ఫేమస్ రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌ని కాపీ కొట్టిన చైనీస్ కంపెనీ!

చైనా కంపెనీలు ప్రతి ఉత్పత్తికి నకలు ఉత్పత్తిని తయారు చేయటంలో సిద్ధహస్తులు. ఇప్పటికే అనేక అంతర్జాతీయ ఉత్పత్తులను కాపీ కొట్టిన చైనా కంపెనీలు తాజాగా, మనదేశంలో అత్యంత పాపులర్ అయిన రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లలో ఒకదానిని కాపీ చేశారు.

ఫేమస్ రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌ని కాపీ కొట్టిన చైనీస్ కంపెనీ!

రాయల్ ఎన్‌ఫీల్డ్ అందిస్తున్న అడ్వెంచర్ మోటార్‌సైకిల్ 'హిమాలయన్' డిజైన్‌ను పోలి ఉండే మోటార్‌సైకిల్‌ను ఓ చైనీస్ కంపెనీ డిజైన్ చేసింది. ఈ చైనీస్ వెర్షన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ కాపీ బైక్ పేరు 'హాన్వే జి30'.

ఫేమస్ రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌ని కాపీ కొట్టిన చైనీస్ కంపెనీ!

హాన్వే జి30 మోటార్‌సైకిల్ ఓవరాల్ లుక్ చూడటానికి మనదేశంలో లభిస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మోటార్‌సైకిల్ మాదిరిగానే ఉంటుంది. దీని బేసిక్ డిజైన్, ఫ్రేమ్, హెడ్‌లైట్, స్ప్లిట్ సీట్, విండ్‌షీల్డ్, సైలెన్సర్ మరియు స్పోక్ వీల్స్ అన్ని డిజైన్ ఎలిమెంట్స్ కూడా హిమాలయన్ మోడల్‌ను పోలి ఉంటాయి.

MOST READ:ఔరా.. ఇదేమి సిత్రం.. ట్రక్ డ్రైవర్‌కి హెల్మెట్ లేదని ఫైన్.. ఎక్కడో తెలుసా

ఫేమస్ రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌ని కాపీ కొట్టిన చైనీస్ కంపెనీ!

ఈ మోటార్‌సైకిల్‌కి చైనీస్ టచ్ ఇచ్చేందుకు కంపెనీ దీని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పూర్తిగా ఎల్‌సిడితో చేసింది. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ క్రింది భాగంలో మొబైల్ చార్జింగ్ కోసం 5 వోల్ట్ సాకెట్‌ను కూడా జోడించింది. హాన్వే జి30 ఒక 250సీసీ అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్.

ఫేమస్ రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌ని కాపీ కొట్టిన చైనీస్ కంపెనీ!

చైనాకి హాన్వే సంస్థ ఈ మోడల్‌ను జి30 స్టాండర్డ్ మరియు జి30-ఎక్స్ అనే రెండు వేరియంట్లలో విక్రయించనుంది. జి30 ఎక్స్ మోడల్‌లో కంపెనీ ట్యూబ్ లెస్ టైర్లతో వైర్‌స్పోక్ అల్లాయ్ వీల్స్, ఇరువైపులా పన్నీర్స్ మరియు టిఎఫ్‌టి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లను అందిస్తోంది. చైనా మార్కెట్లో దీని ధర 17,280 యెన్‌లుగా ఉంటుంది. అంటే, మన కరెన్సీలో సుమారు రూ.1.92 లక్షలుగా ఉంటుదన్నమాట.

MOST READ:ట్రాఫిక్ సిగ్నల్ పోల్‌కి సెలబ్రేషన్ చేసిన బెంగళూరు పోలీసులు.. ఎందుకో తెలుసా?

ఫేమస్ రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌ని కాపీ కొట్టిన చైనీస్ కంపెనీ!

హాన్వే జి30 మోటార్‌సైకిల్‌లో 249.2 సిసిలో సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 9000 ఆర్‌పిఎమ్ వద్ద 26 బిహెచ్‌పి శక్తిని మరియు 7000 ఆర్‌పిఎమ్ వద్ద 22 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది గంటకు 128 కిమీ వేగంతో పరుగులు తీస్తూ, లీటరుకు 32.2 కిమీ మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

ఫేమస్ రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌ని కాపీ కొట్టిన చైనీస్ కంపెనీ!

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మాదిరిగానే, ఇందులో డ్యూప్లెక్స్ స్ప్లిట్ డబుల్ డయల్ ఛాస్సిస్‌పై తయారైంది. ఇందులో ముందు వైపు 135 మిమీ అప్‌సైడ్ డౌన్ ఫోర్కులు మరియు వెనుక వైపు 120 మిమీ మోనోషాక్ అబ్జార్బర్‌ను అమర్చారు. అలాగే, ఇందులో ముందు వైపు 19 ఇంచ్ మరియు వెనుక వైపు 17 ఇంచ్ వీల్స్ ఉన్నాయి.

MOST READ:సుజుకి హయాబుసా సూపర్‌బైక్‌పై ట్రాఫిక్ పోలీస్ [వీడియో]

ఫేమస్ రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌ని కాపీ కొట్టిన చైనీస్ కంపెనీ!

ఈ బైక్‌లోని ఇరు చక్రాలపై వాటిపై డ్యూయెల్ పర్పస్ ట్యూబ్‌లెస్ టైర్లను ఉపయోగించారు. బ్రేకింగ్ విషయానికి వస్తే, ఇందులో ముందు వైపు 280 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపు 240 మిమీ డిస్క్ బ్రేక్లను ఉపయోగించారు. దీని రైడర్ సీట్ హైట్ 800 మిమీగా ఉంటే, గ్రౌండ్ క్లియరెన్స్ 185 మిమీగా ఉంటుంది.

ఫేమస్ రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌ని కాపీ కొట్టిన చైనీస్ కంపెనీ!

ఇంకా ఇందులో ట్విన్ పాడ్ ఎల్‌సిడి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ మరియు పూర్తి టిఎఫ్‌టి టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్, 5 వోల్ట్ ఛార్జింగ్ పోర్ట్, 19 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వంటి ఫీచర్లను ఆఫర్ చేస్తున్నారు. ఇలాంటి ఫీచర్లు మనదేశంలో లభిస్తున్న ఒరిజినల్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌లో లేవు.

MOST READ:ఒకరిపై ఒకరు కూర్చుని ప్రమాదకరమైన బైక్ స్టంట్స్ చేసిన యువతులు [వీడియో]

ఫేమస్ రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌ని కాపీ కొట్టిన చైనీస్ కంపెనీ!

భారతదేశంలో లభిస్తున్న హిమాలయన్ మరియు చైనీస్ వెర్షన్ జి30 మోడళ్లలో అతిపెద్ద మార్పు దాని ఇంజన్ రూపంలో కనిపిస్తుంది. హిమాలయన్‌లో 411 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 24.3 బిహెచ్‌పి పవర్‌ను మరియు 32 న్యూటన్ మీటర్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో 14 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది.

Most Read Articles

English summary
hinese Company Develops Royal Enfiled Himalayan Clone. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X