మరో కార్ డిజైన్ కాపీ కొట్టిన చైనా కంపెనీ.. ఈ సారి ఏ మోడల్ అంటే?

ప్రపంచ మార్కెట్లోని అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీల యొక్క వస్తువులను కాపీ కొట్టడం చైనాకి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటికే చైనా కంపెనీ కాపీకొట్టి తయారు చేసిన బైక్స్ మరియు కార్ల గురించి మునుపటి కథనాల్లో తెలుసుకున్నాం. ఇప్పుడు కూడా ఇదే నేపథ్యంలో మరో బ్రాండ్ కారుని చైనా కంపెనీ కాపీ కొట్టినట్లు తెలిసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

మరో కార్ డిజైన్ కాపీ కొట్టిన చైనా కంపెనీ.. ఈ సారి ఏ మోడల్ అంటే?

చైనాకు చెందిన BYD అనే కంపెనీ తయారీ దారులు ఇప్పుడు Ford కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ అయిన Ford EcoSport ని కాపీ కొట్టి అలాంటి కారును చైనా మార్కెట్లో విడుదల చేసింది. అయితే చైనా మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ Ford EcoSport ఎలక్ట్రిక్ కార్, అంతే కాదు దీనికి Yuan Pro (యువాన్ ప్రో) అని నామకరణం చేసారు.

మరో కార్ డిజైన్ కాపీ కొట్టిన చైనా కంపెనీ.. ఈ సారి ఏ మోడల్ అంటే?

చైనా మార్కెట్లోని వాహన ప్రియులను ఈ Yuan Pro (యువాన్ ప్రో) ఎలక్ట్రిక్ కాంపాక్ట్ SUV ఎక్కువగా ఆకర్షించడంలో విజయం సాధిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారుని BYD కంపెనీ "డ్రాగన్ ఫేస్ 3.0" అనే డిజైన్ లాంగ్వేజ్ ఉపయోగించినట్లు తెలిసింది. ఇది చూడటానికి దాదాపు Ford కంపెనీ యొక్క EcoSpor లాగ ఉంటుంది.

మరో కార్ డిజైన్ కాపీ కొట్టిన చైనా కంపెనీ.. ఈ సారి ఏ మోడల్ అంటే?

Yuan Pro (యువాన్ ప్రో) ఎలక్ట్రిక్ కాంపాక్ట్ SUV యొక్క సైడ్ ప్రొఫైల్ మరియు రియర్ ఫ్రొఫైల్ మొత్తం కూడా Ford EcoSport లాగానే ఉంటుంది. అంతే కాకుండా Ford EcoSport వంటి టెయిల్‌గేట్ మౌంటెడ్ స్పేర్ వీల్‌ను కూడా పొందుతుంది. దీని ఫ్రంట్ ప్రొఫైల్ కూడా చాలా వరకు అసలు మోడల్ మాదిరిగా ఉంటుంది.

మరో కార్ డిజైన్ కాపీ కొట్టిన చైనా కంపెనీ.. ఈ సారి ఏ మోడల్ అంటే?

అయితే కొత్త Yuan Pro (యువాన్ ప్రో) ఎలక్ట్రిక్ కాంపాక్ట్ SUV యొక్క హెడ్‌లైట్ డిజైన్ మరియు గ్రిల్‌ మాత్రం దాని అసలు మోడల్ కి భిన్నంగా ఉంటుంది. Yuan Pro (యువాన్ ప్రో) అనేది ఎలక్ట్రిక్ కారు కావడం వల్ల దీనికి ఫ్రంట్ గ్రిల్ లేదు. కానీ మిగిలిన అన్ని అంశాలు Ford EcoSport మాదిరిగానే ఉంది.

మరో కార్ డిజైన్ కాపీ కొట్టిన చైనా కంపెనీ.. ఈ సారి ఏ మోడల్ అంటే?

అయితే, దాని ఇతర ప్రొఫైల్ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ యొక్క అనేక అంశాలను పంచుకుంటుంది. కానీ ఈ ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇది Ford EcoSport కంటే భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక ఎలక్ట్రిక్ కార్ కావడం వల్ల ఇందులోని టెక్నాలజీ చాలా వరకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తుంది.

మరో కార్ డిజైన్ కాపీ కొట్టిన చైనా కంపెనీ.. ఈ సారి ఏ మోడల్ అంటే?

Yuan Pro (యువాన్ ప్రో) అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇందులో భాగంగానే Yuan Pro (యువాన్ ప్రో) కార్ 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 8 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటి వాటిని కలిగి ఉంటుంది. Ford EcoSport తో పోలిస్తే, మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే మరియు 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది.

మరో కార్ డిజైన్ కాపీ కొట్టిన చైనా కంపెనీ.. ఈ సారి ఏ మోడల్ అంటే?

దీనితో పాటుగా, అపోల్స్ట్రే మరియు క్యాబిన్ ఇప్పుడు లేత రంగులో ఉంటుంది. స్టీరింగ్ వీల్ మరియు ఎసి వెంట్‌ల డిజైన్ కూడా భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఇంటీరియర్‌ల విషయంలో, Yuan Pro ఖచ్చితంగా EcoSport కంటే మెరుగ్గా కనిపిస్తుంది. Yuan Pro (యువాన్ ప్రో) ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కంటే పొడవైన మరియు పొడవైన వీల్‌బేస్‌తో వస్తుంది. దీని పొడవు 4.37 మీటర్లు మరియు వీల్‌బేస్ 2,535 మిమీ. దీని అర్థం ఈ SUV రైడర్‌ల కోసం మెరుగైన క్యాబిన్ స్పేస్‌ను పొందుతుంది.

మరో కార్ డిజైన్ కాపీ కొట్టిన చైనా కంపెనీ.. ఈ సారి ఏ మోడల్ అంటే?

Yuan Pro లో గమనించదగ్గ అతి పెద్ద విషయం ఇందులోని పవర్‌ట్రెయిన్. BYD మూడు వేరియంట్లు మరియు 2 బ్యాటరీ సామర్థ్యాలతో Yuan Pro ని పరిచయం చేసింది. బేస్ వేరియంట్‌లో 38.9 kWh బ్యాటరీ ప్యాక్ అందుబాటులో ఉంది. ఈ బ్యాటరీ ప్యాక్ దాదాపు 300 కిమీ డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది.

మరో కార్ డిజైన్ కాపీ కొట్టిన చైనా కంపెనీ.. ఈ సారి ఏ మోడల్ అంటే?

అదేవిధంగా రెండవ బ్యాటరీ ప్యాక్ 50.1 కిలో వాట్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది 400 కిమీ డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది. దీనిలోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 136 బిహెచ్‌పి పవర్ మరియు 210 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అందిస్తుంది.

భారతదేశంలోని Ford EcoSport కాంపాక్ట్ SUV కి రెండు ఇంజిన్ ఎంపికలను కలిగి ఉంటుంది. ఇది బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఇందులో 1.5-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉన్నాయి.

మరో కార్ డిజైన్ కాపీ కొట్టిన చైనా కంపెనీ.. ఈ సారి ఏ మోడల్ అంటే?

Ford EcoSport యొక్క 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ 120 బిహెచ్‌పి మరియు 149 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా ఇందులోని 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ 99 బిహెచ్‌పి మరియు 215 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌లు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అందించబడ్డాయి. 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపిక టైటానియం ప్లస్ మోడల్‌లో టాప్ ఎండ్ మోడల్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

Most Read Articles

English summary
Chinese manufacturer copied ford ecosport into an electric suv details
Story first published: Monday, September 27, 2021, 15:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X