100 శాతం మార్కులు సాధించిన విద్యార్థికి రూ. 2 కోట్ల విలువైన కారు గిఫ్ట్‌.. ఆశ్చర్యంలో నెటిజన్లు!

దేశంలో కార్లను చాలామంది బహుమతిగా ఇస్తారు. అయితే ఈ ట్రెడిషన్‌ ఎక్కువగా సినిమా ఫీల్డ్‌లో గమనించవచ్చు. అయితే ఈ విధానం ఇప్పుడు ట్రెండ్‌ అవుతుంది. ఇప్పుడు చాలామంది ఎక్కువగా బహుమతి రూపంలో కార్లను గిఫ్ట్‌ కింద ఇస్తున్నారు. క్రికెటర్లు, పొలిటీషన్లు సైతం ఇలాంటి కార్లను గిఫ్ట్‌గా ఇస్తూ ఉంటారు. ఖరీదైన కార్ల నుంచి వారి వద్ద పనిచేసే వారికి తగిన కార్లు ఇచ్చి వారిని ఆనంద పరుస్తారు. అయితే అందుకు భిన్నంగా ఓ వ్యక్తి తొలిసారి ఓ విద్యార్థికి ఖరీదైన కారుని గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇప్పుడు ఆ వార్త వైరల్ అవుతుంది. ఆ వ్యక్తి ఎవరు ఎందుకు అతను వార్తల్లో నిలిచాడో ఈ కథనంలో..

ఈ నేపథ్యంలో హర్యానాలోని గురుగ్రామ్‌లో ఐక్వాంటా (Iquanta Coaching Institution) క్యాట్ (కామన్ అడ్మిషన్ టెస్ట్) కోసం శిక్షణ ఇస్తుంది. ఈ కేంద్రం తాజాగా ఓ విద్యార్థికి రూ.2 కోట్ల బహుమతి ప్రకటించి పలువురి దృష్టిని ఆకర్షించింది. ఈ విషయాన్ని ఇతరులకు తెలియజేయడానికి.. పబ్లిసిటీ కోసం ఐక్వాంటా ఫేస్‌బుక్‌ పేజీలో ఈ ప్రకటన చేశారు.

Coaching-Center-Gifted-Jaguar-XJL-Car

ఇటీవలే ఓ వ్యక్తి అత్యధిక మార్కులు సాధించిన కారణంగా విద్యార్థికి రూ.2 కోట్ల విలువైన జాగ్వార్ కారును ఆ సంస్థ బహుమతిగా ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా ఆ వ్యక్తితో పాటు ఆ కోచింగ్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అయ్యింది. అసలు ఓ వ్యక్తికి రూ.2 కోట్ల విలువైన కారుని ఇప్పించడం ఏంటని అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఆ జాగ్వార్ కారు వివరాలు మీకోసం..

వాస్తవానికి ఈ కారని కోచింగ్ సెంటర్‌లో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరికీ బహుమతి ఇవ్వరు. ఇది 100% స్కోరు సాధించిన వ్యక్తికి మాత్రమే ఇస్తామని కంపెనీ విద్యార్థులకు తెలియజేసింది. ఆ ప్రకారం వారికి కారుని ఇవ్వనున్నట్లు ఐక్వాంటా ట్రైనింగ్ సెంటర్ ఫౌండర్, సీఈఓ ఇంద్రజిత్ సింగ్ విద్యార్థులకు వెల్లడించారు. ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం 100శాతం మార్కులు సాధించిన వ్యక్తికి జాగ్వార్ XJ L లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచాడు.

Gifted-Jaguar-XJL-Car-To-Student

ఈ కారు విలువ రూ.2 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. గతంలో తమ కోర్సుల్లో 100 శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్లను బహుమతిగా ఇచ్చినట్లు ఐక్వాంటా పేర్కొంది. ఇది పూర్తిగా ఐక్వాంటా ట్రైనింగ్ సెంటర్ బిజినెస్‌ వ్యూహం అని కొందరు అంటున్నారు. గిఫ్ట్‌ కింద ప్రకటించిన జాగ్వార్ ఎక్స్‌జె ఎల్ భారతదేశంలో అమ్మకానికి ఉంది.

కస్టమర్లు లేకపోవడంతో జాగ్వార్ ఇండియాలో ఈ కారు అమ్మకాలను నిలిపివేసింది. జాగ్వార్ XJ L చివరిసారిగా 2016లో లాంచ్ అయింది. దీని ధర .1.16 కోట్ల (ఎక్స్ షోరూమ్)తో ఉంది. ఇది దాదాపు ఇంపోర్ట్‌ ఇతర ఖర్చులతో కలిపి దాదాపు రూ. 2 కోట్ల వరకు ఉంటనుంది. ఇది అత్యంత ఖరీదైన లగ్జరీ సెడాన్‌గా ఉంది. ఈ జాగ్వార్ ఎక్స్ జెఎల్ రెండు ఇంజన్ ఎంపికలతో అందించబడింది.

ఈ 2.0-లీటర్ నాలుగు సిలిండర్ల టర్బోఛార్జ్డ్‌ పెట్రోల్ మరియు 3.0-లీటర్, వి6 టర్బోఛార్జ్డ్‌ డీజిల్ ఇంజిన్‌తో నడుస్తుంది. ఇందులోని టర్బో పెట్రోల్ ఇంజిన్ 237bhp పవర్ మరియు 340 nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. టర్బో డీజల్ ఇంజిన్ 296bhp పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది. మెర్సిడెస్ బెంజ్ S-క్లాస్, BMW 7-సిరీస్ మరియు ఆడీ ఎ8 వంటి వాటికి పోటీగా ఉంది.

ఈ జాగ్వార్ XJ Lను భారతదేశంలో చాలా తక్కువ మంది కొనుగోలు చేశారు. బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్‌ని ఈ జాగ్వార్ XJ L కారు ఉంది. పరీక్షలో 100% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థికి రూ .2 కోట్ల విలువైన కారుని ఇవ్వడం పబ్లిసిటీ స్టంట్‌ అని చెప్పవచ్చు. గత ఏడాది 100 శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్స్‌ని ఇదే సంస్థ బహుమతిగా ఇచ్చింది.

More from DriveSpark

Article Published On: Saturday, July 13, 2024, 14:37 [IST]
English summary
Coaching center gifted 2 crores worth jaguar xjl to a student who secured 100 percent marks in cat
Read more on: #off beat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+