2020 నాటికి అంగారక గ్రహాన్ని తాకనున్న చైనా రోవర్లు
ప్రపంచ దేశాలతో పోటీపడటానికి చైనా విశ్వప్రయత్నాలే చేస్తోంది. అందులో భాగంగా అంగారక గ్రహం మీద ప్రయోగాలు జరపడానికి రోవర్లను రూపొందిస్తోంది. ఈ రోవర్లు 2020 నాటికి అంగారక గ్రహాన్ని చేరుకుని దానికి సంభందించిన నిజాలను నిగ్గుతేల్చనున్నాయి.

2021 నాటికి చైనా యొక్క మార్టిన్ రోవర్లు అంగారక గ్రహాన్ని చేరకోనున్నాయి. ఈ ఏడాదికి చైనా కమ్యూనిస్టు పార్టీ ఫండింగ్ యొక్క 100 ఏళ్ల పూర్తవనున్నాయి.

చైనా వార్తా సంస్థ జియాన్హు తెలిపిన వివరాల ప్రకారం ఈ మార్టిన్ రోవర్ బరువు సుమారుగా 200 కిలోల వరకు ఉండనుంది. మరియు నాలుగు సోలార్ ప్లేట్ల ద్వారా అనుసంధానమై ఉంటుంది.

అంగారక గ్రహాన్ని చుట్టేయడానికి మార్టిన్ రోవర్‌కు సుమారుగా ఆరు చక్రాలను అందించారు. 2020 ఏడాదిలో జూలై లేదా ఆగష్టు లో భూమి మీద నుండి ప్రయాణాన్ని ప్రారంభించనుంది.

సుమారుగా ఆరు లేదా ఏడు నెలల పాటు ప్రయాణించి అంగారక గ్రహాన్ని చేరుకోనుంది. గ్రహానికి ఉత్తర భాగం ద్వారా అంగారకుడిని చేరనుంది. సుమారుగా 13 పేలోడ్‌లను మోసుకుని వెళ్లనుంది. మూడు నెలల పాటు అంగారక గ్రహం ఉపరితలాన్ని క్షుణ్ణంగా పరిశీలించనుంది. అందుకోసం ఇది గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడర్లను కూడా తీసుకెళుతోంది.

అంతరిక్షంలోకి మానవున్ని ప్రవేశింపజేసిన దేశాల్లో చైనా మూడవ దేశం. 2036 సంవత్సరం నాటికి చంద్రుడి మీదకు మనిషిని పంపించే ప్రయోగాల్లో ఉంది. ఏదేమైనప్పటికీ ఏ దేశానికి ఆ దేశం అంతరిక్షం మీద తీవ్ర ప్రయోగాలు చేస్తున్నాయి.

- పైలట్లు మరియు విమానం సిబ్బంది చాటుగా చేసే 20 రహస్య పనులు
- మూత్రం నుండి కాఫీ : ఏడాది తరువాత అంతరిక్షం నుండి వచ్చిన వారి అనుభవాలు


Click it and Unblock the Notifications