ఆ సిటీలో హెల్మెట్లపై కఠిన నిషేధం.. కారణాలు తెలిస్తే షాక్ అవుతారు.!!
బైక్, స్కూటర్ నడపాలంటే హెల్మెట్ తప్పనిసరి. ఈ నిబంధన ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో ఉంటుంది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాదారులపై కఠిన చర్యలు తప్పవు. కానీ ఇక్కడ మనం చెప్పుకొనే ఓ నగరంలో మాత్రం ఈ రూల్ వర్తించదు. దానికి తోడు ఫుల్ ఫేస్డ్ హెల్మెట్‌లపై అక్కడ నిషేధం విధించారు. ఇందుకు కారణాలేంటి.??
టూ వీలర్‌లో రోడ్డుపై ప్రయాణించాలంటే ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యంగా రైడర్లు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఇది రూల్ మాత్రమే కాదు తప్పనిసరి. ఎందుకంటే ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో రైడర్ల ప్రాణాలకు రక్షణగా ఉండేది హెల్మెట్. లేదంటే ప్రాణాపాయం తప్పదు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాంతంలో హెల్మెట్‌పై నిషేధం ఉంది.

ఇంకా రైడర్ల తలకు పూర్తి రక్షణ కోసం ఫుల్ ఫేస్ హెల్మెట్‌లను సిఫార్సు చేస్తారు. అంతేకాకుండా ట్రాఫిక్ అధికారులు కూడా ఫుల్ ఫేస్ హెల్మెట్‌లు ధరించాలనే చెబుతారు. కానీ ఫిలిప్పీన్స్‌లోని వెస్ట్రన్ విసయాస్ ప్రాంతంలోని మున్సిపాలిటీ ఓ వింత నిర్ణయం తీసుకుంది. ఫిలిప్పీన్స్‌లోని బాకోలోడ్ సిటీలో ఫుల్ ఫేస్ మోటార్‌సైకిల్ హెల్మెట్‌లను నిషేధించారు.
ఇందుకు కారణం ఇటీవల గ్రెనేడ్ దాడి. ఈ దాడి జరిగిన తర్వాత ఫిబ్రవరి 27న మున్సిపల్ అధికారులు నగరంలో ఫుల్ ఫేస్ హెల్మెట్‌లను నిషేధించారు. నివేదికల ప్రకారం, ఫుల్ ఫేస్ హెల్మెట్ ధరించిన ఓ వ్యక్తి నగరంలోని రద్దీగా ఉండే ప్రాంతంలో గ్రెనేడ్ విసిరినట్లుగా వెల్లడైంది. గ్రెనేడ్ దాడిలో ముగ్గురు గాయపడ్డారు.. పలు వాహనాలు కూడా దెబ్బతిన్నాయి.

అయితే గ్రెనేడ్ విసిరిన సమయంలో సదరు వ్యక్తి తన ముఖాన్ని దాచుకోవడానికి ఫుల్ ఫేస్ హెల్మెట్‌ను ధరించినట్లుగా తెలిసింది. అయినప్పటికీ పోలీసులు ఆ వ్యక్తిని చాకచక్యంగా ట్రాప్ చేసి అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో దాడి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా మున్సిపల్ యంత్రాంగం గట్టి చర్యలు చేపట్టింది.
ఈ మేరకు దాడి జరిగిన మరుసటి రోజు నుంచే నగర పరిధిలో ఫుల్ ఫేస్ హెల్మెట్‌లను నిషేధిస్తూ నగర పాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 86ను జారీ చేసింది. హెల్మెట్ నిషేధంతో పాటు, అధికారులు మరికొన్ని ముందు జాగ్రత్త చర్యలు కూడా చేపట్టారు. భద్రత దృష్ట్యా నగరంలో పోలీసుల మోహరింపును కూడా పెంచారు. నగరంలో మోటార్ సైకిళ్ల వేగాన్ని గంటకు 40 కి.మీలకు తగ్గించారు.
అయితే ఈ నగరంలో అధికారులు మొత్తానికే హెల్మెట్లను నిషేధించలేదు. మళ్లీ ఉత్తర్వులు జారీ అయ్యే వరకు టూ వీలర్ నడిపేవారు.. ఓపెన్ ఫేస్ లేదా త్రీక్వార్టర్ హెల్మెట్‌లను ఉపయోగించాలని అధికారులు తెలిపారు. అయితే ఫిలిప్పీన్‌లో నగరవాసులు ఎక్కువగా ఫుల్ ఫేస్ హెల్మెట్లనే ఇష్టపడతారు. దీన్ని ఫారెస్ట్ షూటింగ్‌గా భావిస్తారు.
ఈ క్రమంలో రోడ్డు భద్రత దృష్ట్యా భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా దేశాలు.. ఫుల్ ఫేస్ హెల్మెట్లను ప్రోత్సహిస్తున్నాయి. వీటితో పాటు ప్రయాణికుల భద్రత దృష్ట్యా కొత్త రూల్స్‌ను కూడా ప్రవేశపెడుతున్నాయి. ఈ తరుణంలో.. ఫిలిప్పీన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. దీనిపై నగరవాసులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








