అక్కడ వాహనాలకు ఇప్పుడు కలర్ కోడెడ్ స్టిక్కర్ తప్పనిసరి.. లేకుంటే?

భారతదేశపు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, దేశ రాజధాని నగరం ఢిల్లీలో ప్రజా రహదారులపైన తిరిగే వాహనాలు తప్పని సరిగా ఇంధనం ఆధారంగా వాహనాలను గుర్తించేందుకు కలర్ స్టిక్కర్లను ఉపయోగించాలని ఢిల్లీ రవాణా శాఖ ప్రకటించింది. సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్, 1989 ప్రకారం, ఢిల్లీలో రిజిస్టర్ చేయబడిన అన్ని వాహనాలపై క్రోమియం ఆధారిత హోలోగ్రామ్ స్టిక్కర్‌ను ప్రదర్శించడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు ఇటీవల జారీ చేసిన నోటీసులో పేర్కొంది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

అక్కడ వాహనాలకు ఇప్పుడు కలర్ కోడెడ్ స్టిక్కర్ తప్పనిసరి.. లేకుంటే

సుప్రీంకోర్టు జరీ చేసిన ఈ నోటీసులో, వాహన యజమానులు తమ వాహనం యొక్క విండ్‌షీల్డ్‌పై సంబంధిత ఇంధన కేటగిరీల వారీగా క్రోమియం ఆధారిత హోలోగ్రామ్ స్టిక్కర్లను పొందడానికి సంబంధిత విక్రేతలను సంప్రదించవలసిందిగా సూచించబడింది. రహదారి తనిఖీల సమయంలో వాహనం యొక్క ఇంధన రకాన్ని గుర్తించడానికి ఈ స్టిక్కర్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బందికి చాలా సహాయపడతాయి. ఈ కలర్ స్టిక్కర్స్ వల్ల ఆ వాహనం ఎటువంటి ఇంధన కేటగిరికి చెందింది అని సులభంగా గుర్తించవచ్చు.

అక్కడ వాహనాలకు ఇప్పుడు కలర్ కోడెడ్ స్టిక్కర్ తప్పనిసరి.. లేకుంటే

వాహనాలపైన వేసే ఈ కలర్ కోడెడ్ స్టిక్కర్లు వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్, రిజిస్ట్రేషన్ అథారిటీ, లేజర్-బ్రాండెడ్ పిన్ మరియు ఇంజిన్ మరియు ఛాసిస్ నంబర్లు వంటి వివరాలను కూడా ప్రదర్శిస్తాయి. ఏప్రిల్ 2019 కి ముందు ఢిల్లీలో రిజిస్టరైన వాహనాల్లో స్టిక్కర్లు పెట్టాలనే నిబంధన వర్తించదు, కావున ఈ వాహనాలకు ఈ స్టిక్కర్ అవసరం లేదు. వాహన వినియోగదారులు దీనిని గమనించాలి.

అక్కడ వాహనాలకు ఇప్పుడు కలర్ కోడెడ్ స్టిక్కర్ తప్పనిసరి.. లేకుంటే

అయితే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో ఇంధన ఆధారిత కలర్ స్టిక్కర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీ రవాణా శాఖ నిబంధనల ప్రకారం బిఎస్-3 మరియు బిఎస్-4 పెట్రోల్/CNG ఇంజిన్ వాహనాలకు లేత నీలం రంగు స్టిక్కర్, డీజిల్ వాహనాలకు నారింజ రంగు స్టిక్కర్స్ వినియోగించాలి.

అక్కడ వాహనాలకు ఇప్పుడు కలర్ కోడెడ్ స్టిక్కర్ తప్పనిసరి.. లేకుంటే

ఇక బిఎస్-6 వాహనాలలో పెట్రోల్/CNG వాహనాలకు కలర్ కోడ్ తయారు చేయబడింది, వీటికి గ్రీన్ కలర్ స్టిక్కర్ ఉపయోగించాలి. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వాహనాలపై ఢిల్లీ రవాణా శాఖ రూ. 5,500 నుంచి రూ.10,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కావున వాహనదారులు తప్పకుండా ఈ నియమాలను పాటించాలి.

అక్కడ వాహనాలకు ఇప్పుడు కలర్ కోడెడ్ స్టిక్కర్ తప్పనిసరి.. లేకుంటే

రవాణా శాఖ ప్రకారం, స్టిక్కర్ గురించి ప్రస్తుతం అవగాహన పెరుగుతోంది మరియు సమీప భవిష్యత్తులో ఎలాంటి ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ నిర్వహించాలని డిపార్ట్‌మెంట్ ప్లాన్ చేయదు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ చలికాలంలో కూడా ఢిల్లీలో వాయుకాలుష్యం సమస్య మొదలైంది. దీన్ని అరికట్టేందుకు ఢిల్లీ పోలీసులు కాలుష్యం కలిగించే వాహనాలపై చర్యలను ముమ్మరం చేశారు. ముఖ్యంగా కాలపరిమితి దాటిన పాత వాహనాలపై పోలీసులు భారీ జరిమానాలు విధిస్తున్నారు. ఇలాంటి వాహనాలపై చర్యలు తీసుకునేందుకు ఢిల్లీ పోలీసులు 170 చోట్ల ప్రత్యేక బృందాలను మోహరించారు.

అక్కడ వాహనాలకు ఇప్పుడు కలర్ కోడెడ్ స్టిక్కర్ తప్పనిసరి.. లేకుంటే

ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోతున్న సమయంలో అక్కడి ప్రభుత్వం ఇటీవల రెండు రోజులు స్వల్ప లాక్ డౌన్ కూడా అమలుచేసింది. దీన్ని బట్టి చూస్తే ఢిల్లీలో కాలుష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కావున వాహన వినియోగదారులు కూడా తప్పనిసరిగా ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించకుండా సహకరించాలి.

అక్కడ వాహనాలకు ఇప్పుడు కలర్ కోడెడ్ స్టిక్కర్ తప్పనిసరి.. లేకుంటే

రవాణా శాఖ సూచనల మేరకు ఢిల్లీ పోలీసులు 2021 నవంబర్ 1 నుంచి 17 వరకు నగరంలో 3,400 మంది వాహనదారులకు దాదాపుగా రూ.3.5 కోట్ల జరిమానా విధించారు. అక్టోబర్‌లో రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ బృందాలు 8,25,681 వాహనాలను తనిఖీ చేసి ఏకంగా రూ.9.5 కోట్ల విలువైన 9,522 చలాన్‌లు జారీ చేశాయి.

అక్కడ వాహనాలకు ఇప్పుడు కలర్ కోడెడ్ స్టిక్కర్ తప్పనిసరి.. లేకుంటే

ఢిల్లీలో నమోదైన మొత్తం 1.34 కోట్ల వాహనాల్లో దాదాపు 17.71 లక్షల వాహనాలు అక్టోబర్ మధ్య వరకు చెల్లుబాటు అయ్యే పీయూసీ లేకుండానే నగరంలో తిరుగుతున్నాయి. వాయు కాలుష్య సమస్యను పరిష్కరించడానికి, ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో 15 సంవత్సరాల కంటే పాత పెట్రోల్ వాహనాలు మరియు 10 సంవత్సరాల కంటే పాత డీజిల్ వాహనాలను సుప్రీంకోర్టు నిషేధించింది. ఇది కాకుండా, చెల్లుబాటు అయ్యే PUC కూడా ఇప్పుడు తప్పనిసరి చేయబడింది.

అక్కడ వాహనాలకు ఇప్పుడు కలర్ కోడెడ్ స్టిక్కర్ తప్పనిసరి.. లేకుంటే

ప్రభుత్వం నిర్దేశించిన చెల్లుబాటు అయ్యే PUC లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడిన వారికి ఇప్పుడు ఏకంగా రూ. 10,000 జరిమానా విధించే అవకాశం ఉంది. అంతే కాకుండా వాహనం యొక్క పియుసి చేయకపోతే, డ్రైవింగ్ లైసెన్స్ కూడా 3 నెలల వరకు రద్దు చేయబడుతుంది. వీటిని వాహనదారులు తప్పకుండా గుర్తుంచుకోవాలి.

Most Read Articles

English summary
Colour coded stickers on vehicles in delhi mandatory fine details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X