Video viral రూ.3.2 కోట్ల కారును 44వ అంతస్తులో పార్కింగ్‌ చేసిన యజమాని.. కారణం తెలిస్తే షాక్..!

ప్రపంచంలోని కొందరు ధనవంతులు చేసిన పనులు కొన్నిసార్లు తెగ వైరల్‌ అవుతాయి. చిన్న పనులకు కోసం కూడా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తారు. చైనాకు చెందిన మిలియనీర్‌ కోట్లాది రూపాయల విలువ చేసే కారును 44 అంతస్తుకు తీసుకొచ్చాడు. తాజాగా ఓ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

చైనాలోని పుజియాన్‌లో ఓ మిలియనీర్‌ రూ.3.2 కోట్ల ఖర్చుచేసి రోల్స్‌ రాయిస్‌ ఘోస్ట్‌ కారును కొనుగోలు చేశాడు. ఆ కారు బరువు సుమారుగా 2.5 టన్నులు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే అంత బరువున్న కారును తాను నివాసం ఉంటున్న 44 అంతస్తులోని బాల్కనీలోకి చేర్చాలని నిర్ణయించుకున్నాడు.

china millionaire parked his rolls royce ghost in 44 floor,

ఇందుకోసం ఓ ఇంజినీరింగ్‌ సంస్థను సంప్రదించాడు. ఆ సంస్థ నిపుణులు ముందుగా ఇనుముతో ఓ ప్రత్యేక బాక్స్‌ను నిర్మించారు. అనంతరం మూడు అత్యంత నాణ్యమైన కేబుల్స్‌ వినియోగించి క్రేన్‌ సాయంతో కారు యాజమాని కోరుకున్న 44 అంతస్తులోని ఇంటి బాల్కనీలో పార్కింగ్‌ చేశారు.

సుమారు 2.5 టన్నుల బరువున్న కారును అంత ఎత్తుకు తీసుకెళ్లేందుకు పక్కాగా ప్లానింగ్‌ చేసినట్లు ఇంజినీరింగ్‌ సంస్థకు చెందిన నిపుణులు చెబుతున్నారు. అన్ని సరిచూసుకున్నాకే.. కారును లిఫ్ట్‌ చేసి 44న అంతస్తుకు తీసుకెళ్లినట్లు చెప్పారు. ఇందుకోసం ఖర్చుచేసిన డబ్బుతో మరో కారు కొనుగోలు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు.

china millionaire parked his rolls royce ghost in 44 floor,

తన 3.2 కోట్లు విలువైన కారుకు పార్కింగ్‌ సమస్య కారణంగానే యజమాని ఇలా ఆలోచించాడని సంబంధించిన వ్యక్తులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనపై కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మళ్లీ ఆ కారును డ్రైవ్‌ చేయాలంటే ఏం చేస్తారని సందేహం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా కారును పార్కింగ్‌ చేసేందుకు స్థలం లేకుంటే ఓ గ్యారేజీని నిర్మిస్తే సరిపోతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అంత ఎత్తులో కారును పార్కింగ్‌ చేసి ఏం చేస్తారని చాలా మంది ఆశ్యర్యపోతున్నారు. కేవలం పలువులు దృష్టిని ఆకర్షించేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని.. దీనివలన ఎటువంటి ఉపయోగం ఉండదని చెబుతున్నారు. కొందరు ధనవంతులు ఇలాంటి క్రేజీ పనులు చేయడం కొత్త కాదు. ఇంతకు ముందు ఆస్ట్రేలియాకు చెందిన ఓ మిలియనీర్‌ తన కారును 57వ అంతస్తులోని బాల్కానీలోని పార్కింగ్‌ చేశాడు.

పదిరోజుల క్రితం ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా.. ఇప్పటి వరకు సుమారు 2.34 లక్షలకు పైగా వినియోగదారులు లైక్‌ చేశారు. వందల మంది కామెంట్లు చేశారు. అయితే చైనాకు చెందిన మిలియనీర్ చేసిన క్రేజీ పనికి వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

రోల్స్‌ రాయిస్‌ ఘోస్ట్‌ కారు 6.7 లీటర్‌ v12 టర్బో ఇంజిన్‌తో వస్తుంది. ఈ కారు సుమారుగా 2.5 టన్నుల బరువు ఉంటుంది. అయితే కేవలం 5 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకుంటుంది. ఆల్‌ వీల్‌ స్టీరింగ్‌ మరియు ఆల్‌ వీల్‌ డ్రైవ్‌ను కలిగి ఉంటుంది. భారత్‌లో ఘోస్ట్‌ కారు 7 కోట్ల రూపాయలతో ప్రారంభం అవుతాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, July 24, 2023, 18:28 [IST]
English summary
China millionaire parked his rs3 2 crore rolls royce car in 44 floor of his house
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+