సిఎన్‌జితో నడిచే రైలును ప్రారంభించిన ఇండియన్ రైల్వేస్

By Ravi

ఇప్పటి వరకూ మనం బొగ్గు, డీజిల్, విద్యుత్‌తో నడిచే రైళ్లను చూశాం. ఇకపై సిఎన్‌జి (కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్)తో నడిచే రైళ్లను కూడా చూడనున్నాం. భారత రైల్వే సంస్థ దేశంలో కెల్లా మొట్టమొదటి సిజిఎన్ రైలుని ప్రారంభించింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా, ఈ ఈకో ఫ్రెండ్లీ రైలుని ప్రారంభించారు.

రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఈ సిఎన్‌జి రైలును జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఇదొక డ్యూయెల్ ఫ్యూయెల్ ట్రైన్. ఇది సిఎన్‌జి మరియు డీజిల్ ఇంధనాలతో నడుస్తుంది. రెవారీ - రోహ్‌తక్ రూట్‌లో ఈ సిఎన్‌జి రైలు సేవలు అందుబాటులో ఉంటాయి.

Indian Railways Launch First CNG Train

సిఎన్‌జి రైలును ఉపయోగించడం వలన పర్యావరణ కాలుష్యం తగ్గడమే కాకుండా, ఇంధనం కూడా ఆదా అవుతుంది. ఈ రైలు రెండు గంటల్లో 81 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి దాదాపు 20 శాతానికి పైగా సిఎన్‌జిని ఉపయోగించుకుంటుంది.

రానున్న రోజుల్లో ఈ సిఎన్‌జి శాతాన్ని 50కి పెంచాలని ఇండియన్ రైల్వే ప్లాన్ చేస్తోంది. భవిష్యత్తులో సౌర శక్తి (సోలార్ ఎనర్జీ), పవన శక్తి (విండ్ ఎనర్జీ)లను కూడా ఉపయోగించాలని భావిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఇందులోని 1400 హార్స్‌పవర్ డీజిల్ ఇంజన్‌ను పుల్ చేయటానికి ఫ్యుమిగేషన్ అనే టెక్నాలజీని ఉపయోగించారు.

More from DriveSpark

Article Published On: Friday, January 16, 2015, 12:14 [IST]
English summary
The Indian government, in the process of saving the environment, has taken a massive step towards going green by having launched their first CNG powered train.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+