ప్రపంచపు అతి పెద్ద జలవిమానాన్ని ఆవిష్కరించిన చైనా: ప్రయోజనం ఏంటి?

By Anil

రక్షణ కోసం ఒక్కో మార్గానికి ఒక్క విధమైన వాహనాలను వినియోగించుకుంటున్నాయి ప్రపంచ దేశాలు. గగన తలానికి విమానాలు, భూ తలానికి వాహనాలు, సముద్ర మార్గానికి నౌకలు వంటి వాటిని వినియోగించుకుంటున్నాం. కాని కొన్ని దేశాలు అన్ని మార్గాలలో కూడా ప్రయాణించే వీలున్న వాటిని రూపొందిస్తున్నాయి. అందులో చైనా ఒకటి.

చైనా ఈ మధ్యనే ఆకాశంలో విహరించే విధంగా మరియు నీటి మీద పరుగులు పెట్టే జలవిమానాన్ని రూపొందించి, ఆవిష్కరించింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ విమానం సముద్ర మరియు ఆకాశ మార్గాలకు రాక్షసి. ఎజి600 గా పిలువబడే దీని గురించి పూర్తి వివరాలు....

జలవిమానం

పరిమాణం పరంగా చూస్తే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జలవిమానాలలో ఇదే అతి పెద్దది మరియు వ్యాసింజర్ విమానాలకు బాగా పేరుగాంచిన బోయింగ్ 737 విమానాకి సమమైన సైజులో ఉంటుంది.

జలవిమానం

అత్యవసర సమయాల్లో ఇది కేవలం 20 సెకండ్లలో 12 టన్నుల నీటిని సేకరిస్తుంది.

జలవిమానం

ఈ ఏజి600 జలవిమాన పరిధి గరిష్టంగా 2,800 మైళ్లుగా ఉంది.

జలవిమానం

ఝుహాయ్ నగరంలోని దక్షిణ పోర్ట్ సిటిలో స్టే ఓన్డ్ ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పోరేషన్ ఆఫ్ చైనా వారు ఆవిష్కరించారు.

జలవిమానం

దీనికంటే ముందున్న అతి పెద్ద జలవిమానం హెచ్-4, దీనిని రెండవ ప్రపంచ యుద్దంలో వినియోగించడానికి అప్పట్లో తయారు చేశారు.

జలవిమానం

అడవుల్లో మరియు సముద్రాల్లో గస్తీ కాయడానికి దీనిని ముఖ్యంగా అభివృద్ది చేసినట్లు తెలిపారు.

జలవిమానం

ఇది ఎగిరే సమయంలో గరిష్టంగా తీసుకెళ్లే బరువు 53.5 టన్నులుగా ఉంది.

జలవిమానం

రెండవ ప్రపంచ యుద్దం కోసం 1940 ల కాలంలో అభివృద్ది చెందిన హెచ్-4 హెర్క్యులస్ అనే సీప్లేన్ (సముద్ర విమానం లేదా జలవిమానం) యొక్క రెక్కల పొడవు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద సముద్ర విమానంగా పేరుగాంచిన ఏజి600 రెక్కల కన్నా ఎక్కువగా ఉంది.

జలవిమానం

ఇది డిఫెన్స్ అవసరాల కోసం మాత్రమే కాకుండా అంతర్జాతీయ రవాణా అవసరాలకు, వాతావరణాన్ని గమనించడానికి, గస్తీ కోసం కూడా వినియోగించవచ్చని అక్కడి ప్రాంతీయ పత్రిక ప్రకటించింది.

జలవిమానం

ఏవిఐసి జనరల్ మేనేజర్ జెంగ్ రుగాంగ్ మాట్లాడుతూ, చైనా ఏవియేషన్ రంగంలో విప్లవం సృష్టించనున్న ఈ జల విమానం తయారీకి చైనా ప్రభుత్వం నుండి 2009 లో అమోదం లభించింది అని తెలిపారు.

జలవిమానం

ఏవిఐసి వారు ఈ ఏజి600 జలవిమానం కోసం వివిధ మిలిటరీ విభాగాల నుండి 17 ఆర్డర్లను పొందారు.

జలవిమానం

1

జలవిమానం

2

జలవిమానం

3

జలవిమానం

4:30 గంటల్లో ముంబాయ్ నుండి న్యూయార్క్ నగరాన్ని చేరుకోండిలా !

అమెరికా మిలిటరీలో అద్భుతం

More from DriveSpark

Article Published On: Monday, August 1, 2016, 14:36 [IST]
English summary
China Unveils Worlds Largest Amphibious Aircraft Ag600
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+