వందే భారత్ రైలులో స్నాక్ ట్రేలపై చిన్నారులు.. ఇదేందయ్యా అంటూ రైల్వే అధికారి వైరల్ పోస్ట్..
దేశంలో విప్లవాత్మకమైన ప్రాజెక్టుగా వందే భారత్ ఎక్స్‌ప్రైస్ రైళ్లను భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలను కనెక్ట్ చేస్తూ.. తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుస్తోంది. కాగా ఇటీవల వందే భారత్ రైళ్లు పలు విమర్శలను ఎదుర్కొంటున్నాయి. ఇప్పటివరకూ ప్రయాణికులు వందే భారత్‌పై ఫిర్యాదులు చేయగా.. ఇప్పుడు ప్యాసింజర్లపై ఓ అధికారి కంప్లెయింట్ చేశారు.
భారత రవాణా వ్యవస్థలో రైల్వే రంగం చాలా కీలకమైనది. ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంది. ఈ క్రమంలో పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని అదనంగా రైళ్లను సైతం రైల్వే శాఖ ప్రవేశపెడుతోంది. వందే భారత్(Vande Bharat) రైళ్ల ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలకు మరింత వేగంగా చేరుస్తోంది.

తాజాగా వందేభారత్ రైలుకు సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ రైళ్లలో సామగ్రి ఎక్కువగా ధ్వంసం కావడానికి ప్రయాణికులు, వారి పిల్లలే(Children On Snacks Tray) కారణమంటూ ఓ అధికారి ఆరోపించారు. అందుకు సంబంధించి ఓ ఫొటోను X(ట్విట్టర్)లో పంచుకున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు.
ఇటీవల తరచూ కొందరు దుండగులు వందే భారత రైళ్లపై దాడి చేసి అద్దాలు, డోర్లను ధ్వంసం చేయడం చూశాం. రైలు బోగీల్లో నీళ్లు కారుతున్నాయంటూ.. ప్రతిపక్ష నాయకులు సోషల్ మీడియాలో షేర్ చేయడం చూశాం. గేదె ఢీకొట్టడంతో రైళ్లు డ్యామేజ్ అయ్యాయని పలువురు కామెంట్ చేయడం.. ఇలా వందే భారత్ రైళ్లు సర్వీసులు ప్రారంభమైనప్పటి నుంచి పలు విమర్శలను ఎదుర్కొంటోంది.
ఈ క్రమంలో ప్రయాణికులపై రైల్వే అధికారి ఫిర్యాదు చేయడం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. రైలులో పరిశుభ్రత లోపించిందంటూ కొందరు ఫిర్యాదు చేయడం, భోజనం సరిగా లేదని మరికొందరు ఆరోపించడం తరచూ జరుగుతూనే ఉంటాయి. అయితే తాజాగా జరిగిన వింత ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
అనంత్ రూపనగుడి అనే రైల్వే అధికారి ఇద్దరు చిన్నారుల ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. భారతీయ రైల్వేకు చెందిన ఇతర రైళ్లు, వందే భారత్ రైళ్లలో స్నాక్ ట్రేలు విరిగి పోవడానికి చిన్న పిల్లలే కారణమని ఫొటోను చూపిస్తూ పోస్ట్ చేశారు. స్నాక్ ట్రేలు పాడైపోవడానికి చిన్నారులే కారణమని ఆరోపించారు.
వందే భారత్ రైళ్లలో ప్రయాణికుల కోసం సీట్ల వెనుక స్నాక్ ట్రేలను ఏర్పాటు చేశారు. వీటిపై ప్రయాణికులు తిను బండారాలు పెట్టుకోవచ్చు. అయితే ఈ ట్రేలను ప్రయాణికులు దుర్నినియోగం చేస్తున్నట్లుగా ఫొటోను చూస్తే తెలుస్తోంది. కాగా ఫొటోను పరిశీలిస్తే.. ఇద్దరు చిన్నారులు స్నాక్ ట్రేపై కూర్చున్నారు.
రైల్వే అధికారి షేర్ చేసిన ఈ ఫొటోను ఇప్పటివరకూ లక్ష మందికి పైగా నెటిజన్లు వీక్షించారు. వెయ్యి మందికి పైగా లైక్ చేశారు. 400 మందికి పైగా ఈ పోస్ట్‌ను షేర్ చేయగా.. నెటిజన్లు దీనిపై విపరీతంగా స్పందిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ రిపీట్ కాకుండా ఉండాలంటే.. ఇలా చేసే పిల్లల తల్లిదండ్రులకు జరిమానా విధించాలని కామెంట్ చేస్తున్నారు.
కాగా ఈ ఘటనపై రైల్వే శాఖ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. స్నాక్స్ కోసం ఏర్పాటు చేసిన ట్రేలపై ఇలా పిల్లలను కూర్చోబెట్టడం సరికాదని రూపగగుడి అన్నారు. విరిగిపోయే అవకాశం ఉండటంతో పిల్లలను అక్కడ కూర్చోబెట్టవద్దని కోరారు. ప్రయాణికులు రైల్వే నిబంధనలు పాటిస్తే ఇలాంటివి జరగవని స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications








