బిఎమ్‌డబ్ల్యూ కోసం 7 గంటలు ఒంటి కాలిపై నిలుచున్న ఘనుడు
'కూటి కోసం కోటి తిప్పలు' ఇది పాత సామెత.. 'కారు కోసం కాలు తిప్పలు' ఇది నేటి సామెత. అప్పణంగా పైసా ఖర్చు లేకుండా ఖరీదైన బిఎమ్‌డబ్ల్యూ కారును కానుకగా ఇస్తామంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు, ఎంతటి కష్టాన్నైనా భరిస్తారు.
ఒకప్పుడు మహర్షులు ఒంటి కాలిపై జపం చేసి పరమశివుడ్ని పరవశం చేసుకున్నారని పురణాల్లో చదుకునే వాళ్లం. కానీ ఫొటోలో కనిపిస్తున్న కలియుగ మానవుడు మాత్రం ఒంటి కాలుపై నిలుచుకొని జర్మన్ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూని ప్రసన్నం చేసుకున్నాడు.

జర్మన్ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ గడచిన మార్చ్ నెలలో ఓ విచిత్రమైన పోటీ నిర్వహించింది. అదేంటంటే, తమ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 కారును ఒక చేతితో తాకి ఉంచి, ఒంటి కాలుపై గంటల కొద్దీ నిలబడి ఉండటమే.
ఇలా ఎవరైతే ఎక్కువ సేపు ఒంటి కాలు మీద కారు తాకి నిలబడుతారో, వారే విజేత. ఆ విజేతకు బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 కారును బహుకరిస్తారు. ఈ స్టంట్‌లో మొత్తం 140 మంది వ్యక్తులు పాల్గొంటే, అందులో ఒక్కరు విజేతగా నిలిచారు.

ఒకేచోట కదలకుండా ఒంటి కాలుపై గంటల కొద్దీ నిలుచుకోవాలంటే, ఆ బాధ మాటల్లో వర్ణించటం సాధ్యం కాదు. కానీ చైనాకు చెందిన వు డెకీ మాత్రం ఏకంగా 7 గంటల 26 నిమిషాల పాటు ఒంటి కాలుపై నిలుచుకొని బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1ను దక్కించుకున్నాడు.


Click it and Unblock the Notifications








