Chiranjeevi Car Fancy Number చిరు కొత్త కారు దాని ఫాన్సీ ధర ఎంతో తెలుసా..?
మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఓ కారుని కొనుగోలు చేశారు. ఈ అత్యాధునిక కారుతో చిరు గ్యారేజీలో మరో లగ్జరీ వాహనం వచ్చి చేరింది. ఈ కారు కోసం అధిక మొత్తంలో చిరు వెచ్చించారు. కేవలం కారు కోసం ఫ్యాన్సీ నంబర్ కోసం అధిక మొత్తంలో ఈ జగదేకవీరుడు ఖర్చు చేశారు.
చిరు గ్యారేజీలో ఇప్పటికే భారీ కార్లు ఉన్నాయి. తాజాగా తను కొనుగోలు చేసిన టయోటా వెల్‌ఫైర్ కారుతో మరో లగ్జరీ కారులో చిరంజీవి ఖాతాలో చేరింది. ఈ కారు ధర భారీగానే ఉంది. మార్కెట్ లో లైఫ్ ట్యాక్సీ, ఇతర ధరల్నీ కలుపుకుని మొత్తం సుమారు రూ.1.2కోట్లు రూపాయల విలువ ఉంటుంది. బర్నింగ్ బ్లాక్ కలర్ తో ఈ కారు దర్శనమివ్వనుంది.

రిజిస్ట్రేషన్ కోసం భారీ ధర..
భారీ కారు కొన్నంత మాత్రాన దానికి సరైన రిజిష్ట్రేషన్ నంబర్ లేకుంటే బాగుండదని చిరు భావించి ఉంటారు. ఇందుకోసం ఫ్యాన్నీ నంబర్ ని ఆయన కొనుగోలు చేశారు. ఇందుకోసం రూ.4.70లక్షలతో TS 09 GB 1111 నంబర్‌ను మెగాస్టార్ కైవసం చేసుకున్నారు. అందులో భాగంగానే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్(ఆర్‌సీ)కోసం మంగళవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి మెగాస్టార్ వచ్చారు.
చిరు ఆర్టీఏ కార్యాలయానికి చేరుకున్న సమయంలో ఆర్టీఓ రామచంద్రం సమక్షంలో ఫొటో, డిజిటల్ సంతకం వంటి ప్రక్రియలను పూర్తి చేశారు. ఆయన పేరుతో చిరంజీవి వాహనాన్ని రిజిస్ట్రర్ చేయించారు. అనంతరం సిబ్బందితో కాసేపు సరదాగా మాట్లాడారు. ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ మోడల్ కార్లు జూ.ఎన్టీఆర్, నాగబాబులు కలిగి ఉన్నారు.

గ్యారేజీలో అధునాతన కార్లు..
ఇది చిరంజీవికి చెందిన ఏకైక ఖరీదైన కారు కానప్పటికీ, పైన పేర్కొన్న ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ కోసం అతను భారీ ధర చెల్లించాల్సి వచ్చింది. చిరంజీవి గ్యారేజీలో ఇంతకు ముందే టయోటా ల్యాండ్ క్రూయిజర్‌ని కలిగి ఉండటమే కాకుండా అతని కుమారుడు రామ్ చరణ్ బహుమతిగా ఇచ్చిన రోల్స్ రాయిస్ వంటి కొన్ని అద్భుతమైన హై-ఎండ్ కార్లను కూడా కలిగి ఉన్నారు.
ప్రస్తుతం ఇండియన్ ఫోర్ వీలర్ మార్కెట్లో బుకింగ్స్‌కు కోసం వేచి చూడాల్సిన వాహనాల్లో టయోటా వెల్‌ఫైర్ ఒక ప్రీమియం కారుగా ఉండటం విశేషం. టయోటా నుంచి విడుదలైన ఈ వెల్‌ఫైర్‌లో అద్భుతమైన, అత్యాధునికమైన హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఫీచర్లతో పాటు భద్రతాపరమైన అనేక ఆధునిక ఫీచర్స్ చాలా ఉన్నాయి.
ఫ్రీ స్పేస్ ఎక్కువ..
ప్రీమియం స్పెసిఫికేషన్స్ తో విడుదలైన ఈ ఎంపీవీలో మూడు వరుసలు ఉంటాయి. దీనిలో సులభంగా ఏడుగురు కూర్చొని హాయిగా జర్నీ చేయవచ్చు. ఎక్కువ ఫ్రీ స్పేస్ ని కలిగి ఉండటం ఈ కారులోని ప్రత్యేక అడ్వాంటేజ్ గా చెప్పవచ్చు. మధ్య వరుసలో ఉంటే వీఐపీ సీట్లు చాలా సౌకర్యవంతంగా హై సేఫ్టీతో ఉంటాయి.
భద్రత కోసం ప్రమాదంలో కాపాడే ఏడు ఎయిర్‌బ్యాగ్స్, ట్విన్ సన్‌రూఫ్, త్రీజోన్ క్లైమేట్ కంట్రోల్, 13 అంగుళాల ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్స్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్‌లో ఆటో, యాపిల్ కార్‌ప్లేను సపోర్ట్ చేయనున్నాయి. ఇలా అనేక ఫీచర్లను ఈ ఎంపీవీ కలిగి ఉంది.
స్లైడింగ్ డోర్స్..
ఇక దీని ముందు భాగంలోని ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి. బర్నింగ్ బ్లాక్, వెల్‌ఫైర్ పెరల్ వైట్, గ్రాఫైట్ కలర్స్‌లో ఈ వెల్‌ఫైర్ అందుబాటులో ఉంది. ఈ వాహనం లీటర్ కి గరిష్ఠంగా 16.35 కిలో మీటర్లు అందించనుంది. వీటితో పాటు పనోరమిక్ వ్యూ మానిటర్, వెహికిల్ డైనమిక్ మేనేజ్‌మెంట్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్లైడింగ్ డోర్స్ ఫీచర్లను కలిగి ఉండటం విశేషం.
గత ఏడాదిలో మలయాళ చిత్రం 'గాడ్‌ఫాదర్'ని రీమేక్ చేసిన చిరంజీవి, తాజాగా ఆయన 'వాల్తేర్ వీరయ్య' చిత్రంలో నటించారు. ప్రస్తుతం 2015 తమిళంలో హిట్ కొట్టిన వేదాళం సినిమాను తెలుగు రీమేక్ గా 'భోలా శంకర్' ద్వారా అందిస్తున్నారు. ఇందులో చిరు సరసన తమన్నా, కీర్తి సురేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications








