మీకు తెలుసా.. ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ట్రైన్ కానుంది

ప్రపంచంలో అత్యంత వేగవంతమైన మాగ్లెవ్ రైలుని ఇటీవల చైనా ఆవిష్కరించింది. ఈ రైలు గంటకు దాదాపు 620 కిమీ వేగంతో 385 మైళ్ళు ప్రయాణించగలదు. 21 మీటర్ల పొడవు అంటే 69 అడుగుల పొడవైన రైలుని జనవరి 13 న సిచువాన్ ప్రావిన్స్‌లోని చెంగ్డులో ఆవిష్కరించారు.

మీకు తెలుసా.. ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ట్రైన్ కానుంది

ఈ రైలు ఎలా పనిచేస్తుందో చూపించడానికి 165 మీటర్ల (541 అడుగుల) ట్రాక్‌ను విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్మించారు. రాబోయే 3 నుంచి 10 సంవత్సరాల్లో ఈ రైలు ఎలా నడుస్తుందో ప్రొఫెసర్ హు జువాన్ విలేకరులతో అన్నారు. హు జువాన్ సౌత్ వెస్ట్రన్ జియోడాంగ్ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు.

మీకు తెలుసా.. ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ట్రైన్ కానుంది

ఈ విశ్వవిద్యాలయం కొత్త హైస్పీడ్ మాగ్లెవ్ రైలు నమూనాను అభివృద్ధి చేయడంలో బిజీగా ఉంది. చైనా జిన్‌హువానెట్ వార్తాపత్రిక దీనిపై నివేదించింది. ప్రపంచంలోనే అతిపెద్ద హైస్పీడ్ రైలు నెట్‌వర్క్ చైనాకు ఉంది. ఇది 37,000 కిలోమీటర్ల పొడవైన హైస్పీడ్ రైలు మార్గాన్ని కలిగి ఉంది.

MOST READ:జాబ్ చేస్తూ.. జీవితాన్ని, అనుభవించు రాజా..

మీకు తెలుసా.. ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ట్రైన్ కానుంది

ప్రపంచంలో అత్యంత వేగవంతమైన వాణిజ్య రైలుగా ప్రసిద్ది చెందిన షాంఘై మాగ్లెవ్ రైల్వే కూడా ఇందులో ఉంది. చైనా యొక్క మొట్టమొదటి హైస్పీడ్ రైలు సర్వీస్ 2003 లో ప్రారంభించబడింది. ఈ రైలు గంటకు 431 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఈ రైలు షాంఘై పుడాంగ్ విమానాశ్రయం నుండి షాంఘైకి తూర్పు లాంగ్యాంగ్ వరకు నడుస్తుంది.

మీకు తెలుసా.. ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ట్రైన్ కానుంది

ఇప్పుడు ఆవిష్కరించిన మాగ్లెవ్ మోడల్ గంటకు 620 కిమీ వేగంతో కదలగలదు. ఈ రైలును ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలు కానుంది. షాంఘై మాగ్లెవ్ రైలు కేవలం 4 నిమిషాల్లో గరిష్ట వేగాన్ని చేరుకుంటుంది. అంటే షాంఘై మాగ్లెవ్ రైలు గంటకు 0 నుంచి 431 కిమీ చేరుకోవడానికి 4 నిమిషాలు మాత్రమే పడుతుంది.

MOST READ:అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు

మీకు తెలుసా.. ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ట్రైన్ కానుంది

చైనా ఇలాంటి హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టడంలో నిరంతరం బిజీగా ఉంది. 2022 బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌కు ముందు మౌలిక సదుపాయాలు కల్పించడానికి చైనా ఆసక్తి చూపుతోంది. వింటర్ ఒలింపిక్స్ ఇంకా ప్రారంభం కానప్పటికీ చైనా ఇంకా శ్రద్ధగా పనిచేస్తోంది.

మీకు తెలుసా.. ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ట్రైన్ కానుంది

2022 వింటర్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి చైనా గత ఏడాది జాంగ్జియాగోయ్ నుండి బీజింగ్ వరకు కొత్తగా 174 కిలోమీటర్ల హైస్పీడ్ రైలు మార్గాన్ని ప్రవేశపెట్టింది. ఈ రైలు రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని మూడు గంటల నుండి కేవలం 47 నిమిషాలకు తగ్గిస్తుంది. ప్రయాణ సమయం చాలా తగ్గుతుంది కావున ఇది ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

MOST READ:రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రదర్శించనున్న యుద్ధ విమానాలు ఇవే, చూసారా..!

మీకు తెలుసా.. ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ట్రైన్ కానుంది

ప్రపంచం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇలాంటి కొత్త ఉత్పత్తులు రోజురోజుకి పుట్టుకొస్తున్నాయి. ఇవన్నీ ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కావున ఇలాంటి వాటిని తయారుచేయటంలో ప్రపంచంలోని చాలా దేశాలు నిమగ్నమవుతున్నాయి.

Most Read Articles

English summary
China Unveils Prototype Of Maglev Train Which Travels At The Speed Of 620 Kmph. Read in Telugu.
Story first published: Sunday, January 24, 2021, 6:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X