విమానాల్లో కొబ్బరికాయలు తీసుకెళ్లకూడదు.. కొబ్బరి ప్రసాదం కూడా!!

విమానంలో ప్రయాణించేటప్పుడు కొన్ని వస్తువులను హ్యాండ్ లగేజీలో తీసుకెళ్లకూడదనే నిబంధన ఉంటుంది. దీనిని ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయి. ఆ లిస్ట్‌లో ముఖ్యంగా పవర్ బ్యాంక్‌లు, ఈ-సిగరెట్లు వంటి వస్తువులను తీసుకెళ్లడంపై నిషేధం ఉంది. ఇవి మండే స్వభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి వీటిని వెంట తీసుకెళ్లేందుకు అనుమతించరు. అయితే తాజాగా కొబ్బరికాయలను కూడా నిషేధిత జాబితాలో చేర్చారు. మీరు విన్నది నిజమే మీ సామానులో కొబ్బరికాయలు ఇకపై క్యారీ చేయకూడదు. అసలు కొబ్బరికాయలను ఎందుకు తీసుకెళ్లకూడదనే విషయాన్ని మేము ఇక్కడ వివరించబోతున్నాం..

జీవితంలో చాలామందికి విమానాల్లో ప్రయాణించాలనే కోరిక ఉంటుంది. అందుకే విమానాల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తారు. దీనికి కారణం ఒకప్పుడు కేవలం సంపన్నులు మాత్రమే విమానాల్లో ప్రయాణించేవారు. తాజాగా విమాన ప్రయాణం అందరికి అందుబాటులో వచ్చింది. దీంతో ప్రతి ఒక్కరూ విమాన ప్రయాణాన్ని వినియోగిస్తున్నారు. అయితే విమాన ప్రయాణాలకు ఎప్పుడు ముప్పు పొంచి ఉంటుంది. ఈ ప్రమాదాలను తగ్గించడానికి, ప్రయాణీకులు హ్యాండ్ లగేజీలో కొన్ని వస్తువులను తీసుకెళ్లకుండా ఆంక్షలు ఉన్నాయి.

Coconuts are not allowed in Flights

ముఖ్యంగా ప్రయాణికులు విమానం లోపల సిగరెట్ లైటర్లు, ఈ-సిగరెట్లు, పవర్ బ్యాంకులు తదితర వస్తువులను తీసుకెళ్లకూడదనే నిబంధనలు ఉన్నాయి. విమానాశ్రయాల్లో భద్రతా తనిఖీ సమయంలో తనిఖీ సమయాల్లో వీటిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అక్కడ ఈ వస్తువులు పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటారు. వీటిని నిషేధించడానికి ప్రధాన కారణం ఇవి మండే స్వభావం కలిగి ఉన్నాయి.

విమానం గాలిలో ఎగురుతున్నప్పుడు, ఈ పదార్థాల కారణంగా మంటలు సంభవించే అవకాశం ఉంటుంది. అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నందున ప్రయాణికులు అలాంటి వస్తువులను విమానం లోపలకు తీసుకెళ్లడం నిషేధించారు. దీని విషయంలో ఎలాంటి మినహాయింపు ఉండదు. విదేశాలకు వీటి రవాణా కోసం నౌకాయనంపై ఆధారపడాల్సి ఉంటుంది.

Coconuts are not allowed in aeroplane recently this product block listed in blocklist

అందుకే విమానాల్లో ప్రయాణించే వారి వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతించబడతాయి. ఏదైనా ఊహించని సంఘటన జరిగినప్పుడు మంటలు చెలరేగి ప్రమాదం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ‌అందుకే తాజాగా కొబ్బరికాయలు తీసుకెళ్లకూడదనే నిబంధన అమల్లోకి వచ్చింది. అంతే కాకుండా ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లే చాలా మంది యాత్రికులు ఆలయంలో కొబ్బరికాయలను ప్రసాదంగా కొనుగోలు చేసి తమ హ్యాండ్‌బ్యాగ్‌లలో ఉంచుకుంటారు. ఇవి కూడా విమానంలో తీసుకెళ్లేందుకు వీలు లేదు.

చాలా మంది ప్రయాణికులు ఈ వింత నియమాన్ని విని ఆశ్చర్యపోతున్నారు. అయితే దీని వెనుక శాస్త్రీయ కారణం (Scientific reason) ఉంది. మండే వస్తువుల్లో కొబ్బరి కూడా ఉంది. ఇది మంటలను ఎక్కువ అయ్యేలా చేస్తుంది. ఈ కారణంగానే ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. కొబ్బరి చాలా మండే పదార్థం కాబట్టి దానిని రవాణా చేయడానికి అనుమతి లేదు.

కొబ్బరిని ఏ రూపంలోనూ (ఎండిన, ప్రసాదం, పచ్చి కొబ్బరి) తీసుకెళ్లడానికి అనుమతి లేదు. ముఖ్యంగా పగిలిన, ఎండిపోయిన కొబ్బరికాయలలో నూనె పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది అధికంగా మండే పదార్థం కాబట్టి ఇది కూడా రవాణా చేయడానికి అనుమతించబడదు.

అయితే దేశంలో కొన్ని విమానాశ్రయాలు పగిలిన కొబ్బరికాయను తీసుకెళ్లడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. కొన్ని విమానాశ్రయాలు తనిఖీ చేసిన లగేజీలో అన్ని రకాల కొబ్బరికాయలను తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. అయితే కొన్ని విమానాశ్రయాల్లో కొబ్బరికాయలను ఎలాంటి లగేజీలోనూ అనుమతించరు. కొబ్బరికాయలు ఎక్కువగా మండే పదార్థం కాబట్టి ఇది నిషేధం. కాబట్టి మీరు కొబ్బరికాయను విమానంలో తీసుకెళ్లాలనుకుంటే జాగ్రత్తగా ఉండండి.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, June 21, 2024, 17:33 [IST]
English summary
Coconuts not allowed to carry on flight reason for red list
Read more on: #off beat #offbeat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+