Just In
Don't Miss
- Finance
కోవిడ్ క్లెయిమ్స్ రూ.9,000 కోట్లు, హెల్త్ పాలసీవే రూ.7,100 కోట్లు
- Movies
పూరి తనయుడి రొమాంటిక్ సినిమా ఆగిపోలేదు.. ఫైనల్ గా ఓ క్లారిటీ ఇచ్చేశారు
- News
IPL 2021: టీఆర్ఎస్ యూటర్న్ -BCCIకి మంత్రి కేటీఆర్ అభ్యర్థన -Sunrisers Hyderabadకు షాక్?
- Sports
హైదరాబాద్‌లోనూ ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించండి.. బీసీసీఐకి కేటీఆర్ రిక్వెస్ట్!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
గుడ్ న్యూస్.. కరోనా నుంచి కాపాడే రోబో వచ్చేసింది
భారతదేశంలోని చాలా నగరాల్లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. అంతే కాకుండా ఈ మహమ్మారి చాలామంది ప్రజలను పొట్టనపెట్టుకుంది. ఇప్పటికే ఈ కరోనా భారిన పది చాలామంది ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ ని ఎదుర్కొంటున్న నగరాల్లో చెన్నై కూడా ఒకటి. కరోనా వైరస్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సంప్రదించడానికి చెన్నై పోలీసులు కొత్త పద్ధతిని కనుగొన్నారు.

చెన్నైలోని చాలా ప్రాంతాలను ఇప్పటికే హాట్ స్పాట్ లుగా గుర్తించారు. ప్రజలు బయటకు రాకుండా ఈ ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. చెన్నై పోలీసులు ఇప్పుడు రోబోట్ కాప్ ఎల్‌డిని ఉపయోగించడం ప్రారంభించారు. దాని సహాయంతో పోలీసులు ఆ హాట్ స్పాట్ ప్రాంతాలను పరిశీలించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

ఈ రోబోట్‌ను రిమోట్ కంట్రోల్ ద్వారా నియంత్రించవచ్చు. రోబోను వైర్‌లెస్ కనెక్టివిటీ ద్వారా 1 కి.మీ దూరం నుండి నియంత్రించవచ్చు. ఈ రోబోతో పోలీసులు ఇతర పనులను కూడా ఉపయోగించవచ్చు.
MOST READ:వావ్ అమేజింగ్ : ఇది రెండు చక్రాలపై నడిచే ట్రాక్టర్..!

పోలీసులు ఈ రోబోట్ ద్వారా పర్యవేక్షణ, స్థానిక ప్రజలను సంప్రదించడం వంటి విధులను కూడా నిర్వర్తించవచ్చు. ఈ రోబోట్ లో కెమెరా అమర్చబడి ఉంటుంది. అదనంగా, టూ వే ఇంటర్‌కామ్ కూడా ఇందులో అమలు చేయబడింది.

ఈ ఇంటర్‌కామ్ ద్వారా పోలీసులు ప్రజలను చేరుకోవడమే కాక, ప్రజలు తమ సమస్యలను పోలీసులకు నివేదించవచ్చు. ఈ రోబోట్ కూపే ఎల్‌డి ఖచ్చితమైన కదలిక కోసం స్టీరింగ్ కంట్రోల్ వంటి అనేక ఫీచర్స్ కలిగి ఉంది.
MOST READ:కొత్త ఇండియన్ ఎఫ్టీఆర్ బైక్ : ఇది చాలా కాస్ట్ గురూ

ఈ రోబోట్ లో అదనంగా, ఒక ఎల్ఇడి డిస్ప్లే కూడా వ్యవస్థాపించబడింది. ఈ రోబోను ఉపయోగించడానికి, పోలీసులు బారికేడ్ల వెనుక నిలబడి ఈ రోబోట్ ద్వారా ప్రజలను సంప్రదించవచ్చు.
ఈ రోబోను తయారు చేయడానికి పోలీసులు అనేక సంస్థల సహాయం తీసుకున్నారు. ఈ రోబోట్ తయారు చేయడానికి ఒక వారం సమయం పట్టింది. రోబోథాట్స్, సైన్స్ ఫిక్షన్ ఇన్నోవేషన్ మరియు కాళిడై మోటార్ వర్క్స్ ఈ రోబోను తయారు చేశాయి. ఈ రోబోట్ పోలీసుల పనిని సులభతరం చేస్తుంది.
MOST READ:ఓలా క్యాబ్ లో ప్రయాణించాలా, అయితే ఇవి తప్పకుండా పాటించాల్సిందే

కరోనా మరింత వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఈ రోబో పోలీసులు మరింత కఠినమైన నిబంధనలను పాటించడానికి మరియు ప్రజలను సంప్రదించి సహాయక చర్యలను నిర్వర్తించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.