రాంగ్ పార్కింగ్‌ చేశారని సిఎం కారునే ఎత్తుకెళ్లిన పోలీసులు

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ కాన్వాయ్‌లో ఉన్న ఓ కారు తప్పుగా పార్క్ చేయబడి ఉందని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అసలేమంది..? సిఎం కారును ఎందుకు ఎత్తుకెళ్లారు... మరిన్ని వివరాలు...

By Anil

ఏదో ఒక సంచలన నిర్ణయంతో వార్తల్లోకెక్కుతున్న ముఖ్యమంత్రుల్లో మొదటి వ్యక్తి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్. ఈయన ఎక్కడికి వెళ్లినా సుమారుగా డజన్ కార్లు కాన్వాయ్‌లో గస్తీగా వెళుతుంటాయి. అయితే వాటిలో ఓ కారు తప్పిపోయింది. సిఎం కారును ఎందుకు ఎత్తుకెళ్లారు ? చివరికి ఎలా సమాప్తం అయ్యింది ? అనే వివరాలు...

ఉత్తర ప్రదేశ్ సిఎం కారునే ఎత్తుకెళ్లిన పోలీసులు

యోగి ఆధిత్యనాథ్ కాన్వాయ్‌లోని ఓ కారు డ్రైవర్ వద్ద నుండి దొంగలించబడిందని నిర్ణయానికి వచ్చారు ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది.

ఉత్తర ప్రదేశ్ సిఎం కారునే ఎత్తుకెళ్లిన పోలీసులు

సాధారణంగా ముఖ్యమంత్రి ఆధిత్యనాథ్ ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోకు సుమారుగా 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ జిల్లా పర్యటనలో ఉన్నారు. అధికారులతో నిర్వహించిన సమావేశం ఆలస్యం కావడంతో అక్కడే సమీపంలో సిఎం కార్లను పార్కింగ్ చేశారు.

ఉత్తర ప్రదేశ్ సిఎం కారునే ఎత్తుకెళ్లిన పోలీసులు

సమావేశం ఆలస్యం అవుతుందని తెలుసుకున్న ఓ డ్రైవర్ కాస్త విరామం తీసుకున్నారు. మీటింగ్ అనంతరం డ్రైవర్లు వెనక్కిరాగా, విశ్రాంతికి వెళ్లిన డ్రైవర్ కారు కనబడకపోవడంతో దొంగలించబడిందని సమీపంలోని పోలీసులకు ఫిర్యాదు చేసారు.

ఉత్తర ప్రదేశ్ సిఎం కారునే ఎత్తుకెళ్లిన పోలీసులు

దొంగలించిన కారుతో దొంగ జిల్లా దాటిపోయేలోపు అన్ని చెక్ పోస్టుల్లో తనికీ నిర్వహించమని అన్ని పోలీసు స్టేషన్లకు సమాచారం పంపించారు. ఈ తనిఖీల్లో దాదాపు అన్ని కార్లను పరిశీలించారు. అయితే సిఎం కాన్వాయ్‌లోని కారు దొరకలేదు.

ఉత్తర ప్రదేశ్ సిఎం కారునే ఎత్తుకెళ్లిన పోలీసులు

వాహన తనిఖీకి ముందుగానే సిఎం కారు గురించి పోలీసులు ఆరా తీశారు. అయితే ఎటువంటి సమాచారం అందకపోవడంతో తనిఖీలను ముమ్మరం చేశారు. అయినప్పటికీ కారు జాడ కనబడలేదు.

ఉత్తర ప్రదేశ్ సిఎం కారునే ఎత్తుకెళ్లిన పోలీసులు

తనిఖీలు ప్రారంభించి సమాచారం అన్ని పోలీసు స్టేషన్లకు చేరడంతో జరిగిన అసలు విషయాన్ని మొత్తం ఝాన్సీ నగర పోలీస్ అధికారి దినేష్ సింగ్ వెల్లడించాడు.

ఉత్తర ప్రదేశ్ సిఎం కారునే ఎత్తుకెళ్లిన పోలీసులు

కారు నో పార్కింగ్ ప్రదేశంలో నిలిపి ఉన్నందుకు గాను ట్రాఫిక్ పోలీసులు దానిని స్టేషన్‌కు తరలించారు. అయితే కారు దొంగతనానికి గురైందనే ఫిర్యాదు అందకముందే అక్కడ నుండి తరలించినట్లు సింగ్ పేర్కొన్నాడు.

ఉత్తర ప్రదేశ్ సిఎం కారునే ఎత్తుకెళ్లిన పోలీసులు

రాంగ్ పార్కింగ్‌లో పార్క్ చేసిన సిఎం కాన్వాయ్‌లోని కారునే తరలించారంటే ఉత్తర ప్రదేశ్‌లో అధికారులు బాగానే పనిచేస్తున్నారనే విషయం ఇక్కడ గమనించవచ్చు.

ఉత్తర ప్రదేశ్ సిఎం కారునే ఎత్తుకెళ్లిన పోలీసులు

ఏదైమయినప్పటికీ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రికా యోగి ఆధిత్యనాథ్ నియమితులయ్యాక అక్కడి అధికారులకు పరుగులు పెట్టించి చెమటలు పుట్టిస్తున్నారనేది వాస్తవం.

Via NDTV

Most Read Articles

English summary
Read In Telugu Chief Minister’s Motorcade Car Towed Away For Parking In The Wrong Place.
Story first published: Friday, April 21, 2017, 16:54 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X