భారత సరిహద్దులో ప్రారంభమైన చైనా ఎలక్ట్రిక్ బుల్లెట్ ట్రైన్ సర్వీస్

ఇటీవల చైనా భారతదేశ హిమాలయ సమీపంలోని టిబెట్‌లో తన మొట్ట మొదటి ఫుల్లీ ఎలక్ట్రిక్ బుల్లెట్ ట్రైన్ సర్వీస్ ప్రారంభించింది. ఈ ట్రైన్ సర్వీస్ ప్రస్తుతం టిబెట్ రాజధాని నగరం లాసా నుంచి నింగ్చి వరకు అనుసంధానించబడి ఉంది. నింగ్చి అనేది అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో ఉన్న చైనా సరిహద్దు.

భారత సరిహద్దులో ప్రారంభమైన చైనా ఎలక్ట్రిక్ బుల్లెట్ ట్రైన్ సర్వీస్

నివేదికల ప్రకారం, రూలింగ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సిపిసి) 2014 వ సంవత్సరంలోనే లాసా-నింగ్చి మధ్య 435 కిలోమీటర్ల మేరకు రైల్వే లైన్ పనులకు శ్రీకారం చుట్టింది. ఈ మార్గంలో బుల్లెట్ ట్రైన్ గరిష్టంగా గంటకు 160 కి.మీ వేగంతో నడుస్తుంది. ఈ బుల్లెట్ ట్రైన్ ద్వారా కేవలం 3.5 గంటల్లో లాసా నుండి నింగ్చికి చేరుకోవచ్చు.

భారత సరిహద్దులో ప్రారంభమైన చైనా ఎలక్ట్రిక్ బుల్లెట్ ట్రైన్ సర్వీస్

ఈ ట్రైన్ ట్రాక్ దాదాపు 90% వరకు సముద్ర మట్టానికి 3000 మీటర్ల ఎత్తులో నిర్మించబడింది. చైనా యొక్క అధికారిక వార్తా సంస్థ 'జిన్హువా' ప్రకారం, ఈ రైల్వే మార్గం టిబెట్ యొక్క మొట్టమొదటి ఫుల్లీ ఎలక్ట్రిక్ హైస్పీడ్ రైల్వే.

ఈ రైల్వే లైన్ నిర్మాణం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే టిబెట్ ప్రావిన్స్‌ను అనుసంధానించడం. టిబెట్ మరియు అరుణాచల్ ప్రదేశ్ ప్రక్కనే ఉన్న ప్రాంతాలలో పూర్తయిన కొన్ని ప్రధాన చైనా ప్రాజెక్టులలో లాసా-నింగ్చి రైల్వే కూడా ఉంది. గత నెలలో, యార్లుంగ్ జాంగ్బో నది (బ్రహ్మపుత్ర) సమీపంలో చైనా హైవే వర్క్‌షాప్ పూర్తి చేసింది.

భారత సరిహద్దులో ప్రారంభమైన చైనా ఎలక్ట్రిక్ బుల్లెట్ ట్రైన్ సర్వీస్

ఈ రైల్వే మార్గం అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు సమీపంలో చైనా నిర్మించిన రెండవ ప్రధాన రైల్వే. లాసా-నింగ్చి రైల్వే అనేది సిచువాన్-టిబెట్ రైల్వే మార్గంలో ఒక భాగం. ఇది రెండు ప్రాంతీయ రాజధానులను కలుపుతుంది. చైనా మీడియా నివేదికల ప్రకారం, ఈ రైల్వే మార్గాన్ని జాతీయ ఐక్యత పరిరక్షణలో ఒక ప్రధాన దశగా అభివర్ణించారు.

భారత సరిహద్దులో ప్రారంభమైన చైనా ఎలక్ట్రిక్ బుల్లెట్ ట్రైన్ సర్వీస్

ఈ రైల్వే మార్గం పశ్చిమ దేశాలలో ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధిని ప్రోత్సహించడంలో ముఖ్యమైన దశగా పాలుపంచుకోనుంది. భారతదేశం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ, దక్షిణ టిబెట్‌లో భాగం అరుణాచల్ ప్రదేశ్‌ అని చైనా పేర్కొంది. 3,488 కిలోమీటర్ల పొడవైన వర్చువల్ కంట్రోల్ లైన్ (ఎల్‌ఐసి) పై భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం ఉంది. భారత్‌, చైనా మధ్య సరిహద్దు వివాదంపై తరచూ వాగ్వివాదం జరుగుతూనే ఉంది.

భారత సరిహద్దులో ప్రారంభమైన చైనా ఎలక్ట్రిక్ బుల్లెట్ ట్రైన్ సర్వీస్

జిన్హువా యూనివర్సిటీ యొక్క నేషనల్ స్ట్రాటజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసర్చ్ డైరెక్టర్ కియాన్ ఫెంగ్ గతంలో గ్లోబల్ టైమ్స్ వార్తాపత్రికతో మాట్లాడుతూ, భారతదేశం-చైనా సరిహద్దులో సంక్షోభం ఏర్పడినప్పుడు వస్తువులను సరఫరా చేయడానికి ఈ ట్రైన్ సర్వీస్ ఉపయోగపడుతుందని అన్నారు.

Most Read Articles

English summary
Tibet Gets First Bullet Train, Links Lhasa To Border With India. Read in Telugu.
Story first published: Monday, June 28, 2021, 11:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X