సూట్‌కేస్‌తో స్కూటర్‌ను తయారు చేసిన చైనా వ్యక్తి!

By Ravi

సాధారణంగా ప్రయాణాల్లో మనం సూట్‌కేసులను మోయాలి.. కానీ అదే మనల్ని మనల్ని మోస్తే ఎలా ఉంటుంది.. చిత్రంగా ఉంది కదూ..! చైనాకు చెందిన ఓ రైతు ఇలాంటి ఓ కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు. లగేజ్‌తో పాటుగా మనల్ని కూడా మోసుకెళ్లే సూట్‌కేస్ స్కూటర్‌ను తయారు చేసి అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు.

చైనాకు చెందిన హి లియాంగ్సై అనే వ్యక్తి బ్యాటరీతో నడిచే సూట్‌కేస్ స్కూటర్‌ను తయారు చేశాడు. సెంట్రలో చైనాలోని హునాన్ ప్రాంతానికి చెందిన హి లియాంగ్సై తన ఆవిష్కరణను చాంగ్షా రైల్వే స్టేషన్‌లో డెమోనిస్ట్రేట్ చేసి చూపించారు. తాను గతంలో ఒకానొక సందర్భంలో తన ప్రయాణంలో సూట్‌కేస్ మర్చిపోయాయని, ఆ సందర్భంగా పుట్టుకొచ్చిన ఆలోచనకు కార్యరూపమే ఈ సూట్‌కేస్ స్కూటర్ లియాంగ్సై తెలిపారు.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

సూట్‌కేస్‌తో స్కూటర్

ఈ సూట్‌కేస్ స్కూటర్ మొత్తం బరువు 7 కేజీలు మాత్రమే. ఈ సూట్‌కేస్ స్కూటర్‌పై ఇద్దరు వ్యక్తులు ప్రయాణించవచ్చు.

సూట్‌కేస్‌తో స్కూటర్

ఈ సూట్‌కేస్ స్కూటర్ బ్యాటరీ సాయంతో నడుసుత్తుంది. దీనిపై గరిష్టంగా గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. పూర్తి చార్జ్‌పై 50-60 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు.

సూట్‌కేస్‌తో స్కూటర్

ఈ సూట్‌కేస్ జిపిఎస్ నావిగేషన్ మరియు బర్గలర్ అలారమ్‌తో లభిస్తుంది. ఎవరైనా దొంగలు దీనిని అపహరిస్తే, జిపిఎస్ సాయంతో ఇదెక్కడుందో తెలుసుకోవచ్చు మరియు అలారమ్ సాయంతో చుట్టపక్కల వారిని అప్రమత్తం చేయవచ్చు.

సూట్‌కేస్‌తో స్కూటర్

ఈ సూట్‌కేస్ స్కూటర్‌ను ఊడదీయబడిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఉపయోగించి తయారు చేశాడు. దీనికి హ్యాండిల్ బార్, బ్రేక్స్, యాక్సిలేటర్, లైట్స్ అన్నీ ఉంటాయి. ముందు వైపు ఓ పెద్ద చక్రం వెనుక వైపు రెండు చిన్న చక్రాలుంటాయి.

సూట్‌కేస్‌తో స్కూటర్

వృత్తిరీత్యా రైతు అయిన గి లింయాగ్సైకు ఈ సూట్‌కేస్ స్కూటర్‌ను తయారు చేయటానికి 10 ఏళ్ల సమయం పట్టిందట. 1999లో ఓ కార్ సేఫ్టీ సిస్టమ్‌ను ఆవిష్కరించినందుకు గాను ఆయనను అమెరికాకు చెందిన ఓ పెట్టుబడిదారుడు సత్కరించాడట. ఆ సమయంలోనే తాను తన లగేజ్‌ను మర్చిపోవటంతో ఈ ఐడియా వచ్చిందని లియాంగ్సై చెప్పుకొచ్చాడు.

More from DriveSpark

Article Published On: Monday, June 2, 2014, 10:35 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+