Bike Mileage బైక్ మైలేజ్ తగ్గిపోతుందా.. 99 శాతం కారణం ఇదే ..!
భారత దేశంలో అత్యధిక శాతం మంది ప్రజలు ద్విచక్ర వాహనాలను వినియోగిస్తారు. ఆఫీస్‌లకు వెళ్లేవారు, ఇతర పనుల కోసం తిరిగేవారు, డెలివరీ బాయ్స్ సహా అత్యధిక మధ్య తరగతి ప్రజలు బైక్‌లనే వినియోగిస్తారు. అందులో కొందరు కొత్తగా విడుదలైన బైక్‌లను కొనుగోలు చేస్తారు. మరికొందరు తమకున్న పాతతరం బైక్‌లనే వినియోగిస్తారు. పాతబైక్‌లు వినియోగిస్తున్న వాళ్లు తమ వాహనం మైలేజ్ తగ్గిపోవడం గమనిస్తుంటారు. కానీ సమస్య ఏంటో అర్థం కాదు.
రోజురోజుకు పెట్రోల్ ధరలు పెరిగిపోతున్న పరిస్థితుల్లో బైక్ మైలేజ్ కూడా తగ్గిపోవడం మనకు మరింత ఆందోళన కలిగించే విషయం. అయితే క్రమం తప్పకుండా బైక్ సర్వీస్ చేస్తున్నా.. మైలేజ్ తగ్గిపోవడానికి కారణం ఏంటో తెలుసా.. ? అదే ఇంజిన్ వద్ద నుండే చౌక్.. కార్య్బోరేటర్ కలిగిన బైక్‌లో మాత్రమే ఉంటుంది. దీన్ని సరిగా ఉపయోగించడం తెలియకపోవడం వల్లే ఉన్నట్టుండి మైలేజ్ తగ్గినట్లు అనిపిస్తుంది.

ప్రస్తుతం విడుదల అవుతున్న బైక్‌లలో ఇంజిన్‌లోకి ఇంధనాన్ని పంపేందుకు ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అందుబాటులో ఉంటుంది. ఈ సిస్టమ్ అధునాతనమైనది మరియు ఇంధనాన్ని ఆదా చేస్తుంది. కానీ పాత బైక్‌లలో ఇటువంటి వ్యవస్థ ఉండదు. ఆ బైక్‌లు కార్ప్బోరేటర్ సిస్టమ్‌తో పనిచేస్తాయి.
ఇందులో ఇంజిల్‌కు పెట్రోల్ మరియు గాలిని సరైన మోతాదులో పంపడానికి చౌక్‌ను వినియోగిస్తారు. కార్బ్యోరేటర్ బైక్‌లో కొన్ని సార్లు స్టార్టింగ్ సమస్యల వస్తాయి. ముఖ్యంగా చలికాలంలో ఇటువంటి స్టార్టింగ్ సమస్యలు ఎక్కువ ఉంటాయి. అటువంటి సమయాల్లో బైక్‌ను స్టార్ట్ చేసేందుకు చౌక్ ఉపయోగపడుతుంది.
అయితే అలాంటి సమయాల్లో చౌక్‌ను ఆన్‌చేసి.. ఆఫ్‌చేయడం మరిచిపోతాం. ఫలితంగా బైక్ అధికంగా ఇంధనాన్ని వినియోగిస్తుంది. వాస్తవానికి బైక్ స్టార్ట్ కాని సమయాల్లో ఇంజిన్‌కు ఎక్కువ ఇంధనం పంపడం ద్వారా ఇగ్నిషన్‌ను ఆన్‌చేయడం చౌక్ పని. చౌక్ ఆన్ చేయగానే కార్ప్యోరేటర్‌కు గాలి సరఫరా నిలిచిపోతుంది. మరియు ఇంజిన్‌లోకి అధికంగా ఇంధనం వెళ్లి.. బైక్ స్టార్ట్ అవుతుంది. అయితే బైక్ స్టార్ట్ అయిన వెంటనే చౌక్‌ను ఆఫ్ చేయాలి. లేకుంటే ఇంజిన్‌లోకి అధికంగా ఇంధనం వెళ్లి, మైలేజ్ తగ్గిపోతుంది.

పాత బైక్‌లలో హ్యాండిల్ బార్ పక్కన లేదా ఇంధన ట్యాంక్ కింద చౌక్ ఉంటుంది. ఇదొక లివర్ మాదిరిగా ఉంటుంది. పైకి, కిందకు కదలడం ద్వారా ఆన్ లేదా ఆఫ్ చేయకోవచ్చు. ఈ చౌక్ వినియోగం తెలిసినా, సరిగా ఉపయోగించకపోతే మీ మైలేజ్ తగ్గిపోతుంది. ఇకనైనా బైక్ స్టార్ట్ చేశాక, చౌక్‌ను ఆఫ్ చేయాలని గుర్తుపెట్టుకోండి. మీ వాహనం మైలేజ్‌ని పెంచుకోండి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








