పెన్సిల్, పెన్, పుస్తకం, షార్ప్‌నర్, ఎరేజర్ రూపాల్లో కార్లు

By Ravi

విభిన్నశైలిలో వినూత్నమైన కార్లను రూపొందించడంలో దిట్ట అయిన మన హైదరాబాద్‌కు చెందిన సుధాకార్స్ అధినేత, గిన్నిస్ బుక్ విజేత అయిన సుధాకర్ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని బహదూర్‌పురలోని సుధాకార్స్ మ్యూజియంలో పుస్తకం, పెన్ను, పెన్సిల్, షార్పెనర్, ఎరేజర్ వంటి ఆకారాల్లో ఉండే వాహనాలను తయారు చేసి ప్రదర్శనకు ఉంచారు.

సుధాకార్స్ మ్యూజియంలో చిల్డ్రన్ డే కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పుస్తకం, పెన్ను, పెన్సిల్, షార్పెనర్, ఎరేజర్ రూపాల్లో ఉన్న వాహనాలు పిల్లలను ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా తయారుచేసిన ఈ స్టేషనరీ కార్లను 250 మంది పిల్లల సమక్షంలో సుధాకర్ తన మ్యూజియంలో నడిపి చూపించి, వీక్షకులను అలరించాడు.

మరిన్ని ఫొటోలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి..!

సుధాకార్స్ లేటెస్ట్ కార్ క్రియేషన్ వర్క్

హైదరాబాద్‌కు చెందిన సుధాకర్ గడచిన 25 సంవత్సరాలుగా ఇలాంటి విచిత్రమైన వాహనాలను తయారు చేస్తున్నాడు.

సుధాకార్స్ లేటెస్ట్ కార్ క్రియేషన్ వర్క్

సుధాకర్ సృజనాత్మకతను గుర్తించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ యాజమాన్యం అతనిని సత్కరించింది.

సుధాకార్స్ లేటెస్ట్ కార్ క్రియేషన్ వర్క్

సుధాకర్ ఇప్పటివరకు 38 రకాల కార్లను వివిధ రకాల ఆకారాలలో తయారు చేశారు.

సుధాకార్స్ లేటెస్ట్ కార్ క్రియేషన్ వర్క్

డైనింగ్ టేబుల్ కార్, సోఫాసెట్ కార్, కంప్యూటర్ కార్, హెల్మెట్ కార్, క్రికెట్ బాల్ కార్, సిగరెట్ బైక్ ఇలా చెప్పుకుంటూ పోతే సుధాకర్ తయారు చేసిన కార్ల జాబితా చాంతాడంత అవుతుంది.

సుధాకార్స్ లేటెస్ట్ కార్ క్రియేషన్ వర్క్

సుధాకర్ గడచిన సంవత్సరం ఫిబ్రవరి నెలలో 'సుధా వాకీ కార్స్ షో" పేరుతో నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో ఓ ప్రదర్శనను కూడా నిర్వహించాడు.

సుధాకార్స్ లేటెస్ట్ కార్ క్రియేషన్ వర్క్

ప్రపంచంలోనే ఈ తరహా ప్రదర్శన ఇదే మొట్టమొదటిదని సుధాకార్ తెలిపారు. ఈ షోలో వివిధ బంతుల ఆకారంలో ఉండే కార్లు, ఫార్ములా వన్ డిజైన్ కలిగిన కారు, కాఫీ మగ్ ఆకారంలో ఉండే కారు వంటి ఎన్నో డిజైన్లను ఆయన ప్రదర్శించారు.

సుధాకార్స్ లేటెస్ట్ కార్ క్రియేషన్ వర్క్

కాగా.. పాఠశాలల యజమానులు కోరితే, తాను తాజాగా రూపొందించిన స్టేషనరీ వాహనాలను ఆయా పాటశాలల్లో ఉచితంగా నడిపి పిల్లలను అలరించడానికి సిద్ధంగా ఉన్నామని సుధాకర్ చెప్పారు.

సుధాకార్స్ లేటెస్ట్ కార్ క్రియేషన్ వర్క్

సుధాకర్ తయారు చేసిన స్టేషనరీ కార్లు. ఈ ఫొటోలో బుక్, పెన్సిల్, షార్ప్‌నర్, ఎరేజర్ కార్లను చూడొచ్చు.

సుధాకార్స్ లేటెస్ట్ కార్ క్రియేషన్ వర్క్

సుధాకర్ తయారు చేసిన పెన్ను కారు. పెన్ను కారుపై ఫొటోకు ఫోజిస్తున్న చిన్నారి.

సుధాకార్స్ లేటెస్ట్ కార్ క్రియేషన్ వర్క్

ప్రత్యేకంగా తయారుచేసిన ఈ స్టేషనరీ కార్లను 250 మంది పిల్లల సమక్షంలో సుధాకర్ తన మ్యూజియంలో నడిపి చూపించి, వీక్షకులను అలరించాడు.

More from DriveSpark

Article Published On: Thursday, November 14, 2013, 11:16 [IST]
English summary
Guinness World Record winner, Hyderabad based artist Sudhakar has showcased his latest creation at Sudhacars Museum at Bahudurpura, Hyderabad. He had designed different types of cars, like pencil, erases, sharpener, book and pen to celebrate Children's day.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+