విమానాన్ని తయారు చేసిన విలేజ్ సైంటిస్ట్
చైనాకు చెందిన ఒక సాధారణ పల్లె నివాసి తన సొంత తెలివి తేటలతో, అతని మొత్తం కృషిని కూడగట్టుకుని తనకంటూ ఒక విమానాన్ని తయారు చేసుకున్నాడు. ఇప్పుడు ఎంతో విజయవంతంగా దానిని నింగిలో తిప్పుతున్నాడు కూడా.
ఈ ప్రయోగం విజయవంతం కావడంతో అందరూ పెద్ద ఎత్తున అతనికి అభినందనలు తెలుపుతున్నారు. తన ద్వారా తయారైన ఒక వస్తువు ఆకాశంలో ఎగురూతూ ఉండాలనేది ఇతని కోరికంట. ఏదైతేనేం ఎన్నో రకాల విమానాలు ఉన్నప్పటికీ ఇతను సృష్టించిన విమానం ఎంతో కొత్తగా ఉంది కదూ !. టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు అనడానికి ఇది ఒక నిదర్శనం.
ఈ విమానం గురించి మరిన్ని విషయాలు క్రింది కథనాల ద్వారా తెలుసుకుందా రండి.....

ఆ పల్లె మొత్తం శాస్త్రవేత్తలే
హెనాన్ ప్రావిన్స్ షి కొన్పో ఇది ఈ విమానాన్ని తయారు చేసిన సాధారణ వ్యక్తి పేరు. ఇతను వయస్సు ప్రస్తుతం 29 సంవత్సరాలు. హెనాన్ ఇతని 17 ఏటనే బడి మానేశాడు. అయితేనేం ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్‌లను తయారు చేశే వారికి శిక్షకుడు అయిపోయాడు.

అభిరుచి
ఇతను ఒక వైమానిక నిర్మాణ కంపెనీలో చేరిన తరువాత ఒక ప్రత్యేక శ్రద్ధతో అన్ని మెలుకువలను నేర్చుకున్నాడు. ఆ తరువాత తనదైన శైలిలో ఈ కొత్త ఎయిర్ క్రాప్ట్‌ని తయారు చేశాడు.

చిన్ననాటి కళ
హెనాన్ కు ఇది చిన్ననాటి కళ. చిన్నప్పుడు ఇతని అన్న ఒక పేపర్‌లో ఉన్న ఒక ఎయిర్ క్రాఫ్ట్‌ని పరీక్షిస్తూ ఎంతో పెద్దగా ఉందో అని అన్నాడంట. అంతే మనోడు నేను పెద్దైన తరువాత దీని కన్నా పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ ని తయారు చేస్తానని చెప్పాడంట.

ఇది ఎంత పెద్దగా ఉంటుందో తెలుసా?
హెనాన్ ఆలోచనలు నుండి బయటపడిన ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఏకంగా 23 మీటర్ల పొడవు మరియు 10 మీటర్ల ఎత్తు ఉంది. ఇంత భారీగా ఉంటే ఎక్కడ ఎగురుతుంది అని అనుమానం వ్యక్తం చేస్తున్నారా ? ఇతను విజయవంతంగా దీనిని నడిపి చూపించిన తరువాత కూడా నమ్మకపోతే ఎలా !

సాహసం
అవును నిజంగానే ఒక పెద్ద సాహసం. ఎందుకంటే హెనాన్ దీనిని 500 మీటర్ల ఎత్తు వరకు తీసుకెళ్లాడు మరియు దాదాపుగా ఎనిమిది సార్లు టేకాఫ్‌లు చేయించాడు. అయితే సాంకేతికంగా పరీక్షించిన తరువాత హెనాన్ సృష్టి అత్భుతం అని ఇతర సైంటిస్టులు కూడా తెలిపారు.

ఖర్చు
హెనాన్ కు దీనిని తయారు చేయడానికి దాదాపుగా 3 మిలియన్ యువాన్లను ఖర్చు చేసినట్లు తెలిపాడు. అంటే మన రుపాయల్లో అయితే అక్షరాల 30 లక్షల రుపాయలన్నమాట. ఇంత ధైర్యంతో దీనిని విజయవంతంగా తయారుచేసిన హెనాన్ మరి గ్రేటే కదా...!

భారతదేశపు కొత్త జలాంతర్గామి ఫ్రిగేట్ INS కల్వరి యొక్క గొప్పతనం !
పది రుపాయలకే లీటర్ కారు ఫ్యూయల్: సాధారణ కారు మెకానిక్ అత్భుత సృష్టి !!


Click it and Unblock the Notifications








