పెట్రోల్ ధరలు సామాన్యులపై ఎలాంటి ప్రభావాన్ని చూపవు: బిజెపి మంత్రి

పెట్రోల్, డీజిల్ ధరలు నిరవధికంగా పెరగడంపై దేశవ్యాప్తంగా ప్రజలు, ప్రతిపక్షాలు తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నాయి. ఇదే అంశంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా అధికం అవుతున్నాయి. అయితే, అధికార పక్షంలో ఉన్న కొందరు మాత్రం ఈ ధరల పెంపును సమర్థిస్తున్నారు.

పెట్రోల్ ధరలు సామాన్యులపై ఎలాంటి ప్రభావాన్ని చూపవు: బిజెపి మంత్రి

పెట్రోల్, డీజిల్ ధరలపై తాజాగా బీహార్‌కి చెందిన బిజెపి మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం లేపుతున్నాయి. పెరిగిన ఇంధన ధరలు సామాన్యుడిపై ఎలాంటి ప్రభావాన్ని చూపబోవని బీహార్‌ మంత్రి, బిజెపి నాయకుడు నారాయణ ప్రసాద్ అన్నారు.

పెట్రోల్ ధరలు సామాన్యులపై ఎలాంటి ప్రభావాన్ని చూపవు: బిజెపి మంత్రి

సామాన్య ప్రజలు బస్సుల్లో ప్రయాణిస్తారని, కొద్దిమంది మాత్రమే ప్రైవేట్ వాహనం ద్వారా ప్రయాణిస్తున్నారు కాబట్టి, ఈ ధరల పెంపు వారిపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆయన అన్నారు.

MOST READ:డ్రైవింగ్ లైసెన్స్‌లోని ఈ చిత్రం భలే విచిత్రం..చూసారా..!

పెట్రోల్ ధరలు సామాన్యులపై ఎలాంటి ప్రభావాన్ని చూపవు: బిజెపి మంత్రి

దేశంలోని చాలా నగరాల్లో పెట్రోల్ ధర అత్యధికంగా లీటరుకు రూ.100 లకు దాటిపోయింది. వాస్తవానికి ఇంధన ధరలు పెరిగితే, దానిపై ఆధారపడిన ఇతర రవాణా చార్జీలు మరియు సరుకుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.

పెట్రోల్ ధరలు సామాన్యులపై ఎలాంటి ప్రభావాన్ని చూపవు: బిజెపి మంత్రి

నిజానికి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా రవాణా ఖర్చులు పెరిగి నిత్యావరస సరుకుల ధరలు కూడా పెరగటం ప్రారంభించాయి. ఈ విషయంపై ప్రతిపక్షాలు ప్రధానిని నిందిస్తుంటే, ఇంధన ధరలపై నియంత్రణ ప్రభుత్వం చేతిలో లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అంటున్నారు.

MOST READ:మంత్రి కాన్వాయ్ ఓవర్‌టేక్ చేయడంతో చిక్కులో పడ్డ పర్యాటకులు

పెట్రోల్ ధరలు సామాన్యులపై ఎలాంటి ప్రభావాన్ని చూపవు: బిజెపి మంత్రి

కొత్త సంవత్సరం ప్రారంభమైనప్పటి నుండి పెట్రోల్, డీజిల్ ధరలు అనేకసార్లు పెరిగాయి. రెండు రోజుల అంతరాయం తరువాత, ఇంధన ధరలు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. ప్రస్తుతం చాలా ప్రధాన నగరాల్లో లీటరు పెట్రోల్ ధర రూ.90 దాటిపోయింది. మరికొన్ని నగరాల్లో రూ.100 కు చేరుకుంది. ఫిబ్రవరి 23న ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.90.97గా ఉంది.

పెట్రోల్ ధరలు సామాన్యులపై ఎలాంటి ప్రభావాన్ని చూపవు: బిజెపి మంత్రి

గల్ఫ్ దేశాలు పెట్రోలియం ఉత్పత్తిని తగ్గిస్తున్నాయని, దీని కారణంగా దేశంలో పెట్రోల్ ధరలు నిరంతరం పెరుగుతున్నాయని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఇంధన దిగుమతి అవసరాలలో 80 శాతం మాత్రమే తీర్చబడుతోందని, దీని కారణంగా డిమాండ్ మరియు సరఫరా సమన్వయం చేయబడలేదని ఆయన అన్నారు.

MOST READ:రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లపై విరుచుకుపడుతున్న పోలీసులు.. కారణం ఇదే

పెట్రోల్ ధరలు సామాన్యులపై ఎలాంటి ప్రభావాన్ని చూపవు: బిజెపి మంత్రి

కాగా, పెట్రోల్ మరియు డీజిల్ ధరల ప్రభావం ప్రత్యక్షంగానే సామాన్యులపై పడుతోంది. ఇప్పటికే ముంబైలో ఆటోలు మరియు టాక్సీలు కిలోమీటరుకు 3 రూపాయల ఛార్జీని పెంచగా, రవాణాపై అధారపడిన సరుకులు ధరలు కూడా నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి.

పెట్రోల్ ధరలు సామాన్యులపై ఎలాంటి ప్రభావాన్ని చూపవు: బిజెపి మంత్రి

బిజెపి నాయకుడు నారాయణ ప్రసాద్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ద్రవ్యోల్బణం ప్రజలకు అలవాటైన విషయమేనని, ఇంధన ధరల విషయంలో కూడా వారు రాబోయే రోజుల్లో దీనిని అలవాటు చేసుకుంటారని అన్నారు. మరి ఈ మంతి చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

MOST READ:వామ్మో.. పోలీస్ స్టేషన్ సమీపంలో ఆపి ఉంచిన కారు టైర్లనే దొంగలించారు.. ఎక్కడనుకుంటున్నారా..!

Most Read Articles

English summary
Common People Will Not Be Affected By The Rising Fuel Prices, Says Bihar BJP Minister. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X