కరోనాపై అవగాహన కల్పించడానికి కరోనా హెల్మెట్ ధరించిన పోలీస్

ప్రపంచదేశాలను వణికిస్తున్న వైరస్ కరోనా. ఇది చైనాలో పుట్టి క్రమంగా అన్ని దేశాలకు వ్యాపించి చాల మంది ప్రాణాలను తీసింది. ఈ విధంగా అన్ని దేశాలలో తీరని నష్టాన్ని కలిగిస్తున్న వైరస్ ని నివారించడానికి అన్ని దేశాల ప్రభుత్వాలు కఠినమైన చర్యలను తీసుకుంటున్నాయి.

కరోనాపై అవగాహన కల్పించడానికి కరోనా హెల్మెట్ ధరించిన పోలీస్

భారతదేశంలో కరోనా వైరస్ యొక్క వ్యాప్తిని తగ్గించడానికి మన భారత ప్రభుత్వం 21 రోజుల కట్టుదిట్టమైన లాక్ డౌన్ ను ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రజలు అత్యవసర పరిస్థితిలో తప్ప బయటకి రావడానికి వీలు లేదు. ఇంత వేగంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ గురించి చాల మందికి ఇప్పుడు కూడా సరైన అవగాహన లేకుండా నిబంధనలను అతిక్రమించి బయట తిరుగుతున్నారు.

కరోనాపై అవగాహన కల్పించడానికి కరోనా హెల్మెట్ ధరించిన పోలీస్

కరోనావైరస్ మహమ్మారి యొక్క తీవ్రత గురించి అవగాహన కల్పించడానికి చెన్నైలోని ఒక పోలీసు అధికారి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ సమయంలో ప్రయాణికులను వీధుల్లోకి రాకుండా నిరోధించడానికి ఒక ప్రత్యేకమైన 'కరోనా హెల్మెట్' తయారు చేశారు.

కరోనాపై అవగాహన కల్పించడానికి కరోనా హెల్మెట్ ధరించిన పోలీస్

హెల్మెట్ రూపకల్పన చేసిన గౌతమ్ చెన్నైలోని ANI తో మాట్లాడుతూ కోవిడ్ -19 పరిస్థితిని ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. మరోవైపు పోలీసు సిబ్బంది ప్రజలు ఇంటి వద్దే ఉండేలా పనిచేస్తున్నారు. వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా ఉండటానికి ప్రజలు తమ వంతు సహకారం అందించాలి అన్నారు.

కరోనాపై అవగాహన కల్పించడానికి కరోనా హెల్మెట్ ధరించిన పోలీస్

గౌతమ్ కరోనాపై అవగాహన కల్పించడానికి విరిగిన హెల్మెట్ మరియు కాగితాలను ఉపయోగించి ఈ హెల్మెట్ తయారు చేశాను అని చెప్పాడు. నినాదాలు ప్రదర్శించే అనేక ప్లకార్డులను కూడా నేను సిద్ధం చేసి పోలీసులకు అప్పగించాను అని ఆయన చెప్పారు.

కరోనాపై అవగాహన కల్పించడానికి కరోనా హెల్మెట్ ధరించిన పోలీస్

వీధుల్లో 24/7 పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించడంలో హెల్మెట్ ఉపయోగపడుతుందని నిరూపించారు. ఈ హెల్మెట్ ధరించిన పోలీస్ ఇన్స్పెక్టర్ రాజేష్ బాబు మాట్లాడుతూ ఈ హెల్మెట్ ఇప్పటిదాకా సానుకూల ప్రభావాన్ని చూపిందని తెలిపాడు.

కరోనాపై అవగాహన కల్పించడానికి కరోనా హెల్మెట్ ధరించిన పోలీస్

ప్రజలు బయటికి రాకుండా ఇన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ వాటిని లెక్కచేయకుండా ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు. ప్రజలకు ఈ భయానకమైన వైరస్ గురించి మరింత అవగాహన కల్పించడానికి ఈ కరోనా హెల్మెట్ ఉపయోగపడుతుంది. ఈ హెల్మెట్ ని ధరించినప్పుడు దానిని చూసిన ప్రజలకు కరోనా గుర్తుకువస్తుంది ఆయన చెప్పారు.

MOST READ:డ్రైవ్ ది డ్రైవర్ ఫండ్ ప్రోగ్రాంను ప్రారంభించిన ఓలా, ఎందుకో తెలుసా.. !

కరోనాపై అవగాహన కల్పించడానికి కరోనా హెల్మెట్ ధరించిన పోలీస్

మార్చి 28 ఉదయం నాటికి తమిళనాడులో 6 మంది విదేశీయులతో సహా 38 మందికి ఈ కరోనా వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. ఈ విధంగా కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసివస్తుంది.

MOST READ:వైద్య పరికరాల తయారీలో నేనే సైతం అంటున్న మెర్సిడెస్ బెంజ్

కరోనాపై అవగాహన కల్పించడానికి కరోనా హెల్మెట్ ధరించిన పోలీస్

కరోనా ప్రభావం వల్ల ఇప్పటికే తమిళనాడులో ఒక వ్యక్తి మరణించగా మరో ఇద్దరికీ కరోనా నయమైనట్లు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది.

MOST READ:కరోనా ఎఫెక్ట్ : ఐసోలేషన్ వార్డులుగా మారిన ట్రైన్ బోగీలు

Image Courtesy: ANI

Most Read Articles

English summary
Coronavirus outbreak: Chennai cop wears Corona helmet to spread awareness. Viral video. REad in TElugu.
Story first published: Sunday, March 29, 2020, 11:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X