినిమా, స్పోర్ట్స్‌ సెలబ్రిటీలకే కాదు మన దేశంలో రాజకీయ నాయకులకు సైతం అభిమానులు ఉంటారు. పార్టీకి సంబంధించిన వివిధ కార్యక్రమాల్లో వారి హడావుడే ఎక్కువ. వారిపై అభిమానాన్ని పుట్టిన రోజు సందర్భాల్లో మిగతా ఏదైనా సందర్భంలో చూపించడం తెలిసిందే. కానీ ఇక్కడ ఓ వ్యక్తి అభిమానం పీక్స్‌కి చేరడంతో చివరికి పోలీసుల కంట పడింది.

దేశంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి సంఖ్యం రోజురోజుకూ పెరిగిపోతోంది. గతంలో పోలీసు శాఖ నేరుగా రోడ్లపైకి వెళ్లి తనిఖీలు నిర్వహించేది. దీంతో పోలీసులు ఉన్నచోట మాత్రమే వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేవారు.. ట్రాఫిక్‌ పోలీసులు లేని చోట్ల వాహనదారులు నిబంధనలను గాలికి తుంగలో తొక్కుతున్నారు.

Traffic-Police-Fine

కానీ ఇప్పుడు కాలం మారింది. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారి ఆటను పోలీసులు కట్టిపడేస్తున్నారు. పోలీసులు లేని సమయంలో రోడ్లపై ఏర్పాటు చేసిన సీసీ, AI కెమెరాలు వాహనదారులపై నిఘా పెడుతున్నాయి. దీని ఆధారంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. దీంతోపాటు సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల ఆధిపత్యం కూడా పెరిగింది.

ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ట్రాఫిక్ పోలీసులకు 'ట్యాగ్' చేస్తే వెంటనే సదరు వాహనదారులపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ ద్వారా చేసిన ఫిర్యాదుపై చెన్నై ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు ద్విచక్ర వాహన డ్రైవర్‌పై చర్యలు తీసుకున్నారు.

చెన్నైలోని వడపళని ప్రాంతంలోని ఫ్లై ఓవర్‌పై జూలై 27న మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ద్విచక్ర వాహనం వెళుతోంది. ఆ ద్విచక్ర వాహనం నంబర్‌ ప్లేట్‌ ట్రాఫిక్‌ నిబంధనలకు విరుద్ధంగా ఉంది. అదేంటంటే.. తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఫొటోలు ఉన్నాయి.

అలాగే నంబర్ ప్లేట్ క్రింద ఉదయించే సూర్యుని గుర్తు చిత్రం ఉంది. ఇది కాకుండా ద్విచక్ర వాహనదారుడు మాత్రమే హెల్మెట్ ధరించి ఉన్నాడు. వెనుక కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించలేదు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే నిబంధనను కూడా వారు ఉల్లంఘించారు.

రోడ్డుపై అటుగా వెళ్తున్న ఓ ప్రయాణికుడు దానిని ఫోటో తీశాడు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల ద్వారా చెన్నై ట్రాఫిక్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. దీని ప్రకారం నంబర్ ప్లేట్ ఉల్లంఘిస్తే రూ.500 జరిమానా విధించారు. అలాగే హెల్మెట్ ధరించకుండా వెనుక కూర్చున్న వ్యక్తికి రూ.1000 జరిమానా వేశారు.

దీనిపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. ఈ ఘటనలో బహుశా సంబంధిత వ్యక్తి తమిళనాడు అధికార పార్టీ అయిన DMKలో ఒక పదవి లేదా వాలంటీర్ కావచ్చని అభిప్రాయపడ్డారు. అయితే చెన్నై ట్రాఫిక్ పోలీస్ శాఖ పక్షపాతం లేకుండా చర్యలు చేపట్టిందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

రోడ్డుపై పోలీసులు లేరని ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారికి ఈ ఘటన మంచి గుణపాఠంగా చెప్పవచ్చు. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తే.. సీసీ కెమెరాల నిఘా ద్వారానైనా జరిమానా తప్పదని గుర్తించాలి. పోలీసులు లేకపోయినా ఇప్పుడు వాహనదారులపై వేయి నిఘా పెడుతున్నాయి.

ఇది గ్రహించి రోడ్డు మీద బాధ్యతగా ప్రవర్తించడం చాలా అవసరం. ఇది ట్రాఫిక్ పోలీసులు విధించే జరిమానాల నుండి మాత్రమే కాకుండా రోడ్డు ప్రమాదాల నుండి కూడా మిమ్మల్ని కాపాడుతుందని గుర్తుంచుకోవడం అవసరం. ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తేనే రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించగలమని గుర్తుంచుకోవాలి.

More from DriveSpark

Article Published On: Saturday, August 5, 2023, 18:39 [IST]
English summary
Chennai police impose fines on person for drawing the picture of mk stalin on bike
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+