రోడ్డుపై ఆడుకుంటున్న చిన్నారి పైనుంచి వెళ్లిన కారు... కారులోని ఈ ఫీచర్ కాపాడింది!
ఒకప్పుడు పిల్లలు ఆడుకోవడం సహా సేదతీరేందుకు ఆటస్థలాలతోపాటు ఖాళీ ప్రదేశాలు ఉండేవి. అయితే పట్టణీకరణ సహా పెరుగుతున్న జనాభా కారణంగా.. ఆటస్థలాలు కాస్త నివాస ప్రాంతాలుగా మారిపోతున్నాయి. ఫలితంగా చిన్నారులు రోడ్లపైనే ఆడుకోవాల్సి వస్తోంది. రోడ్లపైన ప్రయాణిస్తున్న వాహనాల కారణంగా కొన్నిసార్లు ప్రమాదాలకు గురైన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.
సీసీ టీవీ వీడియో వైరల్ : తాజాగా అటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్లుపై ఆడుకుంటున్న చిన్నారి పైనుంచి కారు వెళ్లింది. గుజరాత్‌లోని సూరత్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన అక్కడున్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయింది. 7 ఏళ్ల చిన్నారికి తల, నోటిపై గాయాలయినట్లు తెలుస్తోంది. నవంబర్ 17న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

చిన్నారి పైనుంచి వెళ్లిన కారు : సూరత్‌లోని కతర్‌గామ్ ప్రాంతంలో 7 ఏళ్ల చిన్నారి ఇంటి ముందు ఉన్న రోడ్డుపై ఆడుకుంటున్నాడు. రోడ్డుపైన ఉన్న ఏదో వస్తువును తీసేందుకు ప్రయత్నం చేయడాన్ని వీడియోలో గమనించవచ్చు. అయితే ఆ సమయంలో వాల్వో s60 కారు కుడివైపునకు టర్న్ తీసుకుంటుంది. అయితే పిల్లవాడు రోడ్డుపైన ఉన్న విషయాన్ని గుర్తించని వాల్వో డ్రైవర్.. చిన్నారి పైనుంచి కారు పోనిచ్చాడు.
ఈ ఫీచర్ కాపాడింది: వోల్వో సెడాన్ మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్ కారణంగా చిన్నారి సురక్షితంగా బయటపడ్డాడు. వోల్వో s60 సెడాన్‌లో 201mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. ఫలితంగా చిన్నారి చిన్న గాయాలతో బయటపడ్డాడు. తల, ముఖానికి చిన్న గాయాలు అయినట్లు తెలుస్తోంది. కతర్‌గామ్ ప్రాంతంలోని జీవన్‌దీప్ సొసైటీలో ఈ ఘటన జరిగింది.

ఈ ఫీచర్ ఉంటే ప్రమాదం జరిగేది కాదు : వోల్వో కారులో వెనుక వైపు మాత్రమే బ్లైండ్‌స్పాట్ మానిటరింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఫలితంగా A-పిల్లర్ వద్ద ఉన్న చిన్నారిని డ్రైవర్ గుర్తించలేకపోయారు. బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ సిస్టమ్ అంటే బ్లైండ్ స్పాట్‌లోని వాహనాలు సహా ఇతర వస్తువులను గుర్తించి డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది. అయితే ఈ కారుకు ఫ్రంట్ బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వ్యవస్థ లేదు. దీంతో ఈ ప్రమాదం జరిగింది.
ADAS : ఈ కారులో ADAS - అడ్వాన్సడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ లేదు. ఈ వ్యవస్థ ఉంటే ఆటోమేటిక్‌గా అత్యవసర బ్రేకుల ద్వారా కారును నిలిపేసే అవకాశం ఉండేది. ఈ వ్యవస్థ రాడార్, కెమెరాలతో పనిచేస్తుంది. వోల్వో S60 కారులో ఈ ADAS ఉంటే.. చిన్నారి పైనుంచి కారు వెళ్లే పరిస్థితి ఉండేది కాదు.

ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న కార్లలో అధునాతన భద్రతా వ్యవస్థలతో వస్తున్నాయి. అయితే టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా.. వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. అందువల్ల చిన్నారులు రోడ్లపైన కాకుండా ప్రత్యేక మైదానాలు, లేదా ఆట స్థలాల్లో ఆడుకొనే విధంగా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








