బర్త్ డే స్పెషల్: చిరంజీవి గురించి షాకింగ్ నిజాలు-అరుదైన కార్లు

By N Kumar

"చిరంజీవి" టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ మహా దిగ్గజం.. భారతీయ చిత్ర పరిశ్రమలో అనితర సాధ్యమైన గుర్తింపు. చిరంజీవి గారి పేరును తలుచుకుంటే బిరుదులు, అవార్డులు, ఆస్తులు, అంతస్తులు, లెక్కలేనన్ని సినిమాలు ఇంకా అభిమానులు ఇలా ఎన్నో గుర్తొస్తాయి. ఈ స్థానాన్ని చేరుకోవడాని ఆయన పడ్డ ప్రయాసలు ఈ తరానికి అంత సులభంగా అంతుచిక్కకపోవచ్చు. కానీ.. నాన్నలు, తాతల కాలం నాటి చరిత్ర తిరగేస్తే ఆయన సుదీర్ఘ ప్రయాణం ప్రతిఒక్కరికీ ఓ చక్కటి పాఠమే అవుతుంది.

ఆగష్టు 22 చిరంజీవి గారి బర్త్ డే సందర్భంగా మెగాస్టార్ గురించి కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు ఆయన దగ్గర ఉన్నటువంటి కార్ల గురించి డ్రైవ్‌స్పార్క్ తెలుగు స్పెషల్ స్టోరీ..

బర్త్ డే స్పెషల్: చిరంజీవి గురించి షాకింగ్ నిజాలు-అరుదైన కార్లు

బాల్యంలో..

చిరంజీవిగారు బాల్యంలో నెల్లూరులో ఉండేవారు. పక్కింట్లో ఉన్నావిడ వీరి ఇంటికి వచ్చి "వదినా... కాస్త పాలలోకి తోడు ఇస్తారా..?" అనడాన్ని పదేపదే అనుకరించడం ద్వారా అతని నటన ఆరంభమయ్యింది. బాల్యం దాటుకొని భవిష్యత్తు ఏంటో ఎంచుకునే వయస్సులో ఉన్నపుడు నటన మీద మక్కువతో ఇంట్లో ఒప్పుకోరని తెలిసి ఎవ్వరికీ చెప్పకుండా మద్రాసు వెళ్లిపోయి అడయార్ ఫిల్మ్ ఇన్‌స్ట్యూట్‌లో చేరి పలు రకాల కోర్సులు, నటనా నైపుణ్యాలను వంటబట్టించుకుని సినిమాలా కావాలంటూ డైరక్టర్ల చుట్టూ తిరగడంతో చిరంజీవి గారి సినీ ప్రయాణం ప్రారంభమయ్యింది.

బర్త్ డే స్పెషల్: చిరంజీవి గురించి షాకింగ్ నిజాలు-అరుదైన కార్లు

తొలుత ఏదీ కూడా అంత సులభంగా సాధ్యమవ్వలేదు. ఈ కాలంలో ఏదైనా ఇక జరగదు.. చేయలేమనిపిస్తే వెంటనే వదిలేసి మరో దారి చూసుకుంటున్నారు యువత. కానీ అభివృద్దికి చాలా దూరంలో ఉన్న ఆ కాలంలోనే పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి "పునాది రాళ్లు" సినిమాతో బలమైన పునాది వేసుకున్నాడు.

బర్త్ డే స్పెషల్: చిరంజీవి గురించి షాకింగ్ నిజాలు-అరుదైన కార్లు

అప్పటి వరకు ముఖంలో హావభావాలు పలికించే నటను పండిస్తే సరిపోయేది. కానీ ప్రేక్షకులకు కొత్తదనాన్ని పరిచయం చేసేందుకు నటనతో పాటు ఆట-పాట ఎంతో కీలకమైపోయాయి. హీరో విషయానికి వస్తే డాన్స్ మరీ ముఖ్యం. సినిమా హాల్లో ఉన్నపుడు డాన్స్ వస్తే.. ఆ స్టెప్పు చూడండి మిస్సయితే మళ్లీ చూడలేం అనే స్థాయికు వచ్చారాయన. ఇండస్ట్రీలోనే ఎప్పుడూ లేని విధంగా బ్రేక్ డాన్సులతో ప్రేక్షకుల మతిపోగొట్టేశాడు. ఆ స్టెప్పులు ఇప్పటికీ చాలా ఫేమస్.

బర్త్ డే స్పెషల్: చిరంజీవి గురించి షాకింగ్ నిజాలు-అరుదైన కార్లు

ఖైదీ

1983లో కొండారామిరెడ్డిగారు నిర్మించిన చిత్రం "ఖైదీ". ఒక సినిమాని ఇలా కూడా తీస్తారా...? అనే ప్రేక్షకులందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. ఇందులో చిరంజీవి గారు శ్రమ, కృషికి వచ్చిన మార్కులు అన్నీఇన్ని కావు. ఇక ఈ సినిమా రికార్డుల గురించి అయితే చెప్పనక్కరలేదు.

బర్త్ డే స్పెషల్: చిరంజీవి గురించి షాకింగ్ నిజాలు-అరుదైన కార్లు

స్వయంకృషి

అప్పటి వరకు మంచి యాక్షన్, బ్రేక్ డాన్సు స్టెప్పులు, ఆల్ టైం రికార్డులతో చిత్ర సీమలో సింహ భాగంలో నిలిచిన చిరంజీవి గారు చెట్టు క్రింద చెప్పులు కుట్టుకునే వాడిలా నటించి ఘన విజయాన్ని అందుకున్నాడు. నటనపై తనకున్న ప్రేమతో తోలును ముట్టుకున్నాడు.. చెప్పులు కుట్టాడు.

బర్త్ డే స్పెషల్: చిరంజీవి గురించి షాకింగ్ నిజాలు-అరుదైన కార్లు

కొదమ సింహం

ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో గర్వకారణం. భారీ విజయం సాధించిన కొదమ సింహం సినిమా.. కేవలం చిరంజీవి గారి నటన కారణంగా ప్రపంచ సినీ పరిశ్రమగా పేరుగాంచిన హాలీవుడ్‌లోకి "హంటర్స్ ఆఫ్ ద ఇండియన్ ట్రెజర్" పేరుతో రీమేక్ చేశారు. ఎంత నచ్చితే ఇలా ఇంగ్లీషు సినిమాలోకి రీమేక్ చేస్తారు. అప్పట వరకు హాలీవుడ్‌లోకి రీమేక్ చేసిన సినిమాల్లో కొదమ సింహం దక్షిణ భారతదేశపు రెండ చిత్రం కాగా, మొదటిది సూపర్ స్టార్ కృష్ణ నటించిన మొసగాళ్లకు మోసగాడు.

Most Read:టాటా హారియర్ కొత్త డార్క్ ఎడిషన్ ఇదే

బర్త్ డే స్పెషల్: చిరంజీవి గురించి షాకింగ్ నిజాలు-అరుదైన కార్లు

చిరంజీవి గారి నట ప్రయాణంలోకెళితే ఇంకా ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి.. వరుసగా 10 సినిమాలు 100 రోజులు ఆడిన ఘనత, కోదండరామి రెడ్డి గారి వంటి దర్శకుడితోనే వరుసగా 21 సినిమాలు చేయడం, ఆరు రోజుల్లో 10 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఘరానా మొగుడు వంటి ఎన్నో రికార్డులు ఆయన ఖాతాలో వేసుకున్నాడు.

Most Read:మేడ్ఇన్ ఆంధ్రప్రదేశ్: కియా సెల్టోస్ విడుదల

బర్త్ డే స్పెషల్: చిరంజీవి గురించి షాకింగ్ నిజాలు-అరుదైన కార్లు

ఆపద్భాందవుడు సినిమాకు గాను 1.25 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకొని బాలీవుడ్ మెగాస్టార్‌గా పేరుగడించిన అమితా బచ్చన్ దాటేసిన తొలి హీరోగా చిరంజీవి గారు నిలిచారు. శ్రీదేవితో నటించిన "జగదేక వీరుడ అతిలోక సుందరి" సినిమా చేస్తున్నపుడు 104 డిగ్రీల జ్వరం ఉన్నప్పటికీ సమయం వృధా కాకూడదని "ప్రియతమా.." అనే పాట చేశారు.

Most Read:హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కొంటున్న కస్టమర్లకు గుడ్‌న్యూస్!

బర్త్ డే స్పెషల్: చిరంజీవి గురించి షాకింగ్ నిజాలు-అరుదైన కార్లు

విమాన ప్రమాదం నుండి సురక్షితంగా...

మద్రాసు నుండి హైదరాబాద్‌కి విమానంలో ప్రయాణిస్తుండగా తిరుపతి సమీపంలోని రేణిగుంట పంటపొలాల్లో ప్రమాదవశాత్తు విమానం దిగింది. ఇందులో చిరంజీవితో పాటు వెంకటేష్ మరియు విజయశాంతి కూడా ఉన్నారు. విషయం తెలుసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు విలవిల్లాడిపోయారు. అభిమానులు మరియు ప్రజల కోసం బ్లడ్ మరియు ఐ బ్యాంక్‌ను నెలకొల్పారు.

బర్త్ డే స్పెషల్: చిరంజీవి గురించి షాకింగ్ నిజాలు-అరుదైన కార్లు

రాజకీయ రంగ ప్రవేశం..

సుధీర్ఘ సినీ ప్రయాణానికి ముగింపు పలికి రాజకీయాల్లోకి ప్రవేశించిన చిరంజీవి సుమారుగా 9 సంవత్సరాల గ్యాప్ తర్వాత నీ స్టోరీ క్లోజ్.. మెగాస్టార్ ఓ అధ్యాయం ముగిసిపోయిందనుకున్న తరుణంలో "అమ్ముడూ.. లెట్స్ డూ కుమ్ముడూ.." అంటూ 60 ఏళ్ల వయసులో 20 ఏళ్ల యునతను కూడా వెర్రెక్కించే స్టెప్పులతో సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించారు. ఇప్పుడు చిరంజీవిగారు తాజా చిత్రం "సైరా నరసింహారెడ్డి" ప్రేక్షకుల ముందుకొచ్చింది

చిరంజీవి కార్ గ్యారేజీలో ఏయే కార్లున్నాయో ఓ లుక్కేసుకుందాం రండి...

బర్త్ డే స్పెషల్: చిరంజీవి గురించి షాకింగ్ నిజాలు-అరుదైన కార్లు

రోల్స్ రాయిస్ ఫాంటమ్

నటన పరంగా కాకుండా అమితా‌బ్‌తో చిరజీవిగారు మ్యాచ్ అయ్యే మరో అంశం రోల్స్ రాయిస్. అత్యంత ఖరీదైన మరియు అరుదైన రోల్స్ రాయిస్ చిరంజీవి గారి గురించి అమితాబ్ మరియు చిరంజీవి ఇద్దరి వద్ద ఉంది. దీని ధర సుమారుగా ఎనిమిది కోట్ల రుపాయలుగా ఉంది.

బర్త్ డే స్పెషల్: చిరంజీవి గురించి షాకింగ్ నిజాలు-అరుదైన కార్లు

విలాసవంతమైన పవర్ ఫుల్ రోల్స్ రాయిస్ ఫాంటమ్ లగ్జరీ కారును చిరంజీవికి ఆయన 53వ పుట్టిన రోజు సందర్భంగా తన తనయుడు రామ్ చరణ్ తేజ్ బహుకరించాడు. ఇతర కార్లలా కాకుండా తన అవసరాలకు అనుగుణంగా ఇందులో ఎన్నో మోడిఫికేషన్స్ చేయించుకున్నాడు.

బర్త్ డే స్పెషల్: చిరంజీవి గురించి షాకింగ్ నిజాలు-అరుదైన కార్లు

రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారులో సాంకేతికంగా 6.8-లీటర్ కెపాసిటి గల వి12 న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఈ పవర్‌ఫుల్ ఇంజన్ 460బిహెచ్‌పి పవర్ మరియు 720ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

బర్త్ డే స్పెషల్: చిరంజీవి గురించి షాకింగ్ నిజాలు-అరుదైన కార్లు

టయోటా ల్యాండ్ క్రూయిజర్

చిరంజీవి వద్ద రెండు టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎస్‌యూవీలు ఉన్నాయి. వీటిలో టయోటా ఇండియన్ మార్కెట్లోకి పరిచయం చేయక ముందే ఒక వెహికల్‌ను దిగుమతి చేసుకోగా, మరో వెహికల్‌ను తన 59వ పుట్టిన రోజు సందర్భంగా తనయుడు రామ్ చరణ్ గిఫ్టుగా ఇచ్చాడు. ఇలాంటి ఎస్‌యూవీలు ముఖ్యమంత్రుల కాన్వాయ్‌లో సీఎం అధికారికంగా వాహనంగా ఉన్నాయి.

బర్త్ డే స్పెషల్: చిరంజీవి గురించి షాకింగ్ నిజాలు-అరుదైన కార్లు

సేఫ్టీ పరంగా మంచి పేరు తెచ్చుకున్న ల్యాండ్ క్రూయిజర్ ఎంతో మంది ఇండియన్ సెలబ్రిటీలు మరియు రాజకీయ నాయకుల కార్ల జాబితాలో స్థానం సంపాదించుకుంది. ఇండియన్ మార్కెట్లో టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎస్‌యూవీ ప్రారంభ ధర కోటి ఇరవై లక్షల పైమాటే.

బర్త్ డే స్పెషల్: చిరంజీవి గురించి షాకింగ్ నిజాలు-అరుదైన కార్లు

అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు మరియు అత్యుత్తమ నిర్మాణ విలువలు మరియు నాణ్యత గల ల్యాండ్ క్రూయిజర్‌లో టయోటా కిర్లోస్కర్ 1.5-లీటర్ వి8 టుర్బో డీజల్ ఇంజన్ అందించారు. ఈ శక్తివంతమైన డీజల్ యూనిట్ గరిష్టంగా 262బిహెచ్‌పి పవర్ మరియు 650ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

బర్త్ డే స్పెషల్: చిరంజీవి గురించి షాకింగ్ నిజాలు-అరుదైన కార్లు

రేంజ్ రోవర్ వోగ్

చిరంజీవి ఖరీదైన కార్ల కలెక్షన్‌లో రేంజ్ రోవర్ వోగ్ లగ్జరీ ఎస్‌యూవీ ఉంది. ప్రస్తుతం ఉన్న వోగ్‌ ఎస్‌యూవీతో పోల్చుకుంటే మునుపటి జనరేషన్ లోగ్ ఎస్‌యూవీలో అత్యంత శక్తివంతమైన ఇంజన్, సురక్షితమైన తేలికపాటి క్యాబిన్ మరియు ఎన్నో ఇంటీరియర్ ఫీచర్లు ఉన్నాయి. అప్పట్లోనే దీని ధర కోటి రుపాయలుగా ఉండేది.

బర్త్ డే స్పెషల్: చిరంజీవి గురించి షాకింగ్ నిజాలు-అరుదైన కార్లు

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రేంజ్ రోవర్ వోగ్ లగ్జరీ ఎస్‌యూవీ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో లభిస్తోంది. ఇందులోని 3.0-లీటర్ డీజల్ ఇంజన్ 254బిహెచ్‌పి పవర్ మరియు 600ఎన్ఎమ్ టార్క్ అదే విధంగా 3.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ 335బిహెచ్‌పి పవర్ మరియు 450ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

Most Read Articles

English summary
Chiranjeevi Car Collection and Interesting Facts. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X