కదులుతున్న మహీంద్రా XUV700 రూఫ్‌పై చిన్నారులను పడుకోబెట్టిన తండ్రి... తీవ్ర ఆందోళన కలిగిస్తున్న వీడియో..!
గోవా... భారత్‌లో అతిపెద్ద పర్యాటక ప్రాంతం. ప్రతి సంవత్సరం లక్షల మంది పర్యటకులు గోవాలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తారు. అయితే గోవాలో పర్యాటకులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన ఘటనలు అనేక సార్లు వెలుగులోకి వచ్చాయి. దీనిపై పోలీసులు కూడా తగిన రీతిలో చర్యలు తీసుకుంటున్నారని ఆశిస్తున్నాం.
అయితే తాజాగా గోవాకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మహీంద్రా XUV700 వాహనం (Mahindra XUV700 SUV) రూఫ్‌పైన పడుకొని ఇద్దరు చిన్నారులు ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోపై సోషల్ మీడియాలో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. చిన్నారులు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తున్నారంటూ పలువులు ఆందోళన వ్యక్తం చేశారు.

మహీంద్రా XUV700 SUV గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్‌ను పొందింది. మహీంద్రా కారుపై చిన్నారులు నిద్రిస్తూ ప్రయాణం చేస్తున్న వీడియోను మరో కారులో ఎదురుగా వస్తున్న వ్యక్తి రికార్డు చేసినట్లు తెలుస్తోంది. అయితే మహీంద్రా కారును నడుపుతున్న వ్యక్తి, రూఫ్‌పైన ఉన్న చిన్నారులకు మధ్య సంబంధం ఏంటనేది తెలియరాలేదు. అయితే ఆ చిన్నారులకు డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి తండ్రిగా భావిస్తున్నారు.
అయితే వీడియో ఆధారంగా.. ఈ ఘటనపై మహీంద్రా XUV700 కారును డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని.. ఎదురుగా వస్తున్న కారులో ఉన్న వ్యక్తి ప్రశ్నించడం గమనించవచ్చు. చిన్నారులను రూఫ్‌పై పడుకొనిచ్చి కారును ఎందుకు డ్రైవింగ్ చేస్తున్నారని ప్రశ్నించడాన్ని గమనించవచ్చు. అయితే దీనిపై సదరు మహీంద్రా డ్రైవర్ సరైన సమాధానం చెప్పలేకపోయాడు. ఈ ఘటన కాస్త వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మహీంద్రా XUV700 డ్రైవర్ అత్యంత ప్రమాదకరంగా ప్రవర్తించారు. ఏదైనా వాహనం అడ్డుగా వచ్చినప్పుడు సడన్ బ్రేక్ వేస్తే.. రూఫ్‌పైన కూర్చున్న చిన్నారులు రోడ్డుపైకి జారిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా వారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. ఎదురుగా వస్తున్న వాహనం కింద పడితే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.
రోడ్లపై ఇష్టానుసారం ప్రవర్తించకూడదు : రోడ్లపైన డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలి. అంతేగానీ పర్యాటక ప్రాంతాలైనా ఇష్టానుసారం వ్యవహరించకూడదు. చిన్నారులు తాము కారు రూఫ్‌పైన కూర్చుంటామని అల్లరి చేసినా.. వారికి అర్థమయ్యే రీతిపై ప్రమాదం గురించి వివరించాలే కానీ.. ఇలాంటి ఘటనలకు పాల్పడకూడదు.

ఇలాంటి ప్రమాదకర ప్రయాణాలు పబ్లిక్ రోడ్లపైనా కాకుండా ఎక్కడా ప్రయత్నించకూడదు. రూఫ్‌పైన చిన్నారులు సహా ఇతరులు కూర్చున్నా వారు కూడా ప్రమాదంలో చిక్కుకొనే అవకాశం ఉంటుంది. ఈ వీడియో ఆధారంగా మహీంద్రా SUV డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రోడ్లపైన ప్రయాణిస్తున్న వారిస్తున్నా అలానే ప్రయాణం కొనసాగించారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








