ఎలక్ట్రిక్ కార్లు కొంటే తప్పేముంది? సినీ సెలెబ్రిటీలు ఎగబడి కొంటున్నారు!

దేశంలో సెలెబ్రిటీలు ఎక్కువగా కార్లను కొనుగోలు చేస్తున్నారు. వారికి ఒక్క హిట్‌ పడిందంటే చాలు భారీ కార్లను ఇంటికి తెచ్చేసుకుంటున్నారు. అందులోనూ సినీ ఇండస్ట్రీలో లగ్జరీ కార్లకు క్రేజ్‌ ఎక్కువ దీంతో వాళ్లు ఎక్కువగా లగ్జరీ కార్లను మాత్రమే కొనుగోలు చేస్తారు. సినీ ఇండస్ట్రీతో సమానంగా ఆటోమొబైల్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే చాలా మంది సెలెబ్రిటీలు పెట్రోల్/డీజిల్ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఎలక్ట్రిక్ వాహనాలే భవిష్యత్తు అని దాదాపు ఖరారైంది కాబట్టి వీటిని మాత్రమే కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కువగా అందుబాటులోకి వస్తున్నాయి. కాబట్టి ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనడానికి వెనుకడుగు వేయడం లేదు.

ప్రస్తుతం చాలామంది సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. నిజానికి కొందరు సినీ తారలు కొన్నేళ్లుగా ఎలక్ట్రిక్ కార్లను వాడుతున్నారు. ఇంకొందరు సాంప్రదాయ వాహనాలను కాదని కేవలం ఎలక్ట్రిక్‌ కార్లను కొనేందుకు ఓటేస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ కార్లు ఉన్న సెలబ్రిటీలపై ఓ లుక్కేద్దాం.

Raj Kundra Lotus Electre

రాజ్ కుంద్రా: నటి శిల్పా శెట్టి భర్త ఐడెంటిటీతో భారతదేశం అంతటా ఫేమస్ అయిన వ్యాపారవేత్త రాజ్ కుంద్రా. ఆయన లోటస్ ఎలెట్రే అనే లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని (Lotus Eletre electric SUV) కొనుగోలు చేశారు. తొలిసారిగా ఓ ఎలక్ట్రిక్ లగ్జరీ కార్లను కొనుగోలు చేసిన మొదటి బాలీవుడ్ నటుడుగా ఆయన నిలిచారు. ఈ ఖరీదైన లోటస్ కారు ధర సుమారు రూ. 2.55 కోట్లు.

జస్లీన్ రాయల్: దేశంలో ఫేమస్‌ అయిన ఈ యువ గాయని ఇటీవల BYD Atto 3 ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసింది. షైనింగ్‌ బ్లాక్‌ కలర్‌లో ఈ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశాడు. అటో 3 డైనమిక్, ఎక్స్టెండెడ్ రేంజ్ మరియు స్పెషల్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. జస్లీన్ రాయల్ ఏ వేరియంట్ కొనుగోలు చేసిందో తెలియ రాలేదు.

Mandira Bedi Electric Car

మందిరా బేడీ: భారతదేశంలో ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసిన మొదటి సినీ ప్రముఖులలో మందిరా బేడీ ఒకరు. చాలా సంవత్సరాల క్రితం టాటా నెక్సాన్ ఈవీని కొనుగోలు చేసిన ఆయన ఇటీవల వోల్వో సీ40 రీఛార్జ్ అనే ఖరీదైన ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశారు. వోల్వో ఎలక్ట్రిక్ ధర రూ .62.95 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా).

అధ్యాయన్ సుమన్: ప్రముఖ భారతీయ టెలివిజన్ నటుడు, సినీ నటుడు శేఖర్ సుమన్ కుమారుడు అధ్యాయన్ సుమన్ ఇటీవల ఆడి క్యూ8 ఇ-ట్రాన్ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశారు. ఈ కారును తన తండ్రి శేఖర్ సుమన్‌కి గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆడి క్యూ8 ప్రస్తుతం రూ .1.15 కోట్ల నుండి రూ .1.27 కోట్ల మధ్య (ఎక్స్-షోరూమ్, ఇండియా) ధర ఉంది.

Ram Charan Electric Car

రామ్ చరణ్: గత ఏడాది రోల్స్ రాయిస్ స్పెక్ట్రమ్ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. రోల్స్ రాయిస్ నుంచి వచ్చిన తొలి ఎలక్ట్రిక్ కారు ఇది. ఇది అల్ట్రా లగ్జరీ ఎలక్ట్రిక్ కారు. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.7.5 కోట్లు. ఈ కారులో తాజాగా బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో రామ్‌ చరణ్‌ ఫ్యామిలీతో కనిపించాడు.

ఈ కలెక్షన్ లో మనం చూసిన వారంతా గత కొన్నేళ్లలో ఎలక్ట్రిక్ కారు కొన్నవారే. ఎందుకంటే, భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ పెరుగుతుంది. తెలుగు ఇండస్ట్రీలోనూ సినీ సెలబ్రిటీలు ఎలక్ట్రిక్‌ కార్లను కొంటున్నారు. మహేశ్‌బాబు వద్ద ఖరీదైన కియా ఈవీ6 ఎలక్ట్రిక్‌ కారు ఉంది. ఇంకా చాలామంది వద్ద ఎలక్ట్రిక్‌ కార్లు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, August 31, 2024, 11:24 [IST]
English summary
Cine celebrities buying electric luxury cars check list here
Read more on: #india #celebrity cars
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+