మొబైల్ సెలూన్ ద్వారా రోజుకి రూ. 1,500 సంపాదిస్తున్న వ్యక్తి: ఎలా అనుకుంటున్నారా.. అయితే ఇది చూడండి

కరోనా మహమ్మారి విలయతాండవం వల్ల ఎంతోమంది ప్రజల జీవితాలు దుర్భర స్థితిలోకి వెళ్లిపోయాయి. ఈ మహమ్మారి కారణంగా లెక్కకు మించిన ప్రజలు మరణించారు. ఎంతోమంది ప్రజలు ఈ వైరస్ ప్రభావానికి లోనయ్యారు. ఈ సమయంలోనే ఎంతోమంది ప్రజలు జీవనోపాధిని కోల్పోయారు.

మొబైల్ సెలూన్ ద్వారా రోజుకి రూ. 1,500 సంపాదిస్తున్న వ్యక్తి: ఎలా అనుకుంటున్నారా.. అయితే ఇది చూడండి

కొరోనా వైరస్ గత ఏడాదిన్నర కాలంగా భారత్‌తో సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలను పట్టి పీడిస్తోంది. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన వారు ఉద్యోగం లేకుండా భారతదేశానికి తిరిగి వచ్చేస్తున్నారు. కరోనావైరస్ వేవ్ ప్రభావం భారీగా ఉన్నప్పటికీ ఇప్పుడు కొంత తగ్గుముఖం పట్టినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది.

మొబైల్ సెలూన్ ద్వారా రోజుకి రూ. 1,500 సంపాదిస్తున్న వ్యక్తి: ఎలా అనుకుంటున్నారా.. అయితే ఇది చూడండి

కరోనా వైరస్ కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయిన కారణంగా ఇప్పుడు తమదైన రీతిలో ఉపాధి వెతుక్కుంటున్నారు. ఇటీవల కొన్ని సంఘటనలు వెలువడ్డాయి, ఇందులో ఇన్నోవా కారుని కూరగాయలు అమ్మడానికి ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. ఇదే తరహాలో ఇప్పుడుఆ ఒక వ్యక్తి ఒక మొబైల్ సెలూన్ ప్రారంభించాడు.

మొబైల్ సెలూన్ ద్వారా రోజుకి రూ. 1,500 సంపాదిస్తున్న వ్యక్తి: ఎలా అనుకుంటున్నారా.. అయితే ఇది చూడండి

నివేదికల ప్రకారం కర్ణాటక రాష్ట్రంలోని చిక్‌మంగళూరుకి చెందిన 32 ఏళ్ల శివప్ప మొబైల్ సెలూన్ ప్రారంభించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. గత సంవత్సరం లాక్డౌన్ వ్యాప్తి చెందడంతో రోజువారీ పనిని నమ్ముకున్న ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. అలాంటి వారిలో శివప్ప ఒకరు.

మొబైల్ సెలూన్ ద్వారా రోజుకి రూ. 1,500 సంపాదిస్తున్న వ్యక్తి: ఎలా అనుకుంటున్నారా.. అయితే ఇది చూడండి

శివప్ప పదేళ్ల వయసులోనే రాయ్‌చూర్ నుంచి చిక్‌మంగళూరుకు వెళ్లారు. తరువాత అతి తక్కువ కాలంలోనే అతడు షేవింగ్ షాప్ ప్రారంభించాడు. కానీ కరోనా మహమ్మారి వల్ల అతని షాప్ మూసివేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఏమి చేయాలో అతనికి పాలుపోలేదు.

మొబైల్ సెలూన్ ద్వారా రోజుకి రూ. 1,500 సంపాదిస్తున్న వ్యక్తి: ఎలా అనుకుంటున్నారా.. అయితే ఇది చూడండి

మొబైల్ కూరగాయల షాప్ లాగా మొబైల్ సెలూన్ ప్రారంభించాలని అనుకున్నాడు. మొదట్లో ఇది సాధ్యమవుతుందా అని ఆలోచన కలిగింది, కానీ మొత్తానికి దీనిని అమలుచేసాడు. దీనికోసం ఒక చిన్న వస్తువుల ఆటోను కొనుగోలు చేసి మొబైల్ సెలూన్‌గా మార్చాడు.

మొబైల్ సెలూన్ ద్వారా రోజుకి రూ. 1,500 సంపాదిస్తున్న వ్యక్తి: ఎలా అనుకుంటున్నారా.. అయితే ఇది చూడండి

వారు ఇప్పుడు వారు నివసించే ప్రాంతంలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో కూడా తన సెలూన్ సర్వీస్ అందిస్తున్నారు. ఈ మొబైల్ సెలూన్ గురించి మాట్లాడుతూ, శివప్ప మరియు నేను మొదట్లో నెలకు రూ. 10,000 సంపాదించేవాన్ని, కానీ ఇప్పుడు రోజుకు రూ. 1,500 నుండి రూ. 2000 వరకు సంపాదిస్తున్నాని అతడు చెప్పాడు.

మొబైల్ సెలూన్ ద్వారా రోజుకి రూ. 1,500 సంపాదిస్తున్న వ్యక్తి: ఎలా అనుకుంటున్నారా.. అయితే ఇది చూడండి

శివప్ప మొబైల్ సెలూన్ ఆ చుట్టుపక్కల గ్రామాల్లో బాగా పాపులర్ అయ్యింది. చిక్‌మంగళూరు పరిసర ప్రాంతాల్లో దాదాపు అందరికి శివప్ప మొబైల్ సెలూన్ బాగా తెలుసు. అంతే కాదు అతని ఫోన్ నంబర్‌ కూడా బాగా పరిచయం అయ్యింది. శివప్ప తన మొబైల్ సెలూన్‌కు మొబైల్ క్షౌరశాల అని పేరు పెట్టారు. ఏది ఏమైనా ఇది ఒక మంచి ఆలోచన.

NOTE:ఇక్కడ ఉపయోగించిన ఫోటోలు కేవలం రెఫరెన్స్ కోసం మాత్రమే

Most Read Articles

English summary
Chikkamagalur Man Starts Mobile Saloon After Lockdown. Read in Telugu.
Story first published: Thursday, June 24, 2021, 9:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X