పురుషులకంటే తక్కువేం కాదు అంటున్న కోయంబత్తూర్ మహిళ.. ఎందుకంటే?

ప్రస్తుతం మనం 21 శతాబ్దంలో ఉన్నాం. ఈ శతాబ్దం అభివృద్ధి వైపు వేగంగా పయనిస్తోంది. స్త్రీలు ఒకప్పుడు వంటింటికి మాత్రమే పరిమితం అనే బ్రతికేవాళ్లు. అయితే ఈ రోజు ఆధునిక మహిళలు అనేక రంగాలలో తమదైన ముద్ర వేస్తున్నారు. స్తీ ప్రవేశించని రంగం ఏది లేదు అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

పురుషులకంటే తక్కువేం కాదు అంటున్న కోయంబత్తూర్ మహిళ.. ఎందుకంటే?

ప్రతి రంగంలోనూ వారి విజయం ద్వారా మేము పురుషుల కంటే ఏ మాత్రం, ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. నేడు అంతరిక్షంలో కూడా స్త్రీ అడుగుపెట్టి వచ్చేస్తుంది, అంటే ఏ స్థాయికి ఎదిగింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలం. ఇంతటి స్థాయిలో ఉన్న మహిళ ఇప్పటికి వాహనాలను నడిపే విషయంలో మాత్రం పురుషుడి కంటే కూడా కొంత వెనుకబడి ఉందని చెప్పక తప్పదు.

పురుషులకంటే తక్కువేం కాదు అంటున్న కోయంబత్తూర్ మహిళ.. ఎందుకంటే?

ఇప్పుడు మహిళలు కార్లు, బైకులు వంటి వాటిని అవలీలగా నడుపుతున్నారు. అయితే భారీ వాహనాలైన ట్రక్కులు మరియు జెసిబి వంటి వాటిని నడిపే స్త్రీలు చాలా తక్కువ. అయితే కోయంబత్తూరుకు చెందిన ఒక మహిళ పురుషులతో సమానంగా బొక్లైన్ మెషిన్ నడుపుతూ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

పురుషులకంటే తక్కువేం కాదు అంటున్న కోయంబత్తూర్ మహిళ.. ఎందుకంటే?

భారీ వాహనాలు నడపడానికి సంకోచించే మహిళలకు ఆమె ఒక రోల్ మోడల్. ఈమె కూడా ఈ పని ద్వారా మరింత ఆదాయాన్ని పొందుతున్నారు. బొక్లైన్ మెషిన్ మెషిన్ నడుపుతున్న మహిళ పేరు అంగల ఈశ్వరి. ఈమె తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాకు చెందిన మహిళ.

పురుషులకంటే తక్కువేం కాదు అంటున్న కోయంబత్తూర్ మహిళ.. ఎందుకంటే?

కొన్ని రోజుల క్రితం, కోయంబత్తూర్‌లోని మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ అధికారిక పంపిణీదారు అయిన చారు సిండికేట్ మహీంద్రా, మహిళలకు బొక్లైన్ మెషిన్ ఆపరేట్ చేయడానికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ ట్రైనింగ్ వర్క్‌షాప్‌లో పలువురు మహిళలు పాల్గొన్నారు. వారిలో అంగల ఈశ్వరి ఒకరు.

ఇటువంటి వాహనాన్ని నడిపి పలువురి ప్రశంసలు పొందుతోంది. ఇది మహిళలను మరింత గర్వపడేలా చేస్తుంది. ఇటీవల కాలంలోనే కేరళలో ఒక యువతి పెద్ద ట్రక్కును నడిపి ఎంతోమంది ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు అంగల ఈశ్వరి బొక్లైన్ మెషిన్ నడుపుతుండటం తమిళనాడు ప్రజలను మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

పురుషులకంటే తక్కువేం కాదు అంటున్న కోయంబత్తూర్ మహిళ.. ఎందుకంటే?

బొక్లైన్ మెషిన్లను సాధారణంగా పురుషులు నిర్వహిస్తారు. ఇప్పుడు అంగల ఈశ్వరి బోక్లైన్ మెషిన్ నడపడం ద్వారా మహిళలు పురుషుల కంటే తక్కువ కాదని నిరూపించింది. ఈ నేపథ్యంలో, మహిళా సంఘాలు మరియు కొన్ని ప్రైవేట్ సంస్థలు సోషల్ మీడియాలో కోయంబత్తూరుకు చెందిన ఈశ్వరికి అభినందనలు తెలుపుతున్నాయి.

పురుషులకంటే తక్కువేం కాదు అంటున్న కోయంబత్తూర్ మహిళ.. ఎందుకంటే?

బాక్‌లైన్ మెషిన్‌లను నిర్వహించడం అంత తేలికైన విషయం కాదు. అపారమైన అనుభవం ఉన్న మగ డ్రైవర్లు మాత్రమే ఈ బాక్లైన్ మెషిన్‌లను నడపగలరు. ఇంతటి క్లిష్టమైన వాహనాన్ని నడపడానికి పూనుకున్న అంగలా ఈశ్వరి ధైర్యం నిజంగా ప్రశంసనీయం.

పురుషులకంటే తక్కువేం కాదు అంటున్న కోయంబత్తూర్ మహిళ.. ఎందుకంటే?

అంగల ఈశ్వరి ఒక ప్రైవేట్ సంస్థ అందించిన శిక్షణ ఆధారంగా ఈ పనిలో నిమగ్నమై ఉంది. చారు సిండికేట్ మరియు మహీంద్రా అండ్ మహీంద్రా వంటి కొన్ని ప్రైవేట్ కంపెనీలు మహిళలకు సాధికారత కల్పించే సామాజిక పనిలో పాలుపంచుకోవడం గమనార్హం. పాలీమర్ న్యూస్ అంగాల ఈశ్వరి గురించి నివేదికను అందించింది.

Source: Polimernews

Most Read Articles

English summary
Coimbatore lady becomes the first woman in tamil nadu to drive a bokline machine details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X