మోటారిస్టుల వేగాన్ని తగ్గించేందుకు రోడ్డుపై నగ్న బొమ్మ
కొందరు మోటారిస్టులకు నెమ్మదిగా వెళ్లండి, ట్రాఫిక్ నిబంధనలు పాటించండని తాటితాయంత అక్షరాలతో రాసిన సైన్ బోర్డులు మాత్రం కనిపించవు. ఒకవేళ కనిపించినా, అందులో ఏం రాసుందనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా.. జయ్ మని దూసుకుపోతుంటారు. అదే రోడ్డు పక్కన అందమైన అమ్మాయి ఫోటోతో ఉన్న అడ్వర్టయిజ్‌మెంట్ బోర్డులనయితే, నోరెళ్లబెట్టుకొని, కళ్లు ఆర్పకుండా చూస్తుంటారు.
మార్కెటింగ్ కంపెనీలు కూడా మోటారిస్టులకు ఉన్న ఈ వీక్‌నెస్ క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి. సరే ఇదంతా అటుంచితే, ఎవరైనా నెమ్మదిగా వెళ్లాల్సిన మితి మీరిన వేగంతో వెళ్తుంటే మీరేం చేస్తారు. మహా అయితే, సదరు మోటారిస్టు గురించి మనసులో తిట్టుకోవటం చేస్తారు. అంతేకాని వారికి కౌన్సింలింగ్‌నో లేక ఏదైనా సందేశాన్నో ఇచ్చే ధైర్యం మాత్రం చేయరు.
కానీ, చైనాలో మాత్రం ఓ బామ్మ తన 'హాట్' ట్రిక్‌తో మోటారిస్టుల వేగాని బ్రేక్‌లు వేసింది. ఇదిగో ఈ ఫోటోను సరిగ్గా చూడండి. పాదచారులు రోడ్డు దాటాల్సిన ప్రాంతంలో మోటారిస్టులు నెమ్మదిగా వెళ్లటానికి బదులు తరచూ వేగంగా వెళ్తుండటం, ఫలితంగా పాదచారులకు రోడ్డను దాటడంలో ఇబ్బంది కలుగుతుండటంతో, ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఆ బామ్మకు ఓ మెరుపులాంటి ఆలోచన వచ్చింది.
అంతే, వెంటనే షాప్‌కు ఓ నగ్న స్త్రీ బొమ్మ (సెక్స్ డాల్)ను కొనుక్కు వచ్చి పాదాచారులు రోడ్డును దాటే ప్రాంతంలో ఉండే ఓ చెట్టుకు కట్టేసింది. ఈ బొమ్మను దూరం నుంచి చూస్తే.. అచ్చం అందమైన అమ్మాయిలా కనిపిస్తుంది. అయితే, బామ్మ ఆ బొమ్మను పూర్తి నగ్నంగా ఉంచకుండా, దానికి అరకొర బట్టలను తగిలించింది. బామ్మ ట్రిక్ భలే పనిచేసింది. అటువైపు వెళ్లే మోటారిస్టులంతా తమ స్పీడ్‌ను తగ్గించి ఆ ప్లాస్టిక్ బొమ్మపై ఓ లుక్కేసి వెళ్తున్నారు. మరి ఈ చైనా బామ్మ ట్రిక్ మీకు నచ్చిందా..?


Click it and Unblock the Notifications









