Ayodhya Free Train అయోధ్యకు ఉచిత రైలు ప్రయాణం.. బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, పూర్తి వివరాలివే.!!
జనవరి 22 న దేశంలో అద్భుతమైన ఘట్టం జరబోతోంది. యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య బాల రాముని విగ్రహ ప్రతిష్ఠ అత్యంత ఘనంగా జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ క్రమంలో అయోధ్య భక్తులకు ఉచిత రైలు(Ayodhya Free Train) ప్రయాణించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి సమాచారం ఈ కథనంలో..
అయోధ్య(Ayodhya Ram Mandir) రామ మందిరాన్ని దర్శించే భక్తుల కోసం వార్షిక ఉచిత రైలు ప్రయాణ పథకాన్ని ఆమోదించింది బీజేపీ పాలిత రాష్ట్రం ఛత్తీస్‌గఢ్. ఈ పథకం ద్వారా ఛత్తీస్‌గఢ్ వాసులు ఉచితంగా అయోధ్యకు చేరుకోవచ్చు. అక్కడి నుంచి యూపీలోని అయోధ్యకు ఉచిత రైలు ద్వారా ప్రయాణించి బాల రాముడిని దర్శించుకోవచ్చు. అయితే ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది.?

జనవరి 22 న అయోధ్య రామ మందిరాన్ని ప్రధాని మోదీ స్వయంగా ప్రారంభించనున్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రధానితో పాటు దేశంలోని వీవీఐపీలు హాజరు కానున్నారు. విగ్రహ ప్రతిష్ఠాపనకు సంబంధించి ఏర్పాట్లన్నీ చురుగ్గా సాగుతున్నాయి. కాగా ఈ ఆలయానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారని అంచనా. ఈ మేరకు అయోధ్య రైల్వే స్టేషన్‌ను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దుతున్నారు. అంతేకాకుండా కొత్త విమానాశ్రయాన్ని కూడా ప్రారంభించారు.
ఈ క్రమంలోనే ఛత్తీస్‌గఢ్(Chhattisgarh Ayodhya Free Train) నుంచి అయోధ్య రామాలయానికి వెళ్లే భక్తులకు ఏటా ఉచిత రైలు ప్రయాణ పథకానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే ఈ ఉచిత రైలు పథకాన్ని ఇప్పుడు ప్రకటించలేదు. 2023లో జరిగిన ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోగా ప్రకటించింది.

ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడంతో ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయోధ్య భక్తులకు ఏటా ఉచిత రైలు ప్రయాణ పథకానికి ఆమోదం లభించింది. ఈ విషయాన్ని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి ప్రకటించారు. ఈ మేరకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పర్యాటక శాఖ ఈ ఉచిత రైలు పథకాన్ని త్వరలో అమలు చేయనుంది.
అయితే ఈ పథకాన్ని సాధారణ ప్రజలందరూ వినియోగించుకోలేరు. నిర్దిష్ట యాత్రికులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఈ కొత్త పథకం కోసం జిల్లా కలెక్టర్లతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించనుంది. 18 ఏళ్ల నుంచి 75 ఏళ్ల మధ్య వయసున్న రామభక్తులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది.

కాగా 55 ఏళ్లు పైబడిన భక్తులకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కింద ప్రతి సంవత్సరం దాదాపు 20,000 మంది యాత్రికులను రైలులో ఉచితంగా అయోధ్యకు తీసుకెళ్లాలని భావిస్తోంది. రైలులో ఛత్తీస్‌గఢ్ నుంచి దాదాపు 900 కి.మీ ప్రయాణించి ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు చేరుకుంటారు.
ఈ ప్రయాణంలో చివరి స్టేషన్ అయోధ్య. యాత్రికులు రాత్రిపూట వారణాసిలో విశ్రాంతి తీసుకుంటారు. అక్కడ వారు కాశీ విశ్వనాథ ఆలయానికి వెళ్లి గంగా హారతిలో పాల్గొనవచ్చు. ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అతి పెద్ద నిర్ణయిం. కాగా అయోధ్యకు వెళ్లే యాత్రికుల కోసం ఛత్తీస్‌గఢ్ నుంచి వారానికి ఒక ప్రత్యేక రైలును నడపాలని భారతీయ రైల్వే యోచిస్తోంది.
ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర పర్యాటక శాఖ బడ్జెట్‌ను కేటాయిస్తుంది. ఈ రైల్వే ప్రయాణంలో యాత్రికులకు భోజన సదుపాయం IRCTC నిర్వహిస్తుంది. రాయ్‌పూర్, దుర్గ్, రాయ్‌ఘర్, అంబికాపూర్ స్టేషన్ల మీదుగా ఛత్తీస్‌గఢ్- అయోధ్య రైలు ప్రయాణిస్తుంది. ఆ స్టేషన్లలో ప్రయాణికులు ఎక్కవచ్చు. అంతేకాకుండా జనవరి 22 న ఛత్తీస్‌గఢ్‌లో డ్రై డేగా ప్రకటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








