గంటకు 600 కిమీల వేగంతో దూసుకెళ్లే రైలు : ఎక్కడో తెలుసా ?

Written By:

ప్రపంచపు అతి పెద్ద రైల్వే తయారీ సంస్థల్లో ఒకటి చైనా రైల్వే రోలింగ్ స్టాక్ కార్పోరేషన్ (CRRC). సిఆర్ఆర్‌సి ఈ మధ్యనే ప్రకటించిన సమాచారం ప్రకారం సరికొత్త మ్యాగ్నటిక్ లెవిటేషన్ రైలును నిర్మిస్తోంది. దీని వేగం గంటకు సుమారుగా 600 కిలోమీటర్లుగా ఉంది. ఇప్పటి వరకు ప్రపంచ రైల్వే చరిత్రలో ఈ వేగాన్ని అందుకున్న రైలు లేదంటే నమ్మండి.

మ్యాగ్నటిక్ లెవిటేషన్ రైలు

ఏ దేశమైన ఏదైనా కొత్తగా సృష్టిస్తే దానికి పోటీని లేదంటే దానికి కాపీని సృష్టించడంలో నెంబర్ వన్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ మ్యాగ్నటిక్ లెవిటేషన్ రైలు కూడా అదే కారణం చేత రూపొందుతోంది. జపాన్‌కు చెందిన ఒక రైలు గరిష్ట వేగాన్ని చేరుకుని రికార్డు సృష్టించిందనే నేపథంతో చైనా ఈ రైలును నిర్మిస్తోంది.

మ్యాగ్నెటిక్ లెవిటేషన్

మ్యాగ్నెటిక్ లెవిటేషన్

ఒక వస్తువు మరో వస్తువును మరియు ఒక అణువు మరో అణువును అంటిపెట్టుకొని ఉండేలా చేసే శక్తిని క్యాసిమర్ ఫోర్స్ అంటారు. అయితే తరువాత కాలంలో శాస్త్రవేత్తలు ఒక వస్తువును మరో వస్తువు అంటిపెట్టుకొని ఉండటానికి బదులుగా పరస్పరం వికర్షించే శక్తిని కనుగొన్నారు. ఈ శక్తి ద్వారా ఎంతటి బరువులనైనా సునాయాసంగా గాలిలో తేలేలా చేయవచ్చు. ఈ సాంకేతికతకు మరిన్ని ప్రయోగాలు చేసి ఇప్పుడు మ్యాగ్నటిక్ లెవిటేషన్ పేరుతో వచ్చిన రైళ్లు స్థిరంగా, ఎంతటి వేగం వద్దనైనా ప్రమాదాలకు గురికాకుండా ఆ బలం ఆధీనంలో ఉంటాయి.

మ్యాగ్నటిక్ లెవిటేషన్ రైలు

చైనాకు చెందిన మాగ్లేవ్ అనే సంస్థ ఇప్పటికే చైనాలో మూడు మైళ్ల ప్రత్యేక ట్రాక్‌ను నిర్మించింది. ఈ ట్రాక్ మీద తాము నూతనంగా అభివృద్ది చేసి హై స్పీడ్ రైళ్లను పరీక్షించడానికి వినియోగించనుంది.

మ్యాగ్నటిక్ లెవిటేషన్ రైలు

మాగ్లేవ్ సంస్థ ఈ 600 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టే రైలుతో పాటు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో నడిచే మ్యాగ్నటిక్ లెవిటేషన్ పరిజ్ఞానం ఉన్న రైలును సృష్టిస్తోంది.

మ్యాగ్నటిక్ లెవిటేషన్ రైలు

మాగ్లేవ్ సంస్థ ముఖ్య ఉద్దేశ్యం, భవిష్యత్ తరాలకు మీడియమ్ మరియు హై స్పీడ్ మాగ్లేవ్ ట్రాన్స్‌పోర్ట్‌గా రవాణాను విభజించి మాగ్లేవ్ రైళ్లు అందివ్వనుంది. వీటిని, వీటి పరిజ్ఞానాన్ని ( మీడియమ్ మరియు హై స్పీడ్ మాగ్లేవ్ ట్రాన్స్‌పోర్ట్‌) చైనాకు మాత్రమే పరిమితం చేయనున్నట్లు అక్కడి ప్రాంతీయ వార్తా పత్రిక స్పష్టం చేసింది.

మ్యాగ్నటిక్ లెవిటేషన్ రైలు

చైనా వ్యాప్తంగా 19,956 కిలోమీటర్ల మేర రైలు పట్టాలు పరుచుకున్నాయి. చైనా రైల్వే విభాగంలో 538బిలియన్ అమెరికన్ డాలర్ల ప్రభుత్వం ఫండింగ్ ఉంది. ఎన్నో ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలు రైల్వే పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుని ఇతర దేశాలతో పోటీగా పరుగులుపెడుతున్నాయి.

మ్యాగ్నటిక్ లెవిటేషన్ రైలు

తాజాగ గత ఏడాది జపాన్‌లో మాగ్లేవ్ సంస్థకు చెందిన రైలు 540 కిలోమీటర్ల వేగాన్ని అందుకొని 12 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టింది. అధిక ఖర్చు మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు ప్రయాణికుల భద్రతపరమైన కారణాల వలన దీనిని 2027 నాటికి పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురానుంది.

మ్యాగ్నటిక్ లెవిటేషన్ రైలు

అయితే ఇప్పుడు షాంఘైకు చెందిన మాగ్లేవ్ ప్రపంచపు అత్యంత వేగవంతమైన వాణిజ్యపరమైన అవసరాలకు ప్రతి రోజు షాంఘై మరియు పుడోంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం మద్య సర్వీసులో ఉంది. దీని వేగం గంటకు 430కిమీలుగా ఉంది.

మాగ్లేవ్ రైళ్లు ఈ వేగాన్నిఅందుకోవడానికి కారణం ?

మాగ్లేవ్ రైళ్లు ఈ వేగాన్నిఅందుకోవడానికి కారణం ?

సాంప్రదాయకంగా రైళ్ల యొక్క చక్రాలను ట్రాక్‌కు అనుసంధానం చేస్తారు. ఇవి ట్రాక్ తప్పడం అనే ఛాన్స్ అస్సలు ఉండదు. అయితే ఆ ట్రాక్ అయస్కాంతంతో నిర్మించబడి ఉంటుంది. ట్రాక్ మరియు రైలుకు మధ్యన గాలి చేరి అధిక వేగానికి కారణం అవుతుంది.

మ్యాగ్నటిక్ లెవిటేషన్ రైలు

అయితే ఈ నిర్మాణంలో ఉన్న విద్యుత్ అయస్కాంతాలు ఒకే సారి ముందు మరియు వెనుక వైపు నుండి నెట్టడం ప్రారంభిస్తాయి. తద్వారా త్వరితగతిన రైలు గరిష్ట వేగాన్ని చేరుకుంటుంది. అయితే ప్రమాదాల రేటు చాలా తక్కువగా ఉంటుంది.

మ్యాగ్నటిక్ లెవిటేషన్ రైలు

నిర్మాణం పరంగా చూస్తే సాధారణ డీజల్ రైళ్ల కన్నా ఖర్చు చాలా ఎక్కువగానే ఉంటుంది. అయితే మాగ్లేవ్ రైళ్లు అత్యంత స్థిరమైనవి మరియు వేగవంతమైనవి. అందుకే కాబోలు చైనా ఈ కాలుష్య రహిత రైళ్ల నిర్మాణానికి భారీగా సముఖత చూపుతోంది.

మ్యాగ్నటిక్ లెవిటేషన్ రైలు

ఈ మాగ్లేవ్ హైస్పీడ్ రైళ్లను కేవలం చైనా రైల్వే మాత్రమే కాదు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా దేశాలు, ఇరాన్, మెక్సికో, టర్కీ, థాయిలాండ్, ఇండోనేషియా మరియు రష్యా వంటి దేశాలలో మాగ్లేవ్ ప్రాజెక్ట్‌లను చేపట్టింది.

మ్యాగ్నటిక్ లెవిటేషన్ రైలు

ప్రపంచ దిగ్గజ దేశాలన్నీ కూడా మాగ్లేవ్ పరిజ్ఞానాన్ని వినియోగించుకంటూ ఉంటే అమెరికా మాత్రం మాగ్లేవ్ కు చాలా దూరంగా ఉంటోంది. గాలిలో మాట దేవుడికెరుగు నేల మీదనే ఇంకా ఈ వేగాన్ని అమెరికా తమ రైల్వే నెట్‌వర్క్ ద్వారా అందుకోలేకపోతోందని చైనా వార్తా పత్రికలు ఎద్దేవా చేస్తున్నాయి.

మ్యాగ్నటిక్ లెవిటేషన్ రైలు

ఇది ఎంత మాత్రమూ నిజం కాదని, యుస్ ఎయిర్ ఫోర్స్ గంటకు 1018 కిమీల వేగంతో రైలును ప్రయోగాత్మకంగా పరీక్షించి ప్రపంచ రికార్డుని సృష్టించినట్లు అమెరికా చెబుతోంది.

మ్యాగ్నటిక్ లెవిటేషన్ రైలు

ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు గరిష్ట వేగాన్ని అందుకుని వరల్డ్ హై స్పీడ్ రైల్ రికార్డ్‌ నెలకొల్పడానికి పోటీ పడుతూనే ఉన్నాయి. వీటి పరంగా చూస్తే ఇండియా పాత్ర మచ్చుకైనా కనబడటం లేదు.

 
English summary
China is building a magnetic levitation train that can go an insane 373 mph
Story first published: Monday, November 28, 2016, 17:06 [IST]
Please Wait while comments are loading...

Latest Photos