ఈ వాహనాలు టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు; కర్ణాటక గవర్నమెంట్

భారతదేశంలో రోజురోజుకి అధికంగా వ్యాపిస్తున్న కరోనా మహమ్మారి వల్ల దాదాపు అన్ని వాహన సేవలు నిలిపివేయబడ్డాయి. ఇందులో భాగంగానే ప్రజా రవాణా కూడా మొత్తం నిలిపివేయబడింది. అత్యవసర సమయంలో మాత్రమే వాహనదారులు బయటకు రావాలనే నిబంధనలు కూడా అమలులో ఉన్నాయి.

ఈ వాహనాలు టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు; కర్ణాటక గవర్నమెంట్

కరోనా మహమ్మారి మొత్తం భారతదేశాన్ని ప్రభావితం చేస్తోంది. ఇందులో భాగంగానే రవాణా సంబంధిత వాహనాలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాణిజ్య వాహన నిర్వాహకులకు ఉపశమనం కల్పిస్తూ మే నెలలో మోటారు వాహనాల టాక్స్ మాఫీ చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ వాహనాలు టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు; కర్ణాటక గవర్నమెంట్

దీనిపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, రవాణా మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర వాణిజ్య వాహన నిర్వాహకులు మే లో మోటారు వాహన టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కావున కమర్షియల్ వాహనదారులు ఈ మే నెల టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.

MOST READ:కొత్త అవతార్‌లో కనిపిస్తున్న మాడిఫైడ్ మహీంద్రా బొలెరో; వివరాలు

ఈ వాహనాలు టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు; కర్ణాటక గవర్నమెంట్

రాష్ట్రంలో కోవిడ్ -19 యొక్క సెకండ్ వేవ్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేసింది. ఈ లాక్ డౌన్ కారణంగా కారణంగా వాణిజ్య వాహనాల ఆపరేషన్ పూర్తిగా దెబ్బతినింది. ఇలాంటి సమయంలో ఆపరేటర్లకు ఉపశమనం కలిగిస్తూ మేలో పన్ను నుంచి మినహాయింపు కల్పించబడింది ఉప ముఖ్యమంత్రి తెలిపాడు.

ఈ వాహనాలు టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు; కర్ణాటక గవర్నమెంట్

కర్ణాటక ట్రాన్స్‌పోర్ట్ యూనియన్ దీనిపై స్పందిస్తూ, ఏప్రిల్‌లో లాక్‌డౌన్ ప్రారంభమైనప్పటి నుండి ఒక నెల ఉపశమనం సరిపోదని తెలిపింది. కరోనా లాక్ డౌన్ ముగిసినప్పటికీ వ్యాపారంపై తప్పకుండా ప్రభావం ఉంటుందని వారు స్పష్టం చేశారు.

MOST READ:రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సోనాలిక.. ఏంటనుకుంటున్నారా?

ఈ వాహనాలు టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు; కర్ణాటక గవర్నమెంట్

ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకుని 2021 ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు టాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలని యూనియన్ పేర్కొంది. రాష్ట్ర ప్రైవేటు బస్సు ఆపరేటర్లు, కండక్టర్ల కోసం ప్రభుత్వం రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించలేదని, ఇది వారికి బాధ కలిగించిందని యూనియన్ తెలిపింది.

ఈ వాహనాలు టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు; కర్ణాటక గవర్నమెంట్

ఇటీవల కర్ణాటక ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే సంస్థలను ఆకర్షించడానికి ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని కొంతవరకు మార్చింది. ఇందులో భాగంగానే స్థిరాస్తుల విలువపై 15% మూలధన రాయితీని అందించాలని కర్ణాటక ప్రభుత్వ మంత్రివర్గం నిర్ణయించింది.

MOST READ:ACP అని చెప్పుకున్న వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా?

ఈ వాహనాలు టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు; కర్ణాటక గవర్నమెంట్

ఇది మాత్రమే కాకుండా మంత్రివర్గం మరో నిర్ణయం కూడా తీసుకుంది. దీని ప్రకారం టర్నోవర్‌పై 1% ఉత్పత్తి రాయితీని ఇవ్వడం ద్వారా కంపెనీలను ప్రోత్సహిస్తారు. ఇందులో కూడా పెద్ద, మెగా, అల్ట్రా, సూపర్ మెగా ఎలక్ట్రిక్ వెహికల్ అసెంబ్లీ మరియు తయారీ యూనిట్లకు ఈ ప్రోత్సాహకాలు మొదటి సంవత్సరం నుండి ప్రారంభమయ్యి ఐదేళ్ల వరకు అందించబడతాయి.

ఈ వాహనాలు టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు; కర్ణాటక గవర్నమెంట్

ఎలక్ట్రిక్ వాహన తయారీదారులు అందించే ట్రైనింగ్ ని మరింత ప్రోత్సహించడానికి కర్ణాటక ప్రభుత్వం ట్రైనీ ఖర్చులో 50 శాతం ఇవ్వనుంది. కర్ణాటక ప్రభుత్వం దాదాపు 400 ఎకరాల భూమితో బెంగళూరులోని బిడారి సమీపంలో ఈవీ పార్క్ ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది.

MOST READ:ప్రవహించే నదిలో మహీంద్రా ఎక్స్‌యూవీ300; వైరల్ అవుతున్న వీడియో

Most Read Articles

English summary
Commercial Vehicles In Karnataka Exempted From Motor Vehicle Tax For May. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X