ప్రపంచ ఈవీ మార్కెట్‌ను శాసిస్తున్న ఆ దేశం.. మొత్తం వీళ్ల వాహనాలదే హవా! వేరే బ్రాండ్‌లకు ఛాన్స్ ఉండేనా?

ప్రపంచ వాహన పరిశ్రమలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు పెట్రోల్, డీజిల్ వాహనాలను ఎక్కువగా కొనుగోలు చేసేవారు, Cngలు కూడా అనుకున్నంత స్థాయిలోనే సేల్స్‌ను నమోదు చేసేవి. అయితే ఇప్పుడు చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల(ev) వైపు అడుగులు వేస్తున్నారు. కొత్తగా మార్కెట్లోకి విడుదల అవుతున్న వాటిలో ఎక్కువగా ఈవీలే ఉంటున్నాయి. ప్రజలు పెట్రోల్, డీజిల్ ధరలు భరించలేక తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో చాలా ఈవీ తయారీ సంస్ధలు ఉన్నాయి. వీటిలో దిగ్గజ కంపెనీల నుంచి మొదలుకుని పలు మధ్యస్థ స్థాయి కంపెనీలు కూడా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో చాలా సంస్థలు ఉండగా, వాటన్నింటిలో చైనా దేశాలకు చెందిన కంపెనీలు ముందంజలో ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలలో చైనా టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఇటీవల విడుదల అయిన Rho Motion డేటా ప్రకారం, చైనా దేశానికి చెందిన ప్రముఖ ఈవీ బ్రాండ్లు ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) మార్కెట్లో 76 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే చైనా, యునైటెడ్ స్టేట్స్‌లో ఒక్క కారును కూడా అమ్మకుండానే ఈ మైలురాయికి చేరుకోవడం విశేషం.

ChinaTops In Ev Sales

సాధారణంగా అమెరికాలో వాహనాల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఈ దేశంలో చాలా కంపెనీలు తమ మోడళ్లను విక్రయిస్తుంటాయి. ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద కార్ల మార్కెట్‌తో పాటు, అత్యంత లాభాలను అందించే దేశం. అయితే చైనా కంపెనీలు అమెరికాలో తమ కార్లను విక్రయించకుండానే ఇతర దేశాల్లో జరిపిన అమ్మకాల ద్వారానే మొత్తం ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలవడం గమనార్హం.

చైనా ఈవీ తయారీదారులు తమ ఫోకస్‌ను యునైటెడ్ స్టేట్స్‌లో కాకుండా ఇతర ప్రాంతాలపై పెట్టారు. ముఖ్యంగా తక్కువ అభివృద్ధి చెందిన మార్కెట్లలో అక్కడి ప్రజలకు అనుకూలంగా ఉండేలా బడ్జెట్ ధరల్లో తమ ఈవీ కార్లను విడుదల చేయడం ద్వారా చైనా కంపెనీలు చాలా వరకు సక్సెస్ అయ్యాయి. ఇక్కడి మార్కెట్లో విక్రయించి ఎక్కువ లాభాలను పొందారు. తమ మార్కెట్‌ను ప్రపంచవ్యాప్తంగా చైనా తయారీదారులు విస్తరిస్తున్నారు.

Top Global Electric Vehicle Maker

ఇండియాలో కూడా చైనా ఎలక్ట్రిక్ కార్లు తమ ప్రాబల్యాన్ని చూపిస్తున్నాయి. ఇక్కడ మొత్తం ఈవీల అమ్మకాల్లో డ్రాగన్ కంపెనీల వాటా దాదాపు 23 శాతం వరకు ఉంది. గత ఏడాది జర్మనీలో అమ్ముడైన మొత్తం 578,000 ఈవీలలో చైనా తయారీదారుల వాటా 4 శాతం ఉంటుంది. అలాగే, బెల్జియం ఈవీలలో 3 శాతం, ఫ్రాన్స్‌లో 5 శాతం, యూకేలో 7 శాతంగా ఉన్నాయి.

కొన్ని దేశాల్లో అయితే మొత్తం ఈవీ అమ్మకాల్లో చైనా వాటా ఏకంగా 90 శాతానికి పైనే ఉంది. ప్రపంచ ఈవీ మార్కెట్లో చైనా దూసుకుపోవడానికి ప్రధాన కారణం, ఆయా దేశాల్లో స్థానికంగా తయారీదారులు లేకపోవడం. దీంతో డ్రాగన్ దేశానికి చెందిన కంపెనీలు తమ కార్లను ఇక్కడి ఎగుమతి చేస్తున్నాయి. అదనంగా చైనాలో అక్కడి ఈవీ తయారీదారులకు ప్రభుత్వ సబ్సిడీలు, ప్రోత్సహాల కారణంగా ఉత్పత్తి పెంచి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

China Dominate Global Electric Vehicle Sales

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, February 28, 2025, 17:15 [IST]
English summary
Chinese auto companies dominate 76 of global electric vehicle sales more details here
Read more on: #offbeat
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+