ఇది చాలా స్పెషల్ నెంబర్ ప్లేట్.. ఎందుకంటే మీరే చూడండి!
ఇటీవల సోషల్ మీడియాలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి 'ధనంజయ వై.చంద్రచూడ్' (Dhananjaya Y. Chandrachud) కారు నెంబర్ ప్లేట్ గురించి సర్వత్రా చర్చ మొదలైపోయింది. ఇందులో అంతలా చర్చించాల్సిన విషయం ఏముంది? దానికి సంబంధించిన ఇతర వివరాలను ఇక్కడ చూసేద్దాం.
నెంబర్ ప్లేట్ ప్రత్యేకత ఏంటంటే..
సోషల్ మీడియాలో వెల్లడైన ఫోటోలలో మీరు గమనించినట్లయితే.. ధనంజయ వై.చంద్రచూడ్ యొక్క మెర్సిడెస్ బెంజ్ కారు నెంబర్ ప్లేట్ 'DL1 CJI 0001' అని ఉండటం చూడవచ్చు. ఇందులో ఏముందు అంతగా ప్రత్యేకం అని మీరు అనుకోవచ్చు? అక్కడికే వస్తున్నా.. ఇందులో DL అంటే ఢిల్లీని సూచిస్తుంది. CJI (చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా) అనేది ఆయన హోదాను సూచిస్తుంది.

CJI ఉపయోగించే కారు
ఢిల్లీ మరియు హోదా తరువాత వరుస సంఖ్యలు రిజిస్ట్రేషన్ తేదీ ప్రకారం సూచించారు. దీనిని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ద్రువీకరిస్తుంది. ఇది భారత ప్రధాన న్యాయమూర్తి రాజ్యాంగ విధులను నిర్వర్తించడంలో భాగంగా నియమించబడిన కార్లకు ఇటువంటి నెంబర్స్ కేటాయించడం జరుగుతుంది. సీజేఐ ఉపయోగించే కారు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన ఈ 350 డీ అని తెలుస్తోంది.
నిన్న ఢిల్లీలో జాతిగిన ఓ కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి ధనుంజయ చంద్రచూడ్ పాల్గొన్నారు. ఆ సమయంలో ఈ కారు కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం ఎక్స్ (ట్విటర్) లో వైరల్ అవుతున్నాయి. ఈ కారును 2024 జనవరి 1 రిజిస్టర్ చేసినట్లు, ఈ ఏడాది సీజేఐ హోదా కోసం కేటాయించబడిన మొదటి వాహనం ఇదే అని తెలుస్తోంది.

సోషల్ మీడియాలో ఈ నెంబర్ (0001) తెగ వైరల్ అవుతోంది. కొందరు ఈ నెంబర్ ప్లేట్లను కూడా విమర్శిస్తారు. ఇది అధికారుల ప్రత్యేకత మరియు హోదా కోసం కేటాయించుకున్నట్లు విమర్శల వర్షం కురిపిస్తారు. మరి కొందరు అలాంటి 'నెంబర్ ప్లేట్స్ ఎలా పొందాలి, ఎక్కడ పొందాలి, దీని కోసం ఎంత ఖర్చు చేయాల్సి ఉంటుంది' అని తెగ ఆలోచిస్తూ ఉంటారు.
ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఇలాంటి నెంబర్ ప్లేట్స్ కేటాయించడం ఇదే మొదటిసారి కాదు. 2017లో భారత రాష్ట్రపతి కారు కూడా '0001' కలిగి ఉండేది. అయితే ఇది ప్రత్యేక హక్కులు లేదా ఇతర విమర్శకులకు గురైంది. అలాంటి నెంబర్ మళ్ళీ ఇప్పుడు భారత ప్రధాన న్యాయమూర్తి ఉపయోగిస్తున్న కారులో కనిపించింది. నిజానికి నెంబర్ ప్లేట్స్ విషయంలో విమర్శించుకోదగిన, చర్చించుకోదగిన విషయాలు ఏమి ఉండవని అందరూ గమనించాలి.
నెంబర్ ప్లేట్‌లకు డిమాండ్ ఎలా ఉందంటే
భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాల్లో నెంబర్ ప్లేట్స్ డిమాండ్ భారీగా ఉంది. కొన్ని దేశాల్లో నెంబర్ ప్లేట్స్ కోసం కోట్లు కుమ్మరిస్తారు. మన దేశంలో కూడా కొందరు తమకు నచ్చిన నెంబర్లను కొనుగోలు చేయడానికి ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడరు. ప్రత్యేకమైన నెంబర్లు వేలం ద్వారా విక్రయిస్తారు. ఆ సమయంలో తమకు కావాల్సిన నెంబర్ కోసం ఔత్సాహికులు పోటీపడుతుంటారు.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








