ఆటో షోలో అందాల విందు బంద్! బూత్ గర్ల్స్‌పై బ్యాన్!

By Ravi

సాధారణంగా అంతర్జాతీయ ఆటోమొబైల్ షోలలో కార్ మేకర్లు చూపరులను ఆకట్టుకునేందుకు తమ అందమైన కార్ల పక్కనే అందాలను ఆరబోసే అందమైన భామలను కూడా ఉంచుతుంటారు. దాదాపుగా అన్ని రకాల ఆటోమొబైల్ షోలలో ఇలా చేయటం సర్వ సాధారణమే. అయితే, ఈ విధానం వలన అశ్లీలత పెరిగిపోతోందని, దీనిని నివారించాలని చైనా భావిస్తోంది.

ఇందులో భాగంగా.. చైనాలో ప్రతియేటా నిర్వహించే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన షాంగై ఆటో షోలో అందాల ప్రదర్శనను అడ్డుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఆటో షోలంటే కేవలం కార్లకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చేలా ఉండాలని, కానీ ప్రస్తుత ఆటో షోలు చూస్తుంటే, కార్ల కన్నా ఎక్కువగా స్టాల్స్‌లో నిలుచుకునే మోడల్ గర్ల్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా ఉన్నాయని చైనా భావిస్తోంది.

Auto Show Girls

గతంలో జరిగిన 2012 బీజింగ్ మోటార్ షోలో కూడా మోడల్స్ చిన్న చిన్న బట్టలు ధరించి తమ అందాలను ఆరబోయటంపై చైనా అధికారులు సీరియస్ అయ్యారు. ఇది సమాజానికి విరుద్ధంగా ఉందని, వల్గారిటీని ప్రమోట్ చేస్తోందని బీజింగ్ క్యాపిటల్ ఎథిక్స్ డెవలప్‌మెంట్ ఆఫీస్ వ్యాఖ్యానించింది.

ఈ ఏడాది చైనాలో జరగనున్న మరో ప్రముఖ ఆటో షో విషయంలో ఇలాంటివి జరగకుండా ఉండేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏప్రిల్ 22వ తేది నుంచి షాంగై మోటార్ షో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తాము నడుచుకుంటామని, కార్ షో మోడళ్లపై నిషేధం గురించి ప్రస్తుతం తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయలేమని, ఈ విషయంలో ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయని షాంగై ఆటో షో నిర్వాహకులు తెలిపారు.

Booth Girls

ఈ మేరకు షాంగై ఆటో షో నిర్వాహకులు తమ క్లైంట్లకు ఇందుకు సంబంధించి లేఖలు కూడా జారీ చేస్తున్నట్లు సమాచారం. చైనాలో అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీలలో ఒకటైన గీలే ఆటోమొబైల్ హోల్డింగ్స్ లిమిటెడ్‌కు ఈ తరహా లెటర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 20, 2015 నుంచి వారం రోజుల పాటు జరగనున్న ఈ షోలో ఎలాంటి మోడల్స్ (బూత్ గర్ల్స్)ని ఉపయోగించకూడదని ఆ లేఖ సారాంశం.

చాలా మంది యువత కార్ల కంటే కూడా ఆయా కార్ స్టాల్స్‌లో ఉండే బూత్ గర్ల్స్‌ని చూసేందుకే ఎక్కువగా ఇలాంటి ఆటో షోలకు వెళ్తుంటారు. మరి, అలాంటప్పుడు బూత్ గర్ల్స్‌పై నిషేధం విధిస్తే, షోకి వచ్చే జనం సంఖ్య తగ్గిపోదు.. మీరేమంటారు..?

Most Read Articles

English summary
The Chinese government is contemplating to ban the sexy models in skimpy outfits from the Shanghai annual auto-show. The government is concerned about what it sees as increasing vulgarity in society.
Story first published: Wednesday, January 14, 2015, 16:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X