ఈ కారు ఒక భూతల స్వర్గం.. సినీ ఇండస్ట్రీలో కారు గురించే చర్చ! అనిల్ రావిపూడికి మెగాస్టార్ లగ్జరీ గిఫ్ట్‌

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను పొందుతూ, ఏకంగా రూ. 350 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టి సంచలన విజయంగా నిలిచింది. మాస్ ఆడియన్స్‌తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న ఈ చిత్రం, చిరంజీవి కెరీర్‌లో మరో మైలురాయిగా మారింది. ఈ భారీ సక్సెస్ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తన ఆనందాన్ని ప్రత్యేకంగా వ్యక్తం చేశారు. సినిమా విజయానికి కీలకంగా నిలిచిన దర్శకుడు అనిల్ రావిపూడికి, చిరు తన సంతోషాన్ని చాటుతూ ఖరీదైన అల్ట్రా ప్రీమియం రేంజ్ రోవర్ స్పోర్ట్ కారును గిఫ్ట్‌గా అందించారు.

ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సినీ వర్గాలు చిరంజీవి మనసుదోరణికి మరోసారి ఫిదా అయ్యాయి. ఇటీవల దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో కారు తాళాలు అనిల్ రావిపూడికి అందజేస్తూ, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి అంటూ చిరంజీవి సరదాగా సూచనలు ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంది.

Chiranjeevi Gifts Range Rover Sport To Anil Ravipudi Here Car Details

ఆ సందర్భంలో చిరు నవ్వుతూ, ఇంతకీ ఈ కారు నచ్చిందో లేదో చెప్పలేదు? అని అడగగా, దానికి సమాధానంగా అనిల్ రావిపూడి వెంటనే మన శంకర వరప్రసాద్ గారు సినిమాలోని ఫేమస్ డైలాగ్‌ను గుర్తు చేస్తూ, నచ్చడం ఏంటి సార్.. మెగా బహుమతి, మహదానందం, మనోధైర్యం, ధనాధన్! అంటూ చెప్పడంతో అక్కడున్న వారంతా నవ్వులతో మారుమోగిపోయారు. ఈ ఖరీదైన కారు గురించిన వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

రేంజ్ రోవర్ స్పోర్ట్ నిజంగా అల్ట్రా-లగ్జరీ సెగ్మెంట్‌కు చెందిన SUV. ఈ కారు ధర రూ.1.59 కోట్ల వరకు(ఎక్స్-షోరూమ్) ఉంటుందని సమాచారం. ఇది తాజా తరం రేంజ్ రోవర్ స్పోర్ట్ మోడల్ కావడం విశేషం. ఇంజిన్ ఎంపికల పరంగా ఈ లగ్జరీ SUV రెండు శక్తివంతమైన ఆప్షన్లతో అందించబడుతుంది. మొదటిది 3.0-లీటర్, ఆరు-సిలిండర్ పెట్రోల్ ఇంజన్, ఇది 394 bhp పవర్, 550 Nm పీక్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.

Chiranjeevi Gifts Range Rover Sport To Anil Ravipudi Here Car Details

ఈ ఇంజన్ స్మూత్ పనితీరుతో పాటు స్పోర్టీ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. మరోవైపు, ఎక్కువ టార్క్‌ను కోరుకునే వారి కోసం 3.0-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ ఉంది. ఇది 345 bhp పవర్, భారీగా 700 Nm పీక్ టార్క్ను అందిస్తుంది. ఈ రెండు ఇంజిన్ ఆప్షన్లు ఒకే రకమైన 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడ్డాయి. అంతేకాదు, రేంజ్ రోవర్ స్పోర్ట్‌లో ఫోర్-వీల్ డ్రైవ్ (4WD) సిస్టమ్ స్టాండర్డ్‌గా అందించబడుతుంది.

ఇంటీరియర్ విషయానికి వస్తే, ఈ లగ్జరీ SUV అత్యాధునిక టెక్నాలజీతో నిండిన ప్రీమియం కేబిన్‌ను కలిగి ఉంది. వెంటిలేషన్‌తో కూడిన పవర్డ్ ఫ్రంట్ సీట్లు, పవర్-అడ్జస్టబుల్ రిక్లైన్ ఫంక్షన్‌తో వెంటిలేటెడ్ రియర్ సీట్లు, వెనుక సీట్లో కూర్చునే ప్రయాణికుల కోసం 11.4-అంగుళాల రియర్ సీట్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ అందించారు. మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకునేలా, 3D సరౌండ్ సౌండ్‌ ఆడియో సిస్టమ్, క్వాడ్-జోన్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్‌ను అందించారు.

Chiranjeevi Gifts Range Rover Sport To Anil Ravipudi Here Car Details

ముందు, వెనుక సీట్లలో కూర్చున్న ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన ఉష్ణోగ్రతను సెట్ చేసుకునే సౌకర్యం ఇందులో ఉంటుంది. ఈ అన్ని ఫీచర్లు కలిసి, ప్రతి ప్రయాణాన్ని ఒక లగ్జరీ అనుభవంగా మార్చుతాయి. డిజైన్, ఇంజనీరింగ్ పరంగా చూస్తే, రేంజ్ రోవర్ స్పోర్ట్‌ను ల్యాండ్ రోవర్ అత్యాధునిక MLA ఫ్లెక్స్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. ఈ ఆధునిక ప్లాట్‌ఫామ్ వాహనానికి మెరుగైన బలం, అధిక స్టెబిలిటీ, మెరుగైన హ్యాండ్లింగ్‌ను అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, January 27, 2026, 17:10 [IST]
English summary
Chiranjeevi gifts range rover sport to anil ravipudi here car details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+