చిట్టీ చిట్టీ బ్యాంగ్ బ్యాంగ్ మ్యాజిక్ కారు జెన్ 11 వేలం

Aston Martin
హాలీవుడ్ చిత్రం చిట్టీ చిట్టీ బ్యాంగ్ బ్యాంగ్ గుర్తుందా.. అందులో ఓ కారు చేసే మ్యాజిక్కులు గుర్తున్నాయి కదా.. సినిమాలో జయ్యిమని గాల్లో ఎగిరిపోవడం, నీటిలో పడవలా ప్రయాణించే ఈ కారు ఇకపై నిజమైన రోడ్లపైకి రానుంది. చిట్టీ చిట్టీ బ్యాంగ్ బ్యాంగ్ చిత్రంలో కనిపించే "జెన్ 11" మ్యాజిక్ కారుకు లండన్‌లో మే 15న వేలం నిర్వహించనున్నారు. ఈ కారును 1967లో తయారు చేశారు. ఈ చిత్రంలో జెన్ 11 కారే ప్రధాన పాత్రధారి. ఇయాన్ ఫ్లెమింగ్ రాసిన ఓ నావెల్ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. కెన్ ఆడమ్, రోలాండ్ ఎమ్మెట్ మరియు ఫోర్డ్ రేసింగ్ టీమ్‌లు ఈ కారును తయారు చేశాయి.

ఈ కారు బానెట్‌ను పాలిష్డ్ అల్యూమినియంతో తయారు చేశారు. బోట్ డెక్‌ను బకింగ్‌హామ్‌షైర్‌లోని పడవలు తయారుచేసే వాళ్లతో పూర్తిగా చేతులతో తయారు చేయించారు. ఇందులో వాడిన బ్రాస్ ఫిట్టింగ్‌లను ఎడ్వర్డియన్ కార్ల నుంచి తెప్పించుకున్నారు. ఈ కారు తయారీ సంబంధించి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇందులో ఉపయోగించిన అల్లాయ్ డ్యాష్‌బోర్డ్ ప్లేటును బ్రిటీష్ మొదటి ప్రపంచ యుద్ధ విమానం నుంచి సేకరించారు. ఈ కారు బరువు సుమారు రెండు టన్నులు, ఇది 17 ' అడుగుల పొడవు ఉండి ఫోర్డ్ 3 లీటర్ వీ-6 ఇంజన్‌తో నడుస్తుంది. అప్పట్లోనే ఈ కారును ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో రూపొందించారు.

ఈ కారుకు సంబంధించి మరో ఆసక్తి కరమైన అంశం ఏంటంటే.. 1967లో తయారైన ఈ కారుకు "GEN 11" అనే రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఇవ్వడం జరిగింది. 1 అంకెను i గా చదివితే అది జెన్నీ (Genii) అనే శబ్దాన్ని ఇస్తుంది. లాటిన్ పరిభాషలో జెన్నీ అంటే మాయలు తెలిసిన వ్యక్తి లేదా వస్తువు అని అర్థం. గత సెప్టెంబర్‌లో కూడా జేమ్స్‌ బాండ్ చిత్రాలయిన గోల్డ్‌ఫింగర్, థండర్‌బాల్ వంటి చిత్రాల్లో ఉపయోగించిన "ఆస్టన్ మార్టిన్ డిబి5" కారు వేలాడని ఉంచితే 4.1 మిలియన్ డాలర్లు పలికింది. అమెరికాకు చెందిన హ్యారీ ఇయాగ్గీ ఈ కారును సొంతం చేసుకున్నారు. ఈ కారును లండన్‌లోని ఆర్ఎమ్ ఆక్షన్ ఆటోమొబైల్ సంస్థ వేలం వేసింది. అప్పట్లో ఇదే అత్యంత వేగంగా ప్రయాణించే కారు. ఇది గంటకు 143 మైళ్ల (233 కిలోమీటర్ల) వేగంతో ప్రయాణిస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, May 3, 2011, 17:48 [IST]
English summary
The magical car "GEN 11" which was used in Chitty Chitty Bang Bang a hollywood movie, went under auction hammer. This car was built in 1967, and it was played a central role in the film.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+