ఈ బైక్ తినేయొచ్చు, మీరు విన్నది నిజమే.. ఓ లుక్కేయండి

సాధారణంగా కొంతమంది వ్యక్తుల చేతిలో వాహనాలు కొత్త రూపంలోకి మారుతాయి. ఇప్పటికే మనం చెక్కతో తయారైన వాహనాలు, కోక్ టిన్స్ తో తయారైన వాహనాల గురించి మునుపటి కథనాలలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఇదే రీతిలో ఒక చెప్ తన అద్భుతమైన నైపుణ్యంతో పూర్తిగా చాక్లెట్‌తో ఒక క్రూయిజర్ బైక్‌ను సృష్టించాడు. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం..

ఈ బైక్ తినేయొచ్చు.. ఇది నిజమే.. ఓ లుక్కేయండి

వాహనాల పట్ల ఎక్కువ మక్కువ ఉన్న కొంతమంది తమకు ఇష్టమైన వాహనల ఫోటోలు లేదా బొమ్మ వాహనాలను కొని వారి ఇంట్లో ఉంచుకుంటారు. అంతే కాదు మరి కొంతమంది తమ ఆఫీసు డెస్క్‌ల మీద కూడా అలంకరించుకుంటారు.

ఈ బైక్ తినేయొచ్చు.. ఇది నిజమే.. ఓ లుక్కేయండి

ఈ నేపథ్యంలో వాహనప్రియులను ఆకర్షించడానికి ఒక చెఫ్ చాక్లెట్ తో బైక్‌ను సృష్టించాడు. ఆ చెప్ తనకున్న అసాధారణ సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి ఈ చాక్లెట్ బైక్‌ను సృష్టించాడు. ఇంతకుముందు చాక్లెట్ తో తయారైన వివిధ నమూనాలను చూసి ఉంటారు. ఇప్పుడు ఈ చెప్ యొక్క అద్భుత సామర్త్యంతో ఈ చాక్లెట్ బైక్ పుట్టుకొచ్చింది.

MOST READ:అలెర్ట్.. ఇప్పుడు ఆన్‌లైన్ డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి ఇది తప్పనిసరి

ఈ బైక్ తినేయొచ్చు.. ఇది నిజమే.. ఓ లుక్కేయండి

ఈ చాక్లెట్ చూడటానికి చాలా ఆక్షర్షణీయంగా ఉంది. ఈ నమూనా చాలామందిని ఆకర్శించడమే కాకుండా ఆశ్చర్యానికి గురిచేసింది. నిజంగానే ఇది అద్భుత కళా సృష్టి. ఇంత అద్భుతమైన కళాఖండం చాక్లెట్ తో తయారవ్వడం నిజంగా ప్రశంసనీయం.

ఈ బైక్ తినేయొచ్చు.. ఇది నిజమే.. ఓ లుక్కేయండి

నివేదికల ప్రకారం 'అమౌరి గుచాన్' స్విట్జర్లాండ్‌లోని జెనీవాకు చెందినవాడు. అతను స్వీట్లు మరియు పిండి ఉత్పత్తులను తయారు చేయడంలో సిద్ధహస్తుడు. ప్రస్తుతం యితడు ఈ బైక్ తయారుచేయడం మాత్రమే కాకుండా ఇంతకుముందు కూడా అతడు విచిత్రంగా టెలిస్కోపులు, ఏనుగులు చాక్లెట్‌తో తయారు చేసాడు.

MOST READ:ఈ రిక్షా కొనుగోలుదారులకు షాక్ ఇచ్చిన సుప్రీమ్ కోర్టు

ఈ బైక్ తినేయొచ్చు.. ఇది నిజమే.. ఓ లుక్కేయండి

వీటిపై తనకున్న అభిరుచి కారణంగా ఇప్పుడు ఏకంగా చాక్లెట్ తో మోటారుసైకిల్ రూపొందించాడు. ఇది చూడటానికి నిజమైన మోటారుసైకిల్ లాగా కనిపిస్తుంది. కానీ ఈ బైక్ తయారీలో చాక్లెట్ తప్ప మరేమీ ఉపయోగించలేదు. ఇది సాధారణంగా అందరూ తినగలిగిన చాక్లెట్.

చాక్లెట్ తో తయారైన ఈ బైక్ యొక్క కలర్స్ కోసం ఫుడ్ కలర్స్ ఉపయోగించారు. గుచాన్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఇది ఎలా రూపొందించబడిందో వివరిస్తూ ఒక వీడియోను పోస్ట్ చేసింది. మీరు ఆ వీడియోను కూడా ఇక్కడ చూడవచ్చు.

MOST READ:ఇలయదలపతి విజయ్ ఉపయోగించే లగ్జరీ కార్స్ ఇవే, చూసారా..?

ఈ బైక్ తినేయొచ్చు.. ఇది నిజమే.. ఓ లుక్కేయండి

చాక్లెట్ మోటార్ సైకిల్ క్రూయిజర్ టైప్ బైక్. ఇందులో స్పెషల్ సిలిండర్లు, ఇంజన్ కేసు, హెడ్‌లైట్, ఎగ్జాస్ట్, వీల్ మరియు స్పోక్ వైర్లు అన్నీ చాక్లెట్‌తో తయారు చేయబడ్డాయి.

ఈ బైక్ తినేయొచ్చు.. ఇది నిజమే.. ఓ లుక్కేయండి

ఇవి మాత్రమే కాకుండా డిస్క్ బ్రేక్‌లు, సీటును కూడా చాక్లెట్ తయారు చేశాడు. ఈ బైక్ లో హెడ్ లైట్ స్పెషల్ గా కనిపిస్తుంది. ఇది ఏ చాక్లెట్‌తో తయారు చేయబడిందో మీకు చిన్న సందేహం కలిగి ఉండవచ్చు. ఈ భాగానికి చక్కెర గుజ్జు ఉపయోగించబడింది. కావున నిస్సంకోచంగా ఇది అన్ని తినదగిన పదార్థాలతో మాత్రమే తయారైన బైక్. కృషి ఉంటే మనుషులు దేన్నైనా సాధించగలరు అని ఇతడు మరోసారి ఋజువుచేసాడు.

MOST READ:హైదరాబాద్‌లో మళ్ళీ ప్రారంభం కానున్న డబుల్ డెక్కర్ బస్ సర్వీస్..ఎప్పుడంటే?

Most Read Articles

English summary
Chocolate Cruiser Bike Assembled By Pastry Chef Amaury Guichon. Read in Telugu.
Story first published: Wednesday, February 10, 2021, 11:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X